
గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్‌లో బాలు, మీనా మధ్య రొమాంటిక్ సన్నివేశాలు, మీనా పూలకొట్టును మున్సిపల్ అధికారులు తీసివేయడం, రోహిణి, ప్రభావతిల ఆందోళనలు, శోభన చేసిన సహాయం వంటి అనేక ఉత్కంఠభరిత సంఘటనలు చోటు చేసుకుంటాయి.
Key Points
బాలు, మీనా మధ్య రొమాంటిక్ సన్నివేశాలు
మున్సిపల్ అధికారులు మీనా పూలకొట్టు తీసివేయడం
శోభన చేసిన సహాయం, ఇంటిలోని సంఘర్షణలు
బాలు, మీనా మధ్య ప్రేమ
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో బాలు వచ్చి మీనాతో రొమాంటిక్‌గా మాట్లాడుతాడు. శ్రుతిలాగే చేతికి మల్లెపూలు కట్టుకుని వాసన చూస్తాడు. అది చూసి మీనా తెగ నవ్వుతుంది. బాలు పైకి లేస్తుంటే మీనా ఆపుతుంది. దాంతో బాలు ప్లేట్‌కు తగలడంతో మల్లెపూలు అన్ని వర్షంలా పడిపోతాయి. ఒకరిపై ఒకరు పడుకుని రొమాంటిక్‌గా చూసుకుంటారు.
మరుసటి రోజు ఉదయం రెండు మూడు ఆర్డర్లు ఇవ్వాలని మీనా బయటకు వెళ్తుంది. తర్వాత ఇంటికి శోభన వస్తుంది. రోహిణి ని పిలిచి టీ పెట్టమంటుంది ప్రభావతి. శ్రుతి వెంటనే ఇంటికి వచ్చిందని ప్రభావతి అంటే.. వెళ్లనంటే వెళ్లను అని చెబితే పెళ్లయిన అమ్మాయి పుట్టింట్లో ఉండాలని నచ్చజెప్పి పంపించాను అని అబద్ధం చెబుతుంది శోభన.
ఇద్దరు బాలు గురించి మాట్లాడుకుంటారు. ఇంతలో పూలమ్మాయి అని ఒకావిడ వచ్చి వందకు పూలు ఇవ్వమనంటుంది. మీనా లేదని ప్రభావతి అంటే నువ్వున్నావుగా ఇవ్వమంటుంది ఆవిడ. దాంతో చేసేది లేక ఫ్రిడ్జ్‌లో ఉన్న పూలను ప్రభావతి తీసుకొచ్చి ఇస్తుంది. మూల కొలిచి ఇవ్వమని ఆవిడ అడుగుతుంది. రోహిణిని అడిగితే తెలియదంటుంది.
ప్రభావతి పూలు కొలిచి ఇస్తుంది. బాగా కొలిచి ఇస్తున్నారే. మీరు కూడా పూల వ్యాపారం చేయొచ్చు. మీకు బాగా సూట్ అయింది అని శోభన అంటుంది. ఎప్పుడు నన్ను అంటారుగా. ఇప్పుడు నిన్ను అంటున్నారు అని మనసులో రోహిణి అనుకుంటుంది. నేను వెళ్లొస్తాను అని చెప్పిన శోభన రెండు వందలకు పూలు ఇవ్వమంటుంది. కల్పించుకుని అడిగిందా. అవసరం ఉండి అడిగిందా అని రోహిణి డౌట్ పడుతుంది.
ఇంట్లో పూజా ఉంది. ఎక్కడో కొనడం ఎందుకు. మీనాతో కలిసి మీరు కూడా బిజినెస్ చేయండి అని శోభన అంటుంది. దాంతో పూలు తీసుకొచ్చి ఇస్తుంది ప్రభావతి . అత్తయ్యకు సరైన కౌంటర్ పడిందని రోహిణి అనుకుంటుంది. శోభనకు కూతురు, రవి ఎదురుపడతారు. ఇప్పుడే వచ్చినట్లు చెప్పిన శోభన పూలు కొన్నట్లు చెప్పి మీనాకు సపోర్టే చేయమని మీ అత్తకు చెప్పాను అని అంటుంది.
పూలకొట్టు సమస్య
రవి లోపలికి వెళ్లాకా.. ఈ ఇంట్లో జాగ్రత్తగా ఉండు. ముగ్గురు కోడళ్లు ఉన్నారు. ఎవరికి వాళ్లు వాళ్లదే పైచేయి అనుకుంటున్నారు. నువ్ ఎక్కడ తగ్గొద్దు. ఇక్కడ బిక్కు బిక్కు మనుకుంటు ఉండొద్దని చెబుతున్నాను అని శోభన అనేసి వెళ్లిపోతుంది. మరోవైపు జరిగిన అవమానం తలుచుకుని ప్రభావతి తెగ ఫీల్ అయిపోతుంది. ఆంటీ మీనాకు మీరు హెల్ప్ చేశారట కదా. మీనా లేదు. వచ్చేవరకు పూలకొట్టులో కూర్చోండి అని శ్రుతి అనేసి వెళ్తుంది.
