|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గుండె నిండా గుడి గంటలు సీరియల్: బాలు, మీనా రొమాన్స్ లీక్స్! దినేష్ స్వామీజీ అవతార్ – షాకింగ్ ట్విస్ట్!

Published: 23-02-2026, 12:37 AM
గుండె నిండా గుడి గంటలు సీరియల్: బాలు, మీనా రొమాన్స్ లీక్స్! దినేష్ స్వామీజీ అవతార్ – షాకింగ్ ట్విస్ట్!
  • బ్రేకింగ్ న్యూస్: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో బాలు, మీనా మధ్య శృంగార సన్నివేశాలు వైరల్!
  • షాకింగ్ ట్విస్ట్: దినేష్ స్వామీజీ గెటప్‌లో మనోజ్‌ను ఇరికించే ప్రయత్నం – ప్లాన్ సక్సెస్ అవుతుందా?
  • ప్రభావతి ఫైర్: మీనాను ఇంటి నుండి వెళ్లిపొమ్మని ఆర్డర్ – ఏం జరగబోతోంది?
  • ప్రేమ్, రాధికల గురించి ప్రభావతి, కామాక్షి మధ్య చర్చలు – పోలీసుల భయం!

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మరో సంచలనానికి తెర తీసింది! బాలు, మీనా లవ్ సీన్ లీక్ కావడంతో ఒక్కసారిగా హీట్ పెరిగిపోయింది. దినేష్ స్వామీజీ అవతారంలో ఏం చేయబోతున్నాడో చూడాలి!

బాలు, మీనా మధ్య రొమాంటిక్ సీన్ లీక్!

గుండె నిండా గుడి గంటలు ఫిబ్రవరి 23 ఎపిసోడ్‌లో ప్రేమ్, రాధిక శృంగార భంగిమ పెట్టారని బొమ్మను చూపిస్తుంది. తాను ఏం నేర్పించానో చెబుతానని మనోజ్, రోహిణితో భంగిమలు వేయిస్తుంది. కానీ వేయలేకపోతారు. మీనా, బాలు వేస్తారు. స్వామిజీలా దినేష్ గెటప్ వేసి మనోజ్ దగ్గర బాలును ఇరికిస్తాడు. దాంతో మనోజ్ కోపంగా వెళ్తాడు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో బొమ్మల కొలువుకు ఇంకొన్ని కావాలని సత్యంకు మీనా చెబుతుంది. తర్వాత రెండు బొమ్మలు చూపించి శృంగార భంగిమ అంటే ఇలాగే ఉంటుందా.. మీ దగ్గర డ్యాన్స్ ప్రేమ్ వాళ్లు ఇలాగే ఉన్నారని ప్రభావతితో మీనా అంటుంది.

నేను చూశాను. రేపు ఏమైనా అయితే ఎవరిని అంటారని మీనా అంటుంది. నువ్వు ఏం నేర్పించావ్ చెప్పమని బాలు అంటాడు. దాంతో మనోజ్, రోహిణితో శృంగార భంగిమలు వేయిస్తుంది ప్రభావతి. కానీ, వారికి రాదు. శ్రుతి, రవి కూడా వేయరు. బాలు, మీనా శృంగార భంగిమను కరెక్ట్‌గా వేస్తారు. మీరు నేర్పించింది ఇది. కానీ, వాళ్లు ఉన్నది ఇలా అని ప్రేమ్ వేసిన పోజు చూపిస్తుంది మీనా .

దాన్ని ఫొటో తీయించుకుంటాడు బాలు. నా స్టూడెంట్స్ మీద బురద జల్లుతుంది. ఇకనుంచి నాకు లంచ్ క్యారేజ్ తీసుకు రాకు అని ప్రభావతి వెళ్లిపోతుంది. నీకే పని తప్పిందని సత్యం అంటాడు. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారని బాలు అంటాడు. మరోవైపు బిజినెస్ బాగా జరగట్లేదని డల్‌గా ఉంటాడు మనోజ్. రోహిణి ఎంకరేజ్ చేస్తుంది.

స్వామీజీలా దినేష్ ఎంట్రీ – అసలు ప్లాన్ ఏంటి?

