
సూపర్ స్టార్ మహేష్ బాబు ‘SSMB29’ సినిమా కోసం రాజమౌళి నిర్వహించబోయే ‘Globetrotter’ ఈవెంట్ పై భారీ అంచనాలున్నాయి. ఈ క్రమంలో సింగపూర్ నుండి 6817 కిలోమీటర్లు ప్రయాణించి ఒక అభిమాని హైదరాబాద్ చేరుకున్నాడు. ఈ ప్రత్యేక సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Key Points
సూపర్ స్టార్ మహేష్ బాబు 'SSMB29' ప్రాజెక్ట్ కోసం రాజమౌళి 'Globetrotter' ఈవెంట్.
సింగపూర్ నుండి 6817 కి.మీ. ప్రయాణం చేసి వచ్చిన సునీల్ ఆవుల అనే అభిమాని.
ఈ విషయంపై రాజమౌళి తనయుడు కార్తికేయ భావోద్వేగ ట్వీట్ వైరల్.
అభిమాని రాకతో ప్రపంచవ్యాప్తంగా 'SSMB29' ఈవెంట్‌పై అంచనాలు మరింత పెరిగాయి.
‘SSMB29’ ఈవెంట్ హైలైట్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), రాజమౌళి(Rajamouli) కాంబోలో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ‘SSMB29’ వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. ఇందులో ఆయన కుంభ పాత్రలో నటిస్తున్నట్లు తెలుపుతూ వీల్ చైర్‌లో కూర్చొని ఉన్న పోస్టర్‌తో అంచనాలను పెంచేశారు. అలాగే ప్రియాంక చోప్రా మందాకినిగా నటిస్తున్నట్లు తెలిపారు. అయినప్పటికీ అభిమానుల ఆకలి తీరలేదు. ఇక మహేష్ బాబు ఫస్ట్ లుక్ ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా?అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో.. రాజమౌళి నవంబర్ 15న సాయంత్రం రామోజీ ఫిలిం సిటీలో Globetrotter పేరుతో ఓ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు.
సింగపూర్ నుంచి అభిమాని ప్రయాణం
అలాగే ఈ వేడుకకు వెళ్తేందుకు ఈవెంట్‌పాస్‌కు బదులుగా పాస్‌పోర్టు పేరుతో ఓ కార్డ్ ఇచ్చారు. దానిపై మహేష్ బాబు SSMB-29 సినిమాలో వేసుకునే లాకెట్‌ను దానిపై డిజైన్ చేసి ఉంచారు. రాజమౌళి ఇప్పటికే ఎంతోమందిని ఈ పాస్‌లను జారీ చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ ఈవెంట్ కోసం ఓ వ్యక్తి ఏకంగా 6817 కీలోమీటర్ల దూరం నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు ఓ పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. చాలా ఏళ్ల తర్వాత మహేష్ బాబు కోసం ఇక్కడికి వచ్చినట్లు అందులో పేర్కొన్నాడు. ఈ విషయాన్ని తెలుపుతూ దర్శకధీరుడి తనయుడు కార్తీకేయ ఓ ట్వీట్ పెట్టాడు. సునీల్ ఆవుల అనే అభిమాని ‘SSMB-29’ ఈవెంట్ కోసం సింగపూర్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నాడు.
కార్తికేయ ట్వీట్: వైరల్ అయిన పోస్ట్
ఇక సింగపూర్ నుంచి 12 గంటల పాటు ప్రయాణం చేసి మరీ రావడం గమనార్హం. ఈ విషయంపై కార్తికేయ.. ‘‘ఒక తెలుగోడు మాత్రమే అనుభూతి చెందే బిగ్గెస్ట్ ఎమోషన్ ఇదే. ఆకాశంనీ హద్దు’’ అనే క్యాప్షన్ జత చేస్తూ అతని టికెట్ వివరాలను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు గ్రేట్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే రాష్ట్రాలు, దేశాలు దాటి ఒక హీరో కోసం రావడం నిజంగా పెద్ద విషయం అని కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ వేడుక కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహేష్ అభిమానులు హాజరు అవ్వబోతున్నట్లు టాక్.
వేల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన అభిమానిపై కార్తికేయ ట్వీట్ వైరల్ అవ్వడం, ‘SSMB29’ ఈవెంట్ పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహేష్ అభిమానుల ప్రేమను, ఆతృతను తెలియజేస్తోంది. ఈ ఈవెంట్ మరిన్ని విశేషాలకు వేదిక కానుంది.


