|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బడ్జెట్ దెబ్బ: బాలయ్య సినిమా కథ మారిందా? గోపీచంద్ సంచలన నిర్ణయం!

Published: 06-02-2026, 11:35 PM
బడ్జెట్ దెబ్బ: బాలయ్య సినిమా కథ మారిందా? గోపీచంద్ సంచలన నిర్ణయం!
  • గోపీచంద్, బాలకృష్ణ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా బడ్జెట్ సమస్యల కారణంగా కథ మార్పు.
  • ముంబై నేపథ్యంలో స్టైలిష్ మాస్ యాక్షన్ మూవీగా రూపొందనున్న చిత్రం.
  • నయనతార హీరోయిన్‌గా ఎంపిక, మార్చి మొదటి వారం నుండి సెట్స్ మీదకు వెళ్లనున్న సినిమా.
  • బాలకృష్ణ సింగిల్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు, ఇది గత చిత్రాల మాదిరిగా ఉండదు.

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న సినిమా బడ్జెట్ సమస్యల కారణంగా కథను మార్చుకుంది. మొదట చారిత్రక కథ అనుకున్నప్పటికీ, ఇప్పుడు ముంబై నేపధ్యంలో స్టైలిష్ యాక్షన్ మూవీగా తెరకెక్కించనున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది.

బడ్జెట్ వల్ల మారిన బాలకృష్ణ సినిమా కథ

Gopichandh -Balakrishna:సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా తెరకెక్కేటప్పుడు కథకు తగ్గట్టుగా బడ్జెట్ ను కూడా కేటాయించాల్సి ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతేకాదు కథ డిమాండ్ చేస్తే బడ్జెట్ ఎక్కువ పెట్టాల్సిన సందర్భాలు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఆ కారణంగా ఆచితూచి అడుగులు వేస్తూ నిర్మాతలు ఆ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రేక్షకులకు మంచి విజువల్ వండర్ ను చూపించడానికి సిద్ధమవుతూ ఉంటారు. అయితే ఈ బడ్జెట్ కారణంగా అప్పుడప్పుడు సినిమాలు కొంతకాలం వాయిదా పడిన విషయం కూడా తెలిసిందే. కానే అదే బడ్జెట్ వల్ల ఆగిపోయిన చిత్రాలు కూడా లేకపోలేదు. అయితే ఇప్పుడు ఏకంగా ఈ బడ్జెట్ కారణంగానే కథనే మార్చేశారు అని తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అసలు విషయంలోకి వెళ్తే ఇదివరకే గోపీచంద్ మలినేని (Gopichandh malineni), బాలకృష్ణ(Balakrishna ) కాంబినేషన్లో 2024 సంక్రాంతి సందర్భంగా ‘వీరసింహారెడ్డి’ సినిమా వచ్చి మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. మళ్లీ ఈ కాంబినేషన్లో సినిమా ప్రకటించడంతో అభిమానులలో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ‘NBK 111’ వర్కింగ్ టైటిల్ తో వెంకట సతీష్ కిలారు(Venkata Sathish khilaru) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం మొదట ఒక చారిత్రక కథను అనుకున్నప్పటికీ కేవలం బడ్జెట్ కారణాల వల్లే ఈ కథను వదిలి మరో ఫ్రెష్ కథతో ఈ సినిమాను సిద్ధం చేస్తున్నారట.

ముంబై నేపథ్యంలో బాలయ్య కొత్త సినిమా

స్టైలిష్ ఎంటర్టైనర్ మూవీ అని చిత్ర బృందం కూడా ప్రకటించింది. బాలయ్య చారిత్రాత్మక చిత్రాలలో చక్కగా ఒదిగిపోయి మరీ నటిస్తారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన వీర సింహారెడ్డి తర్వాత మళ్లీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో చారిత్రాత్మక సినిమా అని చెప్పడంతో అభిమానులు కూడా చాలా ఎక్సైజ్మెంట్ ఫీలయ్యారు. అయితే ఇప్పుడు బడ్జెట్ కారణంగా కథనే మార్చేయడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారనే చెప్పాలి. ఇకపోతే ముంబై నేపథ్యంలో సాగే స్టైలిష్ మాస్ యాక్షన్ గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

నయనతార హీరోయిన్‌గా ఎంపిక, షూటింగ్ ప్రారంభం

పైగా గత చిత్రాల మాదిరి కాకుండా బాలకృష్ణ ఈ సినిమాలో సింగిల్ క్యారెక్టర్ లోనే కనిపించనున్నారట. మార్చి మొదటి వారం నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది అని సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో నయనతార (Nayanthara ) హీరోయిన్గా ఎంపికయింది. ఇప్పటికే శ్రీరామరాజ్యం, సింహ, జై సింహ వంటి చిత్రాలలో నటించి ఈ జంట హ్యాట్రిక్ అందుకున్నారు.. ఇప్పుడు ఈ చిత్రంతో డబుల్ హ్యాట్రిక్ కు శ్రీకారం చుట్టారు అని చెప్పాలి. ఇక భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చే ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఇక బాలకృష్ణ తదుపరి చిత్రాల విషయానికి వస్తే.. మలయాళ చిత్రం మార్క్ సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ హనీఫ్ అదేనీతో ఒక సినిమా చేస్తున్నారు. దీనిని దిల్ రాజు నిర్మించనున్నట్లు సమాచారం. ఆ తర్వాత హరీష్ శంకర్, వివేక్ ఆత్రేయ, కొరటాల శివ వంటి డైరెక్టర్లను బాలయ్య లైన్లో పెట్టినట్లు సమాచారం. ఏది ఏమైనా 65 సంవత్సరాల వయసులో కూడా జెడ్ స్పీడ్ లో సినిమాలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.

బడ్జెట్ సమస్యల కారణంగా కథ మార్పులు సినిమా ఫలితంపై ఎలా ప్రభావం చూపుతాయో వేచి చూడాలి. బాలకృష్ణ సింగిల్ రోల్‌లో ఎలా మెప్పిస్తారో చూడాలి. చిత్రం మార్చిలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.