
గుండె నిండా గుడి గంటలు సీరియల్ 512వ ఎపిసోడ్ లో, మనోజ్ యొక్క ఓవరాక్షన్ మరియు ప్రభావతి యొక్క ప్రవర్తనలు ఇంట్లో హాస్యాన్ని నింపాయి. మీనా ప్రభావతికి ఎదురు తిరిగింది, సత్యం ఆమెను మెచ్చుకున్నాడు. రోహిణి మరియు బాలుల వ్యాఖ్యలు కూడా హైలైట్స్.
Key Points
మనోజ్ ఓవరాక్షన్ వల్ల ఇంట్లో నవ్వులు
ప్రభావతికి మీనా ఎదురు తిరిగింది
రోహిణి, బాలుల వ్యాఖ్యలు
మనోజ్ యొక్క పనివాళ్లతో గొడవ
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 512వ ఎపిసోడ్ లో మనోజ్, ప్రభావతి చేసే ఓవరాక్షన్ తో ఇంట్లో వాళ్లందరూ నవ్వుకుంటారు. అయితే ప్రభావతికి మీనా ఎదురు తిరగడం, తొలిసారి నా కోడలు చాలా బాగా మాట్లాడిందంటూ మీనాకు సత్యం మెచ్చుకోవడం మాత్రం ఈ ఎపిసోడ్ హైలైట్ అని చెప్పొచ్చు.
మనోజ్‌ని తిట్టి వెళ్లిపోయిన పనివాళ్లు
గుండె నిండా గుడి గంటలు బుధవారం (సెప్టెంబర్ 17) ఎపిసోడ్ మనోజ్ తన షాపులో పని వాళ్లను తీసేసే సీన్ తో మొదలవుతుంది. మీరు ముసలి వాళ్లు అయిపోయారు.. నాకు యంగ్ బ్లడ్ కావాలంటూ కొత్త వాళ్లను తీసుకొస్తాడు మనోజ్. అది చూసి వాళ్లు బాధపడతారు.
ఓ నెల రోజులు ఆగి తీసేయొచ్చు కదా అని రోహిణి అంటుంది. దాని కంటే ఇప్పుడు తీసేయడమే మేలు.. బిజినెస్ లో అనుభవం ఉన్న వాళ్లను పక్కన పెట్టి పిల్ల బచ్చాలను తీసుకుంటున్నాడు.. నువ్వు అనుభవిస్తావు.. మా ఉసురు తగులుతుంది అని వాళ్లు మనోజ్ ను తిట్టుకుంటూ వెళ్లిపోతారు.
మనోజ్‌కు దిష్టి తీసిన ప్రభావతి.. ఆడుకున్న బాలు
అటు ఇంటికి చాలా అలిసిపోయి వస్తాడు మనోజ్. అతన్ని చూసి ప్రభావతి తెగ హడావిడి చేస్తుంది. దిష్టి తీసి హారతి ఇస్తుంది. అది చూసిన బాలు అతనితో ఆడుకుంటాడు. ఒక్క రోజుకే ఏం సాధించాడని హారతి ఇస్తున్నారని శృతి కూడా అంటుంది. ఎన్ని లక్షలు సంపాదించావని రవి వెటకారంగా అడుగుతాడు. ఎన్ని లక్షలు మింగావని బాలు అంటాడు.
ప్రభావతి యొక్క అతిగా రక్షించే ప్రవర్తన
ఏసీలో కూర్చొని, నలుగురితో మాట్లాడితేనే అలసిపోయాడా అంటూ బాలు ఎగతాళి చేస్తాడు. మామీద పడి ఏడవడం ఎక్కువైందని రోహిణి అంటుంది. నాన్నకు ఇవ్వాల్సిన రూ.40 లక్షలు ఇచ్చే వరకైనా పని చేస్తాడనుకుంటే ఒక్క రోజుకే అలసిపోయాడేంటని బాలు మరింత చెలరేగుతాడు.
మనోజ్‌కు క్లాస్ పీకిన సత్యం
అటు సత్యం కూడా ప్రభావతి చేసే హడావిడి చూసి షాక్ తింటాడు. ఇంట్లోకి వచ్చిన మనోజ్.. తనకు మంచి నీళ్లు ఇవ్వండి, జ్యూస్ ఇవ్వండి అంటూ మీనా, రవికి ఆర్డర్ వేస్తాడు. నీ పెళ్లాం లేదా అని బాలు అంటాడు. మనం చేసే పనిని ప్రేమిస్తే అలసట అనేది తెలియదు..
