|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గోపీచంద్ ‘భరత వర్ష’: హరి హర వీరమల్లుకి పోటీనా? సంచలన పోలికలు!

Published: 13-04-2026, 6:35 AM
గోపీచంద్ 'భరత వర్ష': హరి హర వీరమల్లుకి పోటీనా? సంచలన పోలికలు!
  • గోపీచంద్ 33వ చిత్రంగా ‘భరత వర్ష’
  • దర్శకత్వం: సంకల్ప్ రెడ్డి, హీరోయిన్ రీతు వర్మ
  • పవన్ కళ్యాణ్ వీరమల్లుతో పోలికలు
  • దేశభక్తి, చరిత్ర, మైథాలజీ అంశాల కలయిక

గోపీచంద్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ‘భరత వర్ష’ టైటిల్ గ్లింప్స్ విడుదలైంది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ సినిమాను పోలి ఉందని విమర్శలు వస్తున్నాయి. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

భరత వర్ష టైటిల్ గ్లింప్స్ విడుదల

Bharata Varsha: మ్యాచో స్టార్ గోపీచంద్ ఇటీవల వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు అయితే ఈయన నటించిన సినిమాలు ఇటీవల కాలంలో అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. బాక్స్ ఆఫీస్ వద్ద గోపీచంద్ సినిమాలు ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న గోపీచంద్ మాత్రం ఎప్పటికప్పుడు వినూత్నమైన కథల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక నేడు గోపీచంద్ హీరోగా నటిస్తున్న సినిమాకు భరతవర్ష (Bharata Varsha)అనే పవర్ ఫుల్ టైటిల్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలా ఈ టైటిల్ గ్లింప్స్ విడుదలైన తర్వాత సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. గోపీచంద్ తన కెరియర్ లో 33వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రానికి సంకల్ప్ రెడ్డి (Sankalp Reddy) దర్శకత్వం వహిస్తున్నారు.

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా చారిత్రాత్మక యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో గోపీచంద్ జోడిగా రీతు వర్మ(Reethu Varma) నటించబోతున్నారు. దేశభక్తి, చరిత్ర, మైథాలజీ అంశాల కలయికగా ఈ సినిమా రాబోతోందని తెలుస్తుంది. ఈ సినిమాలో గోపీచంద్ ఒక యోధుడిలా కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ వీడియో మాత్రం సినిమా పట్ల అంచనాలను పెంచేయగా మరి కొందరు మాత్రం ఈ వీడియో పై విమర్శలు కురిపిస్తున్నారు.

వీరమల్లుతో పోలికలు: విమర్శలు

గోపీచంద్ హీరోగా నటిస్తున్న భరతవర్ష సినిమా గ్లింప్స్ వీడియో చూస్తుంటే పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటించిన హరిహర వీరమల్లు (HHVM)సినిమా గుర్తుకు వస్తుందని అచ్చం పవన్ కళ్యాణ్ సైతం వీరమల్లు సినిమాలో ఇదే లుక్ లో కనిపించారు అంటూ విమర్శలు కురిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తరహాలోనే గోపీచంద్ వస్త్ర ధారణ చేతిలో బల్లెం వంటివి చూస్తుంటే వీరమల్లు సినిమాని గుర్తుకు వస్తుంది అంటూ పలువురు అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

ఇక వీరమల్లు సినిమా కూడా చారిత్రాత్మక సినిమా గానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ప్రేక్షకుల అంచనాలను మాత్రం చేరుకోలేకపోయింది. అయితే భరతవర్ష సినిమా మాత్రం ఇందుకు భిన్నంగా ఉండబోతుందని తెలుస్తుంది. పురాణాల ప్రకారం భరతవర్షం అంటే హిమాలయాల నుంచి సముద్రం వరకు విస్తరించిన భారతదేశాన్ని సూచిస్తుంది .ఇక భరుతుడు అనే చక్రవర్తి పేరుమీద ఈ పేరు వచ్చిందని కూడా తెలుస్తోంది. మరి ఎంతో విభిన్నమైన చారిత్రాత్మక సినిమా ద్వారా గోపీచంద్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఆయన కెరియర్ కు ఏ విధమైనటువంటి సక్సెస్ అందిస్తుందనేది తెలియాల్సి ఉంది.

చారిత్రాత్మక నేపథ్యం, అంచనాలు

‘భరత వర్ష’ సినిమా వీరమల్లు సినిమాకి భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఇది హిమాలయాల నుంచి సముద్రం వరకు విస్తరించిన భారతదేశ చరిత్రను తెలియజేస్తుంది. ఈ సినిమా గోపీచంద్ కెరీర్ కి ప్లస్ అవుతుందో లేదో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.