
📌 Key Points
- రాకింగ్ స్టార్ యశ్ ‘టాక్సిక్’ మూవీలో తారా సుతారియా రెబెకా పాత్రలో పరిచయం.
- దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తార నటనను అద్భుతం అని ప్రశంసించారు.
- స్వేచ్ఛ ఇస్తే తార అద్భుతాలు చేస్తుందని గీతూ మోహన్ దాస్ వెల్లడి.
- సినిమా మార్చి 19న ఈద్, ఉగాది పండుగల లాంగ్ వీకెండ్‌లో విడుదల.
రాకింగ్ స్టార్ యశ్ ‘టాక్సిక్’ సినిమా నుంచి తారా సుతారియా లుక్ విడుదల చేశారు. ఆమె రెబెకా పాత్రలో కనిపించనుంది. తార నటనకు దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఫిదా అయ్యారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
టాక్సిక్ నుండి తారా సుతారియా లుక్
రాకింగ్ స్టార్ యశ్ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. ఇప్పటికే ఈ సినిమా నుంచి యశ్, కియారా, హ్యూమా ఖురేషి, నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ కాగా తాజాగా తారా సుతారియా లుక్ విడుదల చేశారు మేకర్స్. అందమైన, ఆకర్షణీయమైన, సున్నితమైన పాత్రలో కనిపించబోతున్న రెబెకాగా తన పాత్రను పరిచయం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిత్ర దర్శకురాలు గీతూ మోహన్ దాస్.. ‘తారా స్వచ్ఛమైన మనసు కలిగిన వ్యక్తి. అదే ఆమెకు రక్షణ. నటిగా ఆమెకు ఆమెకు కావాల్సినంత స్వేచ్చ ఇస్తే చాలు.. అద్భుతాలు చేస్తుంది. ఈ పాత్రలో అద్భుతంగా జీవించింది. నటనతో ఆశ్చర్యపరిచింది. మీ అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తుందనడంలో సందేహం లేదు’’ అని తెలిపింది. కాగా ఈ సినిమా మార్చి 19న ఈద్, ఉగాది, గుడి పడ్వా పండుగలు కలిసి వచ్చే లాంగ్ వీకెండ్ సమయంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
తార నటనపై గీతూ మోహన్ దాస్ ప్రశంసలు
సినిమా విడుదల తేదీ, పండుగల లాంగ్ వీకెండ్
తారా సుతారియా అద్భుతమైన నటన, దర్శకురాలి ప్రశంసలు ‘టాక్సిక్’ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఈ చిత్రం మార్చి 19న విడుదల కానుంది. ఆమె నటన ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.