నేను రాత్రి షిఫ్ట్ చేసుకొని వచ్చి మీ అమ్మ పక్కన మీ నలుగురూ పడుకోవడం చూసి మీ కోసమే కదా ఇదంతా చేస్తున్నాను అనుకొని మళ్లీ సెకండ్ షిఫ్ట్ కు వెళ్లేవాడిని.. అలా అనుకుంటే ఏ పనిలోనూ అలసట ఉండదంటూ మనోజ్ కు సత్యం గట్టిగానే క్లాస్ పీకుతాడు. కానీ అదేమీ పట్టనట్లు మనోజ్ వెళ్లిపోతాడు.
తన గదిలోకి వెళ్లి మనోజ్ పడుకుంటాడు. ఈ రూమ్ బాలు వాళ్లకు ఇవ్వాలి కదా లేవమని రోహిణి ఎంత చెప్పినా పట్టించుకోడు. అదే విషయం బాలు, మీనా, ప్రభావతికి రోహిణి చెబుతుంది. వాడు లేవకపోతే తానే వచ్చి లేపుతానని అనడంతో వద్దు నేనే వెళ్తానని రోహిణి వెళ్లి డోరు వేస్తుంది. ఎంతసేపటికీ రాకపోవడంతో బాలు ఇక ఆవేశం ఆపుకోలేక పైకి వెళ్లి గొడవ చేస్తాడు.
వాడు అలసిపోయి పడుకుంటే ఎందుకింత రాద్ధాంతం చేస్తావంటూ బాలునే తిడుతుంది ప్రభావతి. అది చూసిన సత్యం.. మీరు మా గదిలో పడుకోండి.. మేము హాల్లో పడుకుంటామని అంటాడు. వద్దులే మేమే పైన పడుకుంటామని బాలు, మీనా వెళ్లిపోతారు.
సత్యం యొక్క మనోజ్ కు సలహా
బాలుకి సర్ది చెప్పిన మీనా
మేడ మీదికి వెళ్లిన తర్వాత బాలు ఆవేశంతో ఊగిపోతాడు. వాడు కావాలనే ఒక్క రోజు షాపుకి వెళ్లి వచ్చి అలసిపోయినట్లు నటిస్తున్నాడని అంటాడు. దీంత మీనా సర్ది చెబుతుంది. మనకు తెలిసిన పని మనం చేస్తున్నాం.. వాళ్లకు తెలిసిన పని వాళ్లు చేస్తున్నారు.. అయినా ప్రశాంతంగా నిద్రపోయేది ఎంత ఉంటే దానితో సంతృప్తి చెందే వారే.. మనం అలాగే ఉన్నామంటూ బాలుకు మీనా సర్ది చెప్పడంతో అతడు శాంతిస్తాడు.
ప్రభావతికి ఎదురు తిరిగిన మీనా
మరుసటి రోజు ఉదయం సత్యంకి కాఫీ తెచ్చి ఇస్తుంది మీనా. మనోజ్ కు పైకి వెళ్లి ఇవ్వు అని ప్రభావతి ఆర్డర్ వేస్తుంది. నేను ఇయ్య అంటూ ముఖం మీదే చెప్పేస్తుంది మీనా. నా భర్తకు ఇస్తాను.. మీకు ఇస్తాను.. చిన్న వాళ్లయిన రవి, శృతికి ఇస్తాను.. మీ పెద్ద కొడుకుకు పెళ్లి కాలేదు.. పెళ్లాం లేదా అంటూ గట్టిగానే ప్రభావతిని వాయిస్తుంది మీనా. అది చూసి ఇన్నాళ్లకు నా కోడలు సరిగ్గా మాట్లాడింది అంటాడు సత్యం. దీంతో ప్రభావతికి మరింత మండుతుంది.
అంతలో మనోజ్ ఇంకా లేవడం లేదని కిందికి వచ్చి చెబుతుంది రోహిణి. దీంతో మీనా, సత్యం నవ్వుకుంటారు. షాపు ఎవరు తీస్తారు మరి అని అడుగుతాడు. రోహిణి, ప్రభావతి వెళ్లి ఎంత ప్రయత్నించినా మనోజ్ లేవడు. దీంతో మరోసారి నీ గారాబం వల్లే వాడు ఇలా ఎందుకూ పనికి రాకుండా పోయాడంటూ ప్రభావతికి సత్యం క్లాస్ పీకుతాడు. అంతటితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ఈ ఎపిసోడ్ లో ప్రతి పాత్ర తన తన విధంగా ప్రేక్షకులను అలరించింది. మనోజ్ యొక్క ఓవరాక్షన్, మీనా యొక్క తిరుగుబాటు, మరియు ఇతరుల ప్రతిచర్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.


