|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గుండె నిండా గుడి గంటలు: మీనా కాపురంలో పెను విషాదం! శివ సంచలన నిర్ణయం! బాలు అసలు రూపం?

Published: 27-03-2026, 12:05 AM
గుండె నిండా గుడి గంటలు: మీనా కాపురంలో పెను విషాదం! శివ సంచలన నిర్ణయం! బాలు అసలు రూపం?
  • షాకింగ్: మీనా కాపురంలో ముక్కలు, అత్తగారి షాక్ ట్రీట్మెంట్!
  • బాలు గొప్పతనం బయటపడింది, శివ చేసిన దొంగతనం వెనుక అసలు నిజాలు!
  • ట్విస్ట్: గుణ గాడి సలహా, బావ మొబైల్ ఫోన్‌లో వీడియో బయటపడింది!
  • సుమతి చెప్పిన కాలేజ్ సస్పెండ్ విషయం, తండ్రిలా కాపాడుతున్న బావ!

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. మీనా కాపురం ముక్కలయ్యే పరిస్థితికి చేరుకుంది. శివ తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్‌కు గురిచేసింది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే చూడాల్సిందే.

ప్రభావతి ఆగ్రహం: మీనాకు షాక్!

Gunde Ninda Gudi Gantalu Serial March 27th Episode: గుండె నిండా గుడి గంటలు మార్చి 27 ఎపిసోడ్‌లో ప్రభావతి రచ్చ రచ్చ చేస్తుంది. తనను అవమానించినందుకే అలా చేశానని శివ చెబుతాడు. మీనాను పుట్టింట్లోనే వదిలేసి, అత్తింటికి రావొద్దని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది అత్త ప్రభావతి. మీనా కాపురం ముక్కలవుతుంది.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో శివను మీనా, సుమతి కొట్టి తిడతారు. వాళ్లను ఆపి వీడి అంతు చూస్తాను, ఇంతకింత బదులు తీర్చుకుంటాను అని ప్రభావతి అంటుంది. మీనా క్షమించమని అంటుంది. అయినా ప్రభావతి వినదు.

కూతురు కూడా పుట్టింట్లో ఉంటే ఆ బాధ తట్టుకోలేవమ్మా. వాడు చేసినదానికి దీనికి శిక్ష వేయకండని ప్రభావతి కాళ్లు పట్టుకుంటుంది పార్వతి. మీనా ఆపుతుంది. అయినా ప్రభావతి వినదు. ఆరోజు సారీ చెబుదామని వస్తే బ్యాగ్ వెతికించి అవమానించారు. ఆ కోపంతో చేశాను కానీ కావాలని చేయలేదు క్షమించక్కా అని మీనా కాళ్లపై పడతాడు శివ.

శివ దొంగతనం వెనుక అసలు నిజం

నాటకాలు ఆపమంటుంది ప్రభావతి. డబ్బుందన్న విషయం ఉప్పు అందించింది ఇదే. అందుకే చేశావ్. నిన్ను పోలీసులకు అప్పజెప్పి జైలుకు పంపించకుంటే నా పేరు ప్రభావతే కాదు అని కాలర్ పట్టుకుని బయటకు లాక్కొస్తుంది ప్రభావతి. బయట పెద్ద గొడవ చేస్తుంది. దాంతో ఇంటి ఓనర్ వచ్చి ప్రభావతిని ఆపుతాడు. నీకు బుద్ధి చెప్పేందుకే చేశాను అంటున్నాడుగా వదులు అంటాడు.

నీ వల్ల మీనా కాపురం ముక్కలైందిగారా అని లోపలికి వెళ్లి ఏడుస్తుంది పార్వతి. కొడుకును దారికి తేలేకపోయాను అని భర్త ఫొటోకు చెబుతూ మొరపెట్టుకుంటుంది. మీనా వచ్చి ఓదారుస్తుంది. శివను మాట్లాడకమని చెబుతుంది పార్వతి. దీని పెళ్లి లేకుంటే నీ బతుకు నిన్ను చావమని ఎప్పుడో చచ్చేదాన్ని అని పార్వతి అంటుంది.

దాంతో పార్వతి కాళ్లపై పడి నేను డబ్బుకోసం దొంగతనం చేయలేదమ్మా అని శివ అంటుంది. ఆరోజు మీ అత్తగారు నన్ను అవమానించారు. అందుకే చేశాను. ఇది గుణ గాడి సలహా ఇచ్చాడు. బావ మొబైల్ ఫోన్‌లోనే ఆ వీడియో ఉంది. బావ మొబైల్ నుంచి బయటపడింది. నేనే ఆ దొంగతనం చేసింది అని బావకు ఎప్పుడో తెలుసు. అది తెలిసే నా చేయి విరగ్గొట్టాడు అని బామ్మర్ది శివ జరిగింది అంతా, బాలు గొప్పతనం గురించి చెబుతాడు.

బాలు గొప్పతనం: కుటుంబానికి అండగా

తండ్రిలా బావ మనల్ని అందరిని కాపాడుకుంటూ వస్తున్నాడు అని శివ కాలేజ్ సస్పెండ్ గురించి చెబుతుంది సుమతి. ఇదంతా జరుగుతుందనే ఆయన చెప్పకుండా దాచారు అని మీనా అంటుంది. ఇప్పుడు ఈ విషయం వల్ల దీని పెళ్లి జరుగుతుందా అని ఏడుస్తుంది సుమతీ. మరోవైపు సత్యంకు జరిగింది చెబుతుంది ప్రభావతి.

మీనాకు అంతా తెలిసిన బాలు నోర్మూయించింది అని రోహిణి మరింత ఎక్కిస్తుంది. ఇంతలో బాలు వస్తాడు. ఏమైందని అడుగుతాడు. మీనాను పిలుస్తే ఇక ఇంటికి రాదని చెబుతుంది ప్రభావతి. ఏం చేశారు నా భార్యను అని అరుస్తాడు బాలు. అప్పుడు శివ దొంగతనం వీడియో బాలుకు చూపిస్తాడు మనోజ్. అది చూసి ఇది నీ దగ్గరికి ఎలా వచ్చిందని అడుగుతాడు బాలు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మరింత ఆసక్తికరంగా మారుతుంది. మీనా జీవితం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.