|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: తప్పు తెలుసుకున్న ప్రభావతి- బాలు కారులో మనోజ్ లవర్- పట్టుకునేందుకు రోహిణి స్కెచ్

Published: 31-07-2025, 10:43 PM
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: తప్పు తెలుసుకున్న ప్రభావతి- బాలు కారులో మనోజ్ లవర్- పట్టుకునేందుకు రోహిణి స్కెచ్

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్‌లో బాలు చేసిన పనికి ప్రభావతి తప్పు తెలుసుకుంటుంది. బాలుకు మీనాతో గొడవ జరుగుతుంది. రోహిణి కూడా కొన్ని కుట్రలు చేస్తుంది.

Key Points

1

ప్రభావతి బాలు చేసిన తప్పును తెలుసుకుని షాక్ అవుతుంది.

2

బాలు సహాయం చేసిన పెద్దాయన వల్ల ప్రభావతి తన తప్పును గ్రహిస్తుంది.

4

మీనా బాలు స్కూటీకి పూజ చేసి, అతని కోపాన్ని తగ్గిస్తుంది.

ప్రభావతికి షాకింగ్ వార్త

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో రౌడీయిజం చేసి డబ్బు సంపాదించడాని, ఇలాంటి వాడు ఇంట్లో ఉండకూడదని బాలును గెంటేయాలని చూస్తుంది తల్లి ప్రభావతి . ఇంతలో బాలు సహాయం చేసిన పెద్దాయన వచ్చి ఇలాంటి కొడుకును కన్న తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులు అని, దేవుడు అంటూ పొగుడుతాడు.

దాంతో ప్రభావతితోపాటు అంతా షాక్ అవుతారు. రౌడీలను తరిమేయడానికి డబ్బులు తీసుకోలేదా. కిరాయి కింద దేవుడితో మాట్లాడుకోలేదా అని ప్రభావతి అడిగితే.. లేదమ్మా అని జరిగింది చెబుతాడు పెద్దాయన. మరి డబ్బు గురించి ప్రభావతి అడిగితే.. మీ అబ్బాయి చాలా అభిమానవంతుడమ్మా. డబ్బులిస్తానన్న తీసుకోలేదు. నేను చెల్లెలికి అన్నకు పెట్టే కట్నం పెట్టుకోమని ఇచ్చా. దేవుడి హుండిలో వేసేది కానుకే గానీ కిరాయి కాదమ్మా. కృతజ్ఞత అని పెద్దాయన అంటాడు.

దాంతో ప్రభావతి తన తప్పు తెలుసుకుంటుంది. తప్పకుండా మీ చెల్లెలి పెళ్లికి రావాలని పెద్దాయన శుభలేఖ ఇస్తే తల్లిదండ్రులకు ఇవ్వమంటాడు బాలు. దాంతో పెద్దాయన పెళ్లి కార్డ్ ఇచ్చి వెళ్లిపోతాడు. ఇప్పుడు మాట్లాడండి. నా కొడుకు గొప్ప పని చేశాడు. సంఘసేవ చేశాడు. ఓ తండ్రి కూతురు పెళ్లి చేశాడు. నీకు మాత్రం నేరంలా కనిపించింది అని అందరిని సత్యం అంటాడు. మరోవైపు బాలుతో మీనా మాట్లాడదు.

ఇవాళే మీ అమ్మ తల్లిలా మాట్లాడింది. కడుపులో చిచ్చు పెట్టకని అన్నారు. నా గుండెలో చిచ్చుపెట్టొద్దు. మీ రక్తం చింది వచ్చే స్కూటీ నాకొద్దు అని బాధతో వాదిస్తుంది మీనా. మరి నీ కష్టార్జితంతో కొనిపెట్టిన కారు సంగతి ఏంటీ. నువ్ స్కూటీ తీసుకోకుంటే నేను నీ కారు కూడా తీసుకోను. రేపటి నుంచి ఆటోనే తోలుకుంటాను అని కోపంగా బాలు వెళ్లిపోతాడు. మీ ఇష్టం అని మీనా అంటుంది.

ఉదయం బాలు లేచేసరికి స్కూటికి బొట్టు పెట్టి, దండ వేసి ఉండటం చూసి షాక్ అవుతాడు. ఇంతలో మీనా వస్తే హో.. ఈ పూలగంపను ఈ పూలగంప ముస్తాబు చేసిందా. కోపం పోయినట్లేగా అని బాలు అంటాడు. లేదు అన్నట్లుగా బుంగమూతి పెట్టిన మీనా నాకు కారు నడపడం రాదుగా అని అంటుంది. పూజ చేయాలి అందరిని పిలవమని మీనా అంటే విజిల్ వేస్తూ అందరిని కిందకు రప్పిస్తాడు బాలు.

బాలు మరియు మీనా మధ్య విభేదాలు

అంతా వస్తే మా పూలగంప ఈ పూలగంపపై వెళ్లి ఆర్డర్లు ఇస్తుంది అని బాలు అంటాడు. దాంతో సత్యం పొగుడుతాడు. అంతా ఓకే గానీ, ఇంకోసారి ఎలాంటి సాహసాలు చేయనని బండి మీద ఒట్టేయమనండి అని మీనా అంటుంది. బాలు అలాగే చేస్తాడు. దాంతో మీనా కోపం పోయినట్లే అని మీనా అంటుంది. అమ్మ పేరు రాయించలేదేంట్రా అని మనోజ్ అడుగుతాడు.

