|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గుండె నిండా గుడి గంటలు: సత్యం సంచలన నిర్ణయం! మనోజ్ షాప్‌లో బ్లాక్ మ్యాజిక్! బాలు ఫోన్ మిస్సింగ్!

Published: 17-04-2026, 1:05 AM
గుండె నిండా గుడి గంటలు: సత్యం సంచలన నిర్ణయం! మనోజ్ షాప్‌లో బ్లాక్ మ్యాజిక్! బాలు ఫోన్ మిస్సింగ్!
  • సత్యంకు అకౌంటెంట్‌గా ఉద్యోగం: స్కూల్‌లో కొత్త బాధ్యతలు స్వీకారం!
  • మనోజ్ షాప్ ముందు చేతబడి గుడ్లు కలకలం: ఎవరు చేశారు ఈ పని?
  • మీనాను వెంటాడుతున్న వ్యక్తి: బాలు ఫ్రెండ్ తమ్ముడు, ప్రేమలో చిక్కులు!
  • తాతకు దొరికిన బాలు ఫోన్: రోహిణి టెన్షన్, విద్యపై సీరియస్ వార్నింగ్!

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. సత్యం కొత్త ఉద్యోగంలో చేరడం, మనోజ్ షాప్ ముందు చేతబడి గుడ్లు కలకలం రేపడం, బాలు ఫోన్ మిస్ అవ్వడం వంటి అనేక సంఘటనలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

సత్యం అకౌంటెంట్ అవతారం: స్కూల్లో కొత్త జీవితం

Gunde Ninda Gudi Gantalu Serial April 17th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఏప్రిల్ 17వ ఎపిసోడ్‌లో స్కూల్‌కు వెళ్లిన సత్యంకు అకౌంటెంట్‌గా జాబ్ వస్తుంది. ఓ వ్యక్తి మీనా వెంట పడతాడు. అతను బాలు ఫ్రెండ్ తమ్ముడు. మీనాను ప్రేమించడానికి సలహాలు అడిగితే బాలు లవ్ గురుగా మారి చెబుతాడు.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఓ స్కూల్ దగ్గరికి సత్యం వెళ్తాడు. వెళ్లి కరాస్పాండెంట్‌ను కలుస్తాడు. రంగారావు పంపించాడని చెప్పడంతో సత్యంను మర్యాదగా చూస్తాడు. ఏదైనా జాబ్ చేయాలని అనుకుంటున్నట్లు చెబుతాడు సత్యం. రంగారావు గారు మిమ్మల్ని అకౌంటెంట్‌గా రికమండ్ చేశారు. మీరు రోజు రావాల్సిన పని లేదు. వారానికి ఒకరోజు వస్తే చాలు అని అంటాడు కరాస్పాండెంట్‌.

స్కూల్‌లో తన అకౌంటెంట్ జాబ్ గురించి రంగారావుతో మాట్లాడుతాడు. వెనుకే రోహిణి వాళ్లు వస్తారు. సత్యం వెళ్లిపోతాడు. చింటు రోజు రోహిణితో ఉంటానంటాడు. రోజు కుదరదు. ప్రతివారం ఒక రోజు వస్తానని నచ్చజెబుతుంది రోహిణి. మరోవైపు మీనా వెంట ఒకతను పడతాడు. ఓ చోట మీనా ఆపి పూలు ఇస్తుంది. అతను కూడా అక్కడే ఆగుతాడు. మీనా డౌట్‌గా చూస్తుంది. మళ్లీ మీనా వెంట పడతాడు.

వీడేంటీ వెంటపడుతున్నాడు. ఎక్కడో చోట దాక్కోవాలని కంగారుపడుతుంది మీనా. మరోవైపు బాలు ఫోన్‌లో ఫొటోలు చూస్తూ మెచ్చుకుంటుంది విద్య. రోహిణి తిడుతుంది. శివ వీడియో కోసమే తీశాం. బాలు కష్టపడి కొనుక్కుంది పడేయాలని లేదు కానీ తప్పదు. ఏ చెరువులో అయిన పడేయి. మీనా చూస్తే ప్రాబ్లమ్ అవుతుందని రోహిణి అంటుంది. ఇంతలో విద్య ఇంటి తలుపులు ఎవరో కొడతారు.

మనోజ్ షాప్ ముందు చేతబడి: అసలు ఏం జరిగింది?

