
📌 Key Points
- రోహిణి నాటకాలతో మీనా, బాలు డిఫెన్స్‌లో పడ్డారు, ప్రభావతి, మనోజ్‌లు బుట్టలో చిక్కుకున్నారు!
- సుమతి ఉద్యోగం పోయేలా చేసింది రోహిణి; శృతి, మీనాల భయంతో ప్రభావతి, మనోజ్ వణికిపోయారు.
- సత్యం తన రూ.40 లక్షలు ముంచాడని మనోజ్‌ను నిందిస్తాడు, ప్రభావతి ఇంటిని తాకట్టు పెట్టిందని ఆరోపిస్తాడు.
- వేరు కాపురం పెడతామన్న రోహిణి, మీనాను ఇంట్లో నుండి పంపేస్తానని ప్రభావతి నిర్ణయం తీసుకుంది!
గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో సంచలన మార్పులు చోటుచేసుకున్నాయి. రోహిణి పన్నాగాలు, శృతి మీనాల ప్రతీకారంతో కథనం మలుపు తిరుగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం రండి.
రోహిణి మాయలో పడ్డ కుటుంబం!
గుండె నిండా గుడి గంటలు సీరియల్ సోమవారం (జనవరి 26) ఎపిసోడ్ లో రోహిణి తన నటనతో మీనా, బాలులను డిఫెన్స్ లో పడేస్తుంది. అటు ప్రభావతి, మనోజ్‌లను బుట్టలో వేసుకుంటుంది. అంతేకాదు సుమతి జాబ్ కోల్పోయే పరిస్థితి ఏర్పడగా.. ప్రభావతి, మనోజ్‌లను శృతి భయపెడుతుంది.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 605వ ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది. దొరికిపోతుందనుకున్న రోహిణి.. చివరికి మీనాను టార్గెట్ చేస్తుంది. అటు సుమతి జాబ్ కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఎపిసోడ్ చివర్లో ప్రభావతి, మనోజ్ లను లక్ష్యంగా చేసుకొని శృతి, మీనా భయపెట్టడం నవ్వులు తెప్పించింది.
మీనాకు బాలు, సత్యం సపోర్ట్
సుమతి కొలువుకు ఎసరు పెట్టిన రోహిణి!
అలా చూస్తే ఈ ఇంట్లో తప్పు చేయంది ఎవరు.. మనోజ్ గాడు నా రూ.40 లక్షలు ముంచాడు.. నువ్వు ఇల్లు తాకట్టు పెట్టి రోహిణికి పార్లర్ పెట్టించావు.. రవిగాడు లేచిపోయి పెళ్లి చేసుకున్నాడు అంటూ సత్యం కూడా ప్రభావతిని నిందిస్తాడు. రోహిణి, ప్రభావతి, మనోజ్ నానా మాటలు అనడంతో మీనా ఏడుస్తుంది.
నిగ్గు తేలుస్తానన్న బాలు.. వణికిపోయిన రోహిణి
వేరు కాపురం పెడతామన్న రోహిణి
శృతి, మీనాల రివేంజ్ ప్లాన్!
దీంతో ప్రభావతి పూర్తిగా కరిగిపోతుంది. తాము వేరు కాపురం పెడతామని అనడంతో మీరు ఎందుకు వెళ్తారు.. ఆ పూలమ్ముకునేదాన్నే ఇంట్లో నుంచి పంపేస్తానని ప్రభావతి అంటుంది. నువ్వు, మనోజ్, రవి, శృతిలో ఇంట్లో ఉండాలని స్పష్టం చేస్తుంది. మీనా సంగతి తాను చూసుకుంటానని రోహిణికి నచ్చజెప్పి పంపిస్తుంది.
ఇటు రాత్రి సమయంలో మీనాకు హారర్ సినిమా చూపిస్తుంటుంది శృతి. అదే సమయంలో ప్రభావతి వచ్చి లైట్ వేయడంతో అమ్మో దెయ్యం అంటూ మీనా ఉలిక్కి పడుతుంది. ప్రభావతి తిడుతుంది. ఆ తర్వాత ప్రభావతిని భయపెట్టాలని శృతి డిసైడవుతుంది. తన మిమిక్రీ టాలెంట్ తో ప్రభావతితోపాటు మీనాను కూడా వణికిస్తుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు ఉత్కంఠగా మారుతోంది. రోహిణి కుట్రలను శృతి, మీనా ఎలా తిప్పికొడతారో చూడాలి. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!


