
గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్‌లో బాలుకు రాజకీయాల నుండి ఆఫర్ వస్తుంది. అదే సమయంలో, మీనా పూల షాప్‌కు ఒక పెద్ద ఆర్డర్ వచ్చి ఆమెను ఆనందంలో ముంచుతుంది. కానీ సంజు మాత్రం భయంతో వణుకుతున్నాడు.
Key Points
బాలుకు రాజకీయ నాయకుడి నుండి కౌన్సిలర్ పదవి ఆఫర్!
మీనా పూల షాప్‌కు 500 మాలల భారీ ఆర్డర్!
సామూహిక వివాహాల ఆర్డర్‌తో బాలు, మీనా మధ్య ఉత్కంఠ!
బాలు, మీనా మధ్య సత్యం చేసిన ప్రయత్నాలు!
రాజకీయ ప్రవేశం
బాలును ఓ పొలిటికల్ లీడర్‌కు అసిస్టెంట్‌గా పనిచేసే అశోక్ అనే స్నేహితుడు కలుస్తాడు. బాలు కారు అమ్మేశాడు అని తెలిసి జాలి చూపిస్తాడు. తమ పార్టీలో చేరితే బాలును కౌన్సిలర్‌ను చేస్తానని అశోక్ అంటాడు. నాకు రాజకీయాలు అచ్చిరావని, నన్ను వదిలేయమని అశోక్‌తో బాలు అంటాడు. బాలు చెప్పిన మాటలను ఆ స్నేహితుడు వినడు. తమ పార్టీలో చేరాల్సిందేనని పట్టుపట్టి బాలును పొలిటికల్ లీడర్ దగ్గరకు తీసుకొస్తాడు.
ఆ పొలిటికల్ లీడర్ 250 జంటలకు సామూహిక వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తాడు. ఆ సామూహిక వివాహాలకు పూల దండలు సమకూర్చే వ్యక్తి చివరి నిమిషంలో హ్యాండివ్వడంతో ఆ ఆర్డర్‌ను మీనా పూల షాప్‌కు ఇప్పిస్తాడు అశోక్. ఐదు వందల మాలలు టైమ్‌కల్లా డెలివరీ ఇవ్వాలని లేదంటే దొంగ కేసులు బనాయించి జైలుకు పంపిస్తానని ఆ పొలిటికల్ లీడర్ వార్నింగ్ ఇవ్వడంతో బాలు భయపడిపోతాడు.
పెద్ద ఆర్డర్ దక్కిన విషయం మీనాకు చెప్పాలని సంతోషంగా ఇంటికొస్తాడు బాలు. కానీ మీనాతో తనకు మాటలు లేవని గుర్తొస్తుంది. మీనాను పిలవమని సత్యానికి చెబుతాడు బాలు. నీ భార్యకు వెళ్లి నువ్వే చెప్పు…నీకు నోరు ఉందిగా అని సత్యం సెటైర్లు వేస్తాడు. కానీ వదిలిపెట్టకపోవడంతో చివరకు మీనాను పిలుస్తాడు సత్యం.
ఇద్దరి మధ్యలో సత్యం రాయబారం నడుపుతాడు. పూల మాలల ఆర్డర్ తీసుకొచ్చానని, అట్లాంటిది..ఇట్లాంటిది కాదని మీనా ముందు బిల్డప్‌లు ఇస్తాడు బాలు. నాలుగా, ఐదా ఎన్ని దండలు అని మీనా అడుగుతుంది. ఐదొందలు అని బాలు సమాధానమివ్వగానే సత్యం, మీనా షాకవుతారు.
భారీ ఆర్డర్
బాలు జోకు చేస్తున్నాడని మీనా వెళ్లిపోబోతుంది. కానీ ఆమెను ఆపి పొలిటికల్ లీడర్ సామూహిక వివాహాలు జరిపిస్తున్నాడని, అందుకోసం ఐదు వందల మాలల ఆర్డర్ ఇచ్చాడని, అడ్వాన్స్ కూడా ఇచ్చాడని ఇరవై వేలు ఇస్తాడు బాలు . ఒక్కో మాల ఐదు వందలు అని మీనా అంటుంది.
అంతా రేటా…జనాలను పీడించుకొని తింటున్నావా మీనాపై ఫైర్ అవుతాడు బాలు. మార్కెట్‌కు వెళితే ఆరు వందలు చెబుతారని, నేను డిస్కౌంట్ ఇచ్చానని బాలుకు మాటకు మాట సమాధానమిస్తుంది మీనా. ఇద్దరు కలిసి సత్యాన్ని ఆడుకుంటారు.
రెండు రోజుల్లో ఆర్డర్ కావాలని అనగానే బాలు ఇచ్చిన డబ్బులను తిరిగి వెనక్కి ఇవ్వబోతుంది మీనా. ఆర్డర్ తీసుకున్నానని, మాట నిలబెట్టకపోతే తన పరువు పోతుందని బాలు అంటాడు. బాలు మాట నిలబెట్టడానికైనా ఆర్డర్ తీసుకుంటుంది మీనా. బస్తీ వాళ్లను తీసుకొచ్చి మాలలు కట్టిస్తానని అంటుంది.
మౌనిక ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో ఆమె కోసం సిటీ మొత్తం వెతుకుతుంటాడు సంజు. మౌనిక ఫొటో చూపిస్తూ ఈమెను ఎక్కడైనా చూశారా అంటూ అందరిని అడుగుతుంటాడు. మౌనిక కోసం ఎంక్వైరీ చేస్తున్న సంజును బాలు చూస్తాడు. అతడు టెన్షన్‌గా కనిపించడంతో అనుమానపడతాడు.
మీనా, బాలు మధ్య సంఘర్షణ
సంజు దగ్గరకు వెళ్లి ఏం కావాలని అడుగుతాడు. మౌనిక కనిపించడం లేదనే విషయం దాచిపెట్టి ఓ అడ్రస్ కోసం వెతుకుతున్నానని అంటాడు. ఈ ఏరియా నాకు మొత్తం తెలుసునని, నేను చూపిస్తానని బాలు అంటాడు. కానీ బాలు సాయాన్ని తీసుకోవడానికి సంజు ఒప్పుకోడు. అవనసరంగా వీడి దృష్టిలో పడ్డానని అక్కడి నుంచి జారు కుంటాడు.
సంజును కలిసిన ఓ వ్యక్తి ద్వారా అతడు దేని గురించి ఎంక్వైరీ చేస్తున్నాడో ఆరా తీస్తాడు బాలు. అతడి ద్వారా మౌనిక గురించే సంజు వెతుకుతున్నాడని తెలిసి బాలు షాకవుతాడు. మౌనిక ఫోన్ స్విఛాఫ్ అని రావడంతో బాలు అనుమానం మరింత బలపడుతుంది.
సంజు తనపై వేసిన నిందలు భరించలేకపోతుంది మౌనిక. గుడికి వచ్చిన తన బాధను దేవుడితో పంచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. తన జీవితం మొత్తం తలకిందులు అయ్యిందని బాధపడుతుంది. పుట్టింటికి వెళ్లలేనని, బాలుకు విషయం చెప్పలేనని బాధపడుతుంది. తనకు ఓ దారి చూపