|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గుండె నిండా గుడి గంటలు ప్రోమో: ఇంకేమైనా దాచావా? రోహిణి పీక పట్టుకున్న ప్రభావతి- తొలిసారి పెద్ద కోడలిపై అత్త ఉగ్రరూపం!

Published: 13-06-2025, 8:47 PM
గుండె నిండా గుడి గంటలు ప్రోమో: ఇంకేమైనా దాచావా? రోహిణి పీక పట్టుకున్న ప్రభావతి- తొలిసారి పెద్ద కోడలిపై అత్త ఉగ్రరూపం!

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో తాజా ప్రోమోలో పార్లర్ ఫ్రాంచైజీ వ్యవహారం కొత్త ట్విస్ట్‌ను తీసుకొచ్చింది. రోహిణి చేసిన పనికి ప్రభావతి కోపంతో రోహిణి పీక పట్టుకుంటుంది.

Key Points

1

గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో ప్రభావతి రోహిణి పై ఉగ్రరూపం

2

పార్లర్ ఫ్రాంచైజీ విషయంలో రోహిణి, ప్రభావతి మధ్య తీవ్రమైన గొడవ

4

ప్రభావతి రోహిణి పీక పట్టుకుని కఠినంగా ప్రవర్తిస్తుంది

పార్లర్ ఫ్రాంచైజీ వివాదం

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో పార్లర్‌ను ఫ్రాంచైజీకి ఇచ్చినట్లు, అందుకే ప్రభావతి పేరు పార్లర్‌పై నుంచి తొలగించినట్లు ఇంట్లో మనోజ్ అందరికి చెబుతాడు. దాని వల్ల చాలా లాభాలు వస్తాయని, డబ్బు సంపాదించొచ్చని అంటాడు.

అదంతా విన్న ప్రభావతి షాక్ అయిపోతుంది. రోహిణిని నిజమా అని అడిగితే.. అవును. నేనే సర్‌ప్రైజ్ చేద్దామనుకున్నాను. కానీ, మనోజ్ చెప్పేశాడు. అది చాలా పెద్ద కంపెనీ. మనకు చాలా లాభాలు వస్తాయని రోహిణి అంటుంది. మీనా మాత్రం తన పూలకొట్టు పేరు ప్రభావతి తప్పా ఇంకేం పెట్టనని అంటుంది. రోహిణి ఏం చేసిన మంచికే చేస్తుంది, అన్ని లాభాలు రావడం అనేది మంచి విషయమేగా అని ప్రభావతి అంటుంది.

రోహిణిపై ప్రభావతి సీరియస్ అవుతుందని అంతా అనుకుంటే ప్రభావతి కూల్‌గా ఏం అనకపోయేసరికి అంతా షాక్ అవుతారు. అందరిముందు రోహిణిని ఏం అనకుండా సైలెంట్‌గా ఉంటుంది. రోహిణి థ్యాంక్స్ చెప్పి పైకి వెళ్లిపోతుంది. రోహిణి వెంటే ప్రభావతి వెళ్తుంది. అత్తయ్య ఏం అనకుండా ఉన్నారు అని మీనా అంటే.. ఇది తుఫాను రావడానికి మందు చల్లగా ఉన్నట్లు అని బాలు అంటాడు.

ప్రభావతి ఆగ్రహం

బాలు చెప్పినట్లుగానే రోహిణిపై ప్రభావతి తెగ సీరియస్ అవుతుంది. తన పేరు ఉన్న బోర్డ్ ఎందుకు తీసినట్లు అని మళ్లీ రోహిణిని నిలదీస్తుంది ప్రభావతి. దాంతో మళ్లీ ఫ్రాంచైజీ గురించి చెబుతుంది రోహిణి. అలాగే, ఆ ఫ్రాంచైజీకి మలేషియాలో మంచి పేరు ఉందని, తన నాన్న సజెస్ట్ చేయడంతోనే ఇక్కడ తీసుకున్నట్లు , దాని వల్ల బెనిఫిట్స్ ఉంటాయని రోహిణి చెబుతుంది.

కానీ, అవేం నమ్మదు ప్రభావతి. నేనే ఈ విషయం మీకు చెప్పాలనుకున్నాను అత్తయ్య అని భయపడుతూ రోహిణి అంటుంది. ఎప్పుడు అని గట్టిగా అరుస్తుంది ప్రభావతి. ఆ మాటలు కిందకి వినిపించి సత్యం, బాలు, మీనా పైకి చూస్తారు. ఈ ప్రభావతి నీ కళ్లకు వెర్రిదానిలా కనిపిస్తుందా. నీ పార్లర్‌లో జుట్టు కత్తిరించి పారేసినంత ఈజీగా నా పేరు తీసి పారేసావా. ఇప్పుడు నువ్ మలేషియా పేరు చెబితే నేను తగ్గుతానని అనుకున్నావా అని ఉగ్రరూపం చూపిస్తుంది ప్రభావతి .

రోహిణి భయం

మీకు ఇచ్చే డబ్బులు ఇస్తూనే ఉన్నాను కదా అని రోహిణి భయంతోనే అంటుంది. ఏయ్ అంటూ రోహిణి పీక పట్టుకుంటుంది ప్రభావతి. ఏంటే.. ఎదురు సమాధానం చెబుతున్నావ్ అని గొంతు పట్టుకుని నలిపేస్తుంది ప్రభావతి. రోహిణి విలవిల్లాడటంతో ఛీ.. అని పక్కకు తోసేస్తుంది ప్రభావతి. ఇది కాకుండా ఇంకేమైనా దాచావా అని ప్రభావతి నిలదీస్తుంది.

దాంతో రోహిణి మరింత భయపడిపోతుంది. లేదు అన్నట్లుగా తల ఊపుతుంది రోహిణి. ఇప్పుడే చెప్పు అని ప్రభావతి అంటుంది. దాంతో రోహిణి బెదిరిపోయి అలాగే చూస్తుంటుంది. ఎప్పుడు మీనాను ఆడిపోసుకుని, రోహిణి ని మెచ్చుకునే అత్త ప్రభావతి మొదటిసారి పెద్ద కోడలిపై తన విశ్వరూపం చూపిస్తుంది. అక్కడితే గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.

ప్రభావతి ఉగ్రరూపం చూపించడంతో రోహిణి భయపడిపోతుంది. ఇంకేమైనా రహస్యాలు దాచి ఉంచిందా అని ప్రభావతి ప్రశ్నించడంతో కథ మరింత ఉత్కంఠగా మారుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.