దాంతో రగిలిపోయిన ప్రభావతి వదిన అని మర్యాదగా చూస్తే ఇంతలా అవమానిస్తుందా. నేను వీళ్లకు పూలమ్మేదానిలా కనిపిస్తున్నానా అని రగిలిపోతుంది ప్రభావతి. అది అక్కడ పూలకొట్టు పెట్టుకుంది. అది లేకుండా చేయాలి అని ప్రభావతి అంటుంది. ఇంతలో రోహిణి బాలు ఉన్నాడుగా. ఎలా తీసేస్తారు అని రోహిణి అంటుంది. మరో మార్గం చూడాలి అని కామాక్షికి కాల్ చేస్తుంది ప్రభావతి.
దీనికి మొత్తం చెప్పాలి అని ఏం చెప్పకుండా అవమానం జరిగినట్లు మాత్రం చెప్పి కాల్ కట్ చేస్తుంది. అదేంటో తెలుసుకోవాలి. లేకుంటే తల పగిలిపోతుంది. రోహిణికి అన్ని తెలుస్తాయి అని కామాక్షి కాల్ చేస్తుంది. దాంతో కామాక్షికి జరిగింది అంతా రోహిణి చెబుతుంది. ఇంతలో ప్రభావతి వచ్చి అంతా చెప్పావా అని అంటే నిజం చెప్పాలిగా అని చెప్పాను అని రోహిణి అంటుంది.
ఇంకెప్పుడు ఇలా ఎవరికి చెప్పకు. పూలకొట్టును ఎలాగైనా తీయించేయాలని అని ప్రభావతి అంటుంది. నా దగ్గర ఐడియా ఉంది. అది మీరు చేసినట్లు తెలియకుండా చేయాలి. ఆరోజు ఒక్క రాత్రిలో బాలు పూలకొట్టు పెట్టాడుగా. కచ్చితంగా రూల్స్ పాటించడు. కార్పొరేషన్ వాళ్లకు కాల్ చేసి చెబితే వాళ్లే తీయించేస్తారు అని రోహిణి ఐడియా ఇస్తుంది.
కుటుంబంలోని ఉద్రిక్తత
మన పేరు రాకుండా నువ్వే కాల్ చేసి చెప్పు అని ప్రభావతి అంటే.. రోహిణి కాల్ చేయడానికి వెళ్తుంది. మరోవైపు తన ఫ్రెండ్స్ అందరికి మీనా చేసిన వంట తినిపిస్తాడు. శ్రుతి, రవి వచ్చారు. ఇంట్లో అందరికి పండగలా ఉందని, అందుకే మీనా మీ అందరికి వంట చేసి పంపించిందని బాలు చెబుతాడు. అంతా భోజనం చేస్తుంటారు. ఇంతలో అక్కడికి ఒక పెద్దాయన బాలు కోసం వస్తాడు.
ఓ విషయం మాట్లాడాలని నాకు ఓ సహాయం చేసి పెట్టాలి. మా ఇంట్లో బ్యాచిలర్స్ రూమ్ ఖాళీ చేయమంటే చేయకుండా గొడవ చేస్తున్నారు. ఆ రౌడీ వెధవలను బెదిరించి ఇల్లు ఖాళీ చేయించాలి. కావాలంటే డబ్బులు కూడా ఇస్తాను అని పెద్దాయన అంటాడు. ఇలాంటివి పోలీసులకు చెప్పి చేయించుకో పెద్దాయన. నాకు గొడవలు ఇప్పుడు వద్దు అని పంపించేస్తాడు బాలు.
మరోవైపు మీనా పూలకొట్టును మున్సిపల్ కార్పోరేషన్ వాళ్లు తీయించేస్తారు. దీనికి పర్మిషన్ లేదని, ఈ విధిలో వాళ్లే కంప్లైంట్ ఇచ్చారని వాళ్లు వ్యాన్‌లో వేసుకెళ్లిపోతారు. దాంతో మీనా ఏడుస్తుంటుంది. బాలు వచ్చాక నిజం తెలుస్తుంది. ఎవరో కావాల్సిన వాళ్లే దగ్గరుండి చేయించారు అని కామాక్షి అంటుంది.
మీనాను ఇంత బాధపెట్టిన వాళ్లు ఎవరో తెలిస్తే.. వాళ్లకుంటుంది అని బాలు అంటాడు. దాంతో రోహిణి, ప్రభావతి భయపడిపోతారు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ఈ ఎపిసోడ్‌లోని సంఘటనలు కుటుంబంలోని సభ్యుల మధ్య సంఘర్షణలను, అపోహలను హైలైట్ చేస్తాయి. మీనా పరిస్థితి ఎలా మారుతుంది అనేది తదుపరి ఎపిసోడ్‌లో చూడాలి.


