|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: శ్రుతికి నిజం చెప్పిన మీనా- రవికి శోభ ప్లాన్ చెప్పిన బాలు-జైలుకెళ్లిన రోహిణి తండ్రి

Published: 13-07-2025, 11:30 PM
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: శ్రుతికి నిజం చెప్పిన మీనా- రవికి శోభ ప్లాన్ చెప్పిన బాలు-జైలుకెళ్లిన రోహిణి తండ్రి

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. మీనా శ్రుతికి కీలకమైన నిజాలను వెల్లడించగా, బాలు రవికి ఒక ప్రణాళికను చెప్పాడు. రోహిణి తండ్రి జైలుకు వెళ్ళడం మరిన్ని సంఘటనలకు దారి తీస్తుంది.

Key Points

1

మీనా శ్రుతికి సురేంద్ర చేసిన అవమానం గురించి చెప్పింది.

2

బాలు రవికి శోభ ప్లాన్ గురించి చెప్పాడు.

4

రోహిణి తండ్రి జైలుకు వెళ్ళాడు.

శ్రుతికి నిజం బయటపడింది

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో అందరి మనసులు విరగొట్టేది నువ్వు అని ప్రభావతిని బాలు అంటే.. నిజాలేగా మాట్లాడుతున్నాడు అని సత్యం సపోర్ట్ చేస్తాడు. ఇల్లు ఇలా వెలవెలబోడానికి కారణం నువ్వే అంటున్నాడు. దీనంతటికి కారణం నీ మనసాక్షిని అడుగు అని సత్యం అనడంతో అంతా వెళ్లిపోతారు. అందరు నన్నే అంటున్నారు అని ప్రభావతి అంటే.. లేదు అందరిని నువ్వే అంటావ్ అని సత్యం వెళ్లిపోతాడు.

మరోవైపు అంతా రవి గురించి ఆలోచిస్తున్నారు అని బాలు, మీనా ఆలోచిస్తారు. సురేంద్రతో గొడవ గురించి మాట్లాడుకుంటారు. వాళ్ల ఇంటికి సురేంద్రకు రెండు తగిలించి వారిద్దరిని ఇంటికి తీసుకొస్తాను అని బాలు అంటాడు. ప్రతిదానికి కొట్టడమే పరిష్కారం కాదు. నచ్చజెప్పి తీసుకురావాలని మీనా అంటుంది. మరుసటి రోజు ఉదయం శ్రుతి డబ్బింగ్ స్టూడియోకు వెళ్తుంది.

ఇంకా వర్క్ చేయడం ఎందుకు. ఇంట్లోనే ఉండమని తల్లి శోభన అంటుంది. పెళ్లయ్యాక ఎందుకు అని శోభన అంటే.. నాన్న, రవి మానేశారా. నా విషయాల్లో జోక్యం చేసుకోకండి అని శ్రుతి వెళ్లిపోతుంది. డబ్బింగ్‌లో లైఫ్‌లో మీ ఇంటికి రాను నీతో కాపురం చేయను అనే డైలాగ్ వస్తే శ్రుతి ఆగిపోతుంది. దాంతో డిస్టర్బ్ అవుతుంది. ఇంతలో మీనా వస్తుంది.

చూసి శ్రుతి వెళ్లిపోతుంటే మీనా ఏడవటం కనిపిస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావ్ అని శ్రుతి అడిగితే.. నా వల్ల మీరు దూరమున్నారుగా అని మీనా అంటుంది. నీ వల్ల కాదు మీ ఆయన వల్ల అని శ్రుతి అంటుంది. మీ నాన్నను కొట్టిందే చూశావు, దానికంటే ముందు జరిగింది నీకు తెలియదు అని సురేంద్ర చేసిన అవమానం గురించి పూస గుచ్చినట్లు చెపుతుంది మీనా.