నాకు లాటరీ తగిలితే ఫస్ట్ మీ షాప్‌కే వస్తాను అని మనోజ్ అంటాడు. దానికి మనోజ్ కోప్పడుతాడు. మనోజ్ మాల వేసుకుంది చూపించి నువ్వు నమ్ముతావ్. నేను నమ్మితే పిచ్చా అని అతను అంటాడు. రోహిణి చెప్పడంతో ఆ కస్టమర్‌ను సెక్యురిటీ ఎత్తుకుని బయటపడేస్తాడు. ఇంతలో ఓ బాబా వచ్చి లెటర్ ఇచ్చి మాయం అవుతాడు. అందులో నా గురించి తెలుసుకోవాలంటే వచ్చి గుడిలో కలువు అని ఉంటుంది.

వాడి గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. మనం గుడికి వెళ్దామని మనోజ్ అంటాడు. కచ్చితంగా ఇది దినేష్ గాడి పనే అని రోహిణి అనుకుంటుంది. బాలు, మీనా కారులో వెళ్లి రోడ్డు మీద ఉన్న భార్యాభర్తలను కలుస్తారు. వీళ్లు దేవుడు పంపించిన మనవడు, మనవరాలు అని తాత అంటాడు. వాళ్లకు ఇంటి నుంచి భోజనం తీసుకొచ్చానని, తిందామని మీనా అంటుంది.

తర్వాత ప్రేమ్, రాధిక గురించి మాట్లాడుకుంటారు ప్రభావతి, కామాక్షి. ఏదైనా జరిగి పోలీసులు వస్తే నా కొంప కొల్లేరు అవుతుంది. మీనా చెప్పిందంటే డౌట్ పడాల్సిందే. వాడి మొహం చూశావా. వాడు ఆ అమ్మాయి కోసమే డ్యాన్స్ నేర్చుకోడానికి వచ్చినట్లున్నాడని భయపెడుతుంది కామాక్షి. దాంతో ప్రభావతి ఆపుతుంది.

గుడికి మనోజ్, రోహిణి వెళ్తారు. బాడీగార్డ్‌తో మనోజ్, రోహిణి వెళ్తారు. అక్కడ స్వామిజీ రూపంలో దినేష్ ఉంటాడు. భక్తులు కూడా ఉంటారు. వాళ్లకు ఆశీర్వాదాలు ఇస్తాడు. అతన్ని చూసి మన విషయం చెబుదామని అతని దగ్గరికి మనోజ్ వెళ్తాడు. దో నిరంజన్ అంటున్నారేంటని మనోజ్ అడిగితే.. నా తమ్ముడు రాజనాల, వాడు ఏక్ నిరంజన్ అంటాడు, నేను భోజనాల. ఇద్దరిని పోల్చుకోడానికి నేను దో నిరంజన్ అంటానని దినేష్ చెబుతాడు.

మీనాను ఇంట్లోంచి గెంటేసిన ప్రభావతి!

బాడీగార్డ్ పవన్ కల్యాణ్ సినిమా పేర్లు చెబుతాడు. తమ్ముడు, బాలు అని వస్తుంది. ఇదంతా చేస్తుంది నా తమ్ముడు బాలునా అని ఫొటో చూపిస్తాడు. తనను కొట్టింది గుర్తు చేసుకున్న దినేష్ ఇతనే అంటాడు. నా పక్కనే ఉండి ఎంత పని చేశాడో అని మనోజ్ అంటాడు. బాలు ఏదైనా డైరెక్ట్‌గా చేస్తాడు అని రోహిణి అంటుంది. వాడి సంగతి చూస్తానని మనోజ్ వెళ్లిపోతాడు.

బేటా.. 30 లక్షలు సమర్పించుకునేదాకా ఇలాంటి బ్యాడే జరుగుతుంది అని దినేష్ అంటాడు. ఇంటికెళ్లిన మనోజ్ బాలును కొట్టమని బాడీగార్డ్‌కు చెప్పి ఉంచుతాడు. ఇంట్లోకి వెళ్లి ఉత్తరాలు, బాలు గురించి స్వామిజీ చెప్పింది అంతా మనోజ్ చెబుతాడు. బాలు ఇలాంటి పని ఎప్పుడు చేయడు అని సత్యం అంటాడు.

మనోజ్‌కు చెప్పి బాలను రమ్మని చెప్పమని అంటుంది ప్రభావతి. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం వేచి ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.