పార్లర్‌కు అమ్మ పేరు ఉంటే పార్లరమ్మ గుట్టుచప్పుడు కాకుండా అమ్మేసింది. అచ్చిరాలేదు. పూలకొట్టుకు పెడితే అది పోయింది. అక్కడ అచ్చిరాలేదు. అందుకే అమ్మ పేరు పెట్టలేదు. కావాలంటే నువ్ అడుక్కునే బొచ్చె మీద అమ్మ పేరు రాసుకో. లేదా నీకు పుట్టబోయే బిడ్డకు అమ్మ పేరు పెట్టుకో. నేను మాత్రం ఆ పేరు పెట్టను. నా జన్మకు అమ్మే అచ్చిరాలేదు. అమ్మ పేరు ఏం కలిసి వస్తుందిరా అని బాలు కాస్తా ఎమోషనల్‌గా అంటాడు.

అత్త మామ చేతుల మీదుగా స్కూటీ కీస్ ఇవ్వమంటుంది మీనా. ముందు ఒప్పుకోని ప్రభావతి బాలు నచ్చజెప్పడంతో ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. స్కూటీకి సత్యం హారతి ఇచ్చి కొబ్బరికాయ కొడతాడు. మీనా స్కూటీ ఎక్కి బాలును కూర్చోబెట్టుకుని వెళ్తారు. అంతా లోపలికి వెళ్తారు. ఇలా అయిందేంటీ అని రోహిణి అంటే.. ఇక అది నా మాట ఎక్కడ వింటుంది. బుర్రున పోతుంది అని ప్రభావతి అంటుంది.

మరోవైపు మీనాను బయట చూసి కామాక్షి పలకరిస్తుంది. దాంతో మీనా తన కొత్త బిజినెస్ గురించి కామాక్షికి చెబుతుంది. కామాక్షి సంతోషించి మీరు త్వరలోనే వృద్ధి చెందుతారని, ఇలాగే మీరిద్దరు ఉండాలని కామాక్షి దీవిస్తుంది. మరోవైపు ప్లాన్ మొత్తం బెడిసి కొట్టింది అని రోహిణి అంటే అది చెప్పినట్లు వాడు ఆడుతున్నాడు. ఇలా చేస్తాడని అనుకోలేదని ప్రభావతి అంటుంది.

ఇంతలో ప్రభావతికి కాల్ చేసి కామాక్షి కౌంటర్లు వేస్తుంది. నువ్ ఎలాగు ఖాలీగా ఉన్నావని డోర్ డెలీవరికి నీ నెంబర్ ఇచ్చారో గోవిందా గోవిందా అని కామాక్షి కాల్ కట్ చేస్తుంది. దాంతో మళ్లీ పూలు అమ్మినట్లుగా ప్రభావతి ఫీల్ అయి అమ్మో అలాంటిది రాకూడదు అని ప్రభావతి అనుకుంటుంది. మరోవైపు బాలు, మీనాల గురించి మనోజ్ ఆలోచిస్తుంటాడు.

రోహిణి యొక్క కుట్ర

ఇంతలో వచ్చి రోహిణికి అదంతా చెబుతాడు. వాళ్లు ఒకరినొకరిని అర్థం చేసుకుంటున్నారు. రవికి కూడా శ్రుతి నుంచి సపోర్ట్ ఉంది. నాకు కూడా అలాంటి సపోర్ట్ ఉంటే నేను కూడా ఎదిగేవాన్ని. నేను ఏం చేయలేకపోతున్నాను. ఇలాగే ఉండిపోతానేమో అని భయంగా ఉంది. బిజినెస్ పెట్టుకుంటే కచ్చితంగా ఎదుగుతానని నమ్మకం ఉంది. మీ నాన్న జైలు నుంచి ఎప్పుడొస్తాడు ని మనోజ్ అంటాడు.

నువ్ నన్ను చూసి ప్రేమించావా నా ఆస్తి చూసి ప్రేమించావా. నువ్ అడిగిన ప్రతిసారి నాకు బాధేస్తుందని రోహిణి అంటే.. లేదు నిన్నుగానే ప్రేమించా అని మొహం పట్టుకుని వేడుకుంటాడు మనోజ్. తర్వాత సత్యం ఇచ్చిన డబ్బును మనోజ్ నుంచి కొట్టేసి పారిపోయిన అమ్మాయి గురించి చెబుతుంది రోహిణి. దాంతో జరిగింది గుర్తు చేసుకున్న మనోజ్ తనపేరు కల్పన అని చెబుతాడు.

కల్పన ఏదో ఒక ఏజెన్సీ ద్వారా వెళ్లి ఉంటుంది. అలా ఏ దేశానికి పారిపోయిందో తెలుసుకుని ఆ దేశ పోలీసులకు చెప్పి పట్టుకోమ్మని చెప్పొచ్చు. గట్టిగా ట్రై చేసి చూద్దాం అని రోహిణి సలహా ఇస్తుంది. ఎలాగైన తనను పట్టుకుని 40 లక్షలు రాబడితే ఈ డబ్బు గోల నుంచి బయటపడొచ్చు అని రోహిణి స్కెచ్ వేస్తుంది.

ఏజెన్సీకి వెళ్లి కల్పన గురించి డీటేల్స్ అడుగుతారు మనోజ్, రోహిణి. కానీ, ఇండియాలోనే ఉన్న కల్పన బాలు కారులో ప్రయాణిస్తుంటుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

చివరిగా, మీనా తన ప్రేమను చూపించి బాలు కోపాన్ని తగ్గించడంతో ఎపిసోడ్ ముగుస్తుంది. ప్రభావతి తన తప్పును అర్థం చేసుకుంటుంది. బాలు మరియు మీనా మధ్య ప్రేమ మరింత బలపడుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.