సరేనని మీనా వెళ్లిపోతుంది. బాలు ఫోన్‌ను మీనాకు కనిపించేలా తిరుగుతున్నావని విద్యను తిడుతుంది రోహిణి. నిజంగానే ఫోన్ చెరువులో పడేయ్. నా జీవితంతో ఆడుకోకు అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది రోహిణి. మరోవైపు బాలు, సురేష్ తన ఫ్రెండ్ బర్త్ డే చేస్తుంటారు. ఫ్రెండ్ తమ్ముడు వస్తాడు. అతనే మీనా వెంట పడిన వ్యక్తి. తను సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నానని, దానికి తన అన్నే కారణం చెబుతాడు.

వాడు ప్రేమించి పెళ్లి చేసుకుంటాడట. ఎవరో అమ్మాయిని ఇష్టపడుతున్నాడట అని ఫ్రెండ్ చెబుతాడు. అతను కూడా ధైర్యం చాలట్లేదని మీనాను లవ్ చేసేది భర్త బాలుకే చెబుతాడు. మీనా గురించి గొప్పగా చెబుతాడు అతను. వెంటనే రోడ్డు మీద తాళి కట్టేసేయ్ అని అన్న అంటాడు. బాలును ఐడియా ఇవ్వమని సురేష్ అడుగుతాడు. అతను కూడా ఎలా మాట్లాడాలో చెప్పమని అడుగుతాడు. దాంతో మీనాతో ఎలా మాట్లాడాలో బాలునే చెబుతాడు.

విద్య ఆటో ఎక్కుతుండగా బాలు ఫోన్ కింద పడిపోతుంది. అది ఆ తాత చూసి పోన్ కింద పడిపోయిందని చెబుతాడు. కానీ, విద్య వినకుండా వెళ్లిపోతుంది. ఆ ఫోన్ తీసుకొచ్చి దగ్గర పెట్టుకుంటాడు తాత. విద్యకు రోహిణి కాల్ చేసి ఫోన్ గురించి అడుగుతుంది. ఫోన్ కనిపించదు. దాంతో కంగారుగా చెరువులో పడేసానని అబద్ధం చెబుతుంది విద్య. రోహిణి ఎంత అడిగిన చెరువులో బాలు ఫోన్ పడేసినట్లు చెబుతుంది విద్య.

మీనాను వెంటాడుతున్నది ఎవరు: ప్రేమలో కొత్త సమస్యలు!

హమ్మా ఇప్పుడు ప్రశాంతంగా ఉందని రోహిణి అని కాల్ కట్ చేస్తుంది. ఫోన్ ఎక్కడ పడేసాను, రోహిణికి ఈ విషయం తెలియకూడదు అని కంగారుగా అనుకుంటుంది విద్య. మనోజ్‌తో షాపులో మాట్లాడుతుంది రోహిణి. ఇంతలో పనివాడు ఓ కవర్ తీసుకొచ్చి ఇది మన షాప్ ముందు పడేసారు అని చెబుతాడు. అందులో చూస్తే కోడిగుడ్లు ఉంటాయి. వాటిపై ఏవో బొమ్మలు ఉంటాయి.

నాకు తెలిసిన స్వామిజీ ఉన్నాడు. అతనే దీనికి పరిష్కారం చెబుతాడు అని మనోజ్ ఫ్రెండ్ చెబుతాడు. దాంతో మనోజ్ సరేనంటాడు. మరోవైపు ఒకతన్ని కలిసి డెకరేషన్ గురించి అడుగుతుంది. ఇప్పుడు వేరేవాళ్లకు ఇచ్చాం. నెక్ట్స్ టైమ్ ఏ చిన్న ఆర్డర్ వచ్చిన ఇస్తాను అని అతను చెబుతాడు. దాంతో మీనా సంతోషిస్తుంది. తర్వాత బాలు సలహాతో మీనా దగ్గరి వచ్చి ఫ్రెండ్ తమ్ముడు మాట్లాడుతాడు.

మీతో ఓ విషయం మాట్లాడాలని, తన పేరు బులి, సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాను. మిమ్మల్ని చూశాకే నాకు అదృష్టం పట్టుకుంది. మీరే నా అదృష్ట దేవత అని అతను చెబుతాడు. మీ కష్టానికి ప్రతిఫలం వచ్చింది. అందరితో ఇలా అంటే పిచ్చోడు అనుకుంటారని మీనా చెబుతుంది. అతను పేరు అడిగితే చెప్పకుండా కోపంగా చూసి వెళ్లిపోతుంది మీనా. స్వామిజీని మనోజ్, రోహిణి , ఫ్రెండ్ కలుస్తారు. జరిగింది చెప్పి గుడ్డు చూపిస్తారు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు ఉత్కంఠగా మారుతోంది. సత్యం ఉద్యోగం, చేతబడి గుడ్లు, బాలు ఫోన్ మిస్సింగ్.. ఇవన్నీ ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.