
గుండె నిండా గుడి గంటలు సీరియల్ 488వ ఎపిసోడ్ అద్భుతమైన మలుపులతో ప్రేక్షకులను అలరించింది. బాలుకు పొంచి ఉన్న ముప్పు, రోహిణిని బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తి, మరియు మీనాను మౌనిక ఎలా ఒప్పించిందో ఈ కథనంలో తెలుసుకుందాం.
Key Points
బాలుకు పెను ముప్పు పొంచి ఉంది!
రోహిణి బ్లాక్ మెయిల్ కు గురైంది.
మనోజ్ మరియు రోహిణి మధ్య డబ్బు విషయంలో తగాదా.
బాలుకు పొంచి ఉన్న ముప్పు
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 488వ ఎపిసోడ్ ఆసక్తికర మలుపులతో సాగింది. బాలుకు ఓ పెద్ద గండం ఉందన్న హింట్ కూడా ఈ ఎపిసోడ్ చివర్లో చూపించారు. మరి ఈ ఎపిసోడ్ లో మొత్తంగా ఏం జరిగిందో ఒకసారి చూద్దాం.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురువారం (ఆగస్టు 14) ఎపిసోడ్ మనోజ్ ను రోహిణి రూమ్ లోకి తీసుకెళ్లి చితకబాదే సీన్ తో మొదలైంది. డబ్బు నీ అకౌంట్లో పడిందని ఎందుకు చెప్పావంటూ మనోజ్ ను నిలదీస్తుంది. ఏదో డబ్బు వచ్చిందన్న సంతోషంలో అలా చెప్పానని మనోజ్ అంటాడు. ఎవరి ముందు ఎలా ఉన్నా బాలు ముందు చాలా జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇస్తుంది.
తనను తక్కువ అంచనా వేయొద్దని మనోజ్ అంటాడు. డబ్బు ఉంటేనే కదా ఈ సమస్యలన్నీ.. వెంటనే ఖర్చు పెట్టేద్దామని చెబుతాడు. చాలా జాగ్రత్తగా బిజినెస్ మొదలుపెట్టాలి.. లేదంటే మొత్తం మునుగుతాం అని రోహిణి అంటుంది. బాలు మన జోలికి రాకుండా ఉండాలంటే మీనాకు వార్నింగ్ ఇవ్వడమే కరెక్ట్ అని అనుకుంటుంది.
అటు సంజూ బర్త్‌డే సెలబ్రేషన్స్ లో అతని ఫ్రెండ్స్ విచ్చలవిడిగా మందు తాగుతూ, డ్యాన్సులు చేస్తూ ఉంటారు. ఇంతలో ఒకడు మౌనిక దగ్గరికి వెళ్లి.. ఇలాంటి వాడితో ఏం సుఖపడతావ్.. వాడు చూడు వేరే అమ్మాయిలతో ఎలా డ్యాన్స్ చేస్తున్నాడో.. నువ్వూ నాతో అలాగే చెయ్యమని చేయి పట్టుకుంటాడు. దీంతో అతని చెంప పగలగొడుతుంది మౌనిక.
రోహిణి బ్లాక్‌మెయిల్
ఏమైందంటూ సంజూ వస్తాడు. మనతో కలిసి ఎంజాయ్ చేయమనన్నానని, నీతో డ్యాన్స్ చేయమన్నందుకు ఇలా కొట్టిందని వాడు అబద్ధం చెబుతాడు. ఇలాంటి కల్చర్ లేని వాళ్లను ఎందుకు పార్టీకి తీసుకొచ్చావంటూ సంజూ ఫ్రెండ్ అంటుంది.
దీంతో మౌనిక వాళ్లకు క్లాస్ పీకుతుంది. ఇదా కల్చర్ అంటే.. అర్ధరాత్రి వరకూ ఇలా పార్టీలు, తాగుడు, పరాయి మగాడితో తన భార్య ముందే ఇలా డ్యాన్సులు చేయడం కల్చరా అని నిలదీస్తుంది. ఇలాంటి కల్చర్ తమ ఇంట్లో వాళ్లు నేర్పలేదని అంటుంది.
పార్టీకి పిలిచి మమ్మల్ని అవమానిస్తావా.. ఇక ఎప్పుడూ మమ్మల్ని పిలవకు అంటూ ఫ్రెండ్స్ వెళ్లిపోబోతారు. కానీ సంజూ మాత్రం వెళ్లాల్సింది మీరు కాదు.. ఇది అంటూ మౌనికను కొట్టి మీ ఇంట్లో వాళ్ల దగ్గరికే వెళ్లు అంటూ అక్కడి నుంచి వెళ్లగొడతాడు.
అటు మీనా దగ్గరకు రోహిణి వెళ్లి తమ డబ్బు, వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని బాలుకు చెప్పమని అంటుంది. అయినా ఆయన డౌట్ వచ్చి అడిగాడు తప్ప ఏమీ అనలేదు కదా అని మీనా అంటుంది. ఇంట్లో అందరూ కలిసి ఉండాలంటే ఒకరి విషయాల్లో మరొకరు జోక్యం చేసుకోవద్దని రోహిణి స్పష్టం చేస్తుంది. మరి గతంలో తాను బాలుకి కారు కొనిచ్చినప్పుడు ఎందుకు అందరూ ప్రశ్నించారని మీనా నిలదీస్తుంది. దానికి ఆమె దగ్గర సమాధానం ఉండదు. ఇక నుంచి అలా చేయనని చెబుతుంది.
మీనా మరియు మౌనిక
అటు రోహిణి నిలదీయడంతో మీనా కోపంతో బయట రోడ్డుపై కారు రిపేర్ చేస్తున్న బాలు దగ్గరికి వెళ్తుంది. అతన్ని వెనుక నుంచి కొడుతుంది. వాళ్ల డబ్బుతో నీకేం పని.. ఎందుకు అడుగుతారంటూ బాలుని ప్రశ్నిస్తుంది. ఇద్దరూ కాస్త మాటామాటా అనుకుంటారు. ఆ తర్వాత మీనాను బాలు బుజ్జగిస్తాడు. కోపంలోనూ చాలా అందంగా ఉన్నావంటూ రోడ్డుపై ఆమెతో సరసాలాడుతాడు. ఆ తర్వాత తనకు పూల డెలివరీ ఉందంటూ మీనా బండి తీసుకొని వెళ్లిపోతాడు.
అటు సంజూ కొట్టి పంపించడంతో మౌనిక బాధలో రోడ్డుపై ఒళ్లు మరిచి నడుచుకుంటూ వెళ్తుంది. ఎదురుగా ఏం వస్తుందో కూడా పట్టించుకోదు. ఇంతలో ఓ భారీ వాహనం ఆమెను ఢీకొట్టబోగా.. వెంటనే మీనా వచ్చి కాపాడుతుంది. అసలు ఏం జరిగింది? ఇంత రాత్రి వేళ ఇలా ఎక్కడి వెళ్తున్నావంటూ మౌనికను నిలదీస్తుంది. దీంతో ఆమె జరిగిన విషయం చెబుతుంది. తాను ఎప్పుడూ మెట్టినింట్లో సరిగా లేనని, సంజూ వేధిస్తూనే ఉన్నాడని, బాలు అన్నయ్య, మన కుటుంబంపై కోపంతో వేధిస్తున్నాడని అంటుంది.
ఇక బర్త్‌డే పార్టీలో జరిగిన విషయం చెప్పడంతో ఈ విషయం వెంటనే బాలుకు చెబుతానని, వాడి అంతు చూస్తాడని మీనా అంటుంది. దీంతో మౌనిక ఆమెను వద్దని వారిస్తుంది. ఈ విషయం చెబితే బాలు అన్నయ్య ఆవేశం కట్టలు తెంచుకొని సంజూని చంపేస్తాడని భయపడుతుంది.
నువ్వు బాలు అన్నయ్యను సహనంతో ఎలా మార్చుకున్నావో తానూ తన భర్తను మార్చుకుంటానని, ఒక్క అవకాశం ఇవ్వాలని మౌనిక కోరడంతో మీనా సరే అంటుంది. అంతటితో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్లో రోహిణిని రూ.లక్ష ఇవ్వాలంటూ ఓ వ్యక్తి బ్లాక్ మెయిల్ చేయడం, అటు బాలుకు త్వరలోనే పెద్ద ముప్పు పొంచి ఉందని ఓ జ్యోతిష్యుడు వార్నింగ్ ఇవ్వడంలాంటివి ప్రోమోలో చూపించారు.
ఈరోజు ఎపిసోడ్ లో చూపించిన ట్విస్టులు అభిమానులను ఆకట్టుకున్నాయి. బాలు, రోహిణి మరియు మీనా జీవితాల్లో వచ్చే మార్పులు ఆసక్తికరంగా ఉంటాయి. తదుపరి ఎపిసోడ్ కోసం ఎదురుచూద్దాం.