రవి మరియు శోభ ప్లాన్

దాంతో డాడ్ నిన్ను అపార్థం చేసుకోవడం తప్పే అని శ్రుతి అంటుంది. కానీ, చేయిచేసుకోవడం, అవమానించడం బాలుది తప్పని శ్రుతి అంటుంది. మధ్యలో మీ ఆయన, అత్తవారిల్లు ఏం చేసింది. మీరెందుకు రాలేదు అని మీనా అంటుంది. మీ ఆయన ఉన్న ఇంటికి రాను అని శ్రుతి అంటుంది.

ఫంక్షన్‌లో ఏ గొడవ జరగకుండా మౌనవ్రతం పాటించారు. ఓ మూలన కూర్చొన్నారు. ఎవరు వచ్చి మాట్లాడిన మాట్లాడలేదు. నన్ను దొంగ అన్నాకే మాట్లాడారు. ఇలాంటి బతుకు బతికే కన్న అడుక్కుతినొచ్చుగా అని అన్నాక ఆవేశం పట్టలేక కొట్టారు అని మీనా చెబుతుంది. తర్వాత రవితో గొడవ అయిందని వెళ్లిపోయాడని శ్రుతి చెబుతుంది. ఎవరో తొందరపడ్డారో అని రవిని దూరం పెడతావా అని మీనా చెబుతుంది.

కావాలంటే మీ నాన్నకు నేను క్షమాపణలు చెబుతాను అని మీనా అంటే ఎవరో చేసినదానికి నువ్వెందుకు చెప్పడం అని శ్రుతి అంటుంది. రవిని తీసుకుని ఇంటికిరా అని మీనా వెళ్లిపోతుంది. మరోవైపు రెస్టారెంట్‌కు బాలు వెళ్లి రవిని కలుస్తాడు. నువ్వు సిగ్గులేకుండా ఆ సురేంద్ర గాడి ఇంట్లో ఇల్లరికం ఉంటావా అని బాలు అంటే రవి ఫ్రెండ్ వచ్చి లేదు, మురికి రూమ్‌లో ఉంటున్నాడు అని చెబుతాడు.

రోహిణి తండ్రి జైలు శిక్ష

సురేంద్ర గాడికి నీతో పెళ్లి ఇష్టం లేదు. అందుకే గొడవ చేసి కూతురుని, నిన్ను రప్పించుకున్నాడని సురేంద్ర, శోభ ప్లాన్ చెబుతాడు బాలు. నువ్ రారా, అమ్మ, నాన్న బెంగ పెట్టుకుందిరా.. రారా అని బాలు అంటాడు. వదినాల శ్రుతి కాదు. నేను ఒక్కడిని రాను. ఇద్దరం కలిసి వస్తాం. కానీ, నువ్వున్న ఇంటికి శ్రుతి రాదు అని రవి వెళ్లిపోతాడు. డబ్బింగ్ పూర్తి చేసిన శ్రుతి మీనా చెప్పింది గుర్తు చేసుకుంటుంది.

రవి రెస్టారెంట్‌కే కాల్ చేసి ఫుడ్ ఆర్డర్ ఇస్తుంది. రవి ఫ్రెండ్ రవికి శ్రుతి ఫుడ్ ఆర్డర్ గురించి చెబుతాడు. వీడు వాడికి చెబుతాడా లేదా అని శ్రుతి ఆలోచిస్తుంది. మరోవైపు సత్యం ఇంటికి మలేషియా మావయ్య మటన్ కొట్టు మాణిక్యం వస్తాడు. రోహిణి వాళ్ల నాన్నను మలేషియా పోలీసులు జైలులో వేశారని, ఆయన్ను మోసం చేసినట్లు ఇరికించారని చెబుతాడు.

దాంతో నాన్న అని ఏడుస్తుంది రోహిణి. రోహిణి , నువ్ వెళ్లి ఆస్తులు విడిపించమని మనోజ్‌కు ప్రభావతి చెబుతుంది. దాంతో రోహిణి కంగారుపడుతుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

ఈరోజు ఎపిసోడ్‌లో చాలా పరిణామాలు చోటుచేసుకున్నాయి. శ్రుతి, రవి, మరియు ఇతర పాత్రల జీవితంలో కొత్త మలుపులు తిరగబోతున్నాయి. మరిన్ని ఉత్కంఠభరిత ఘట్టాల కోసం వేచి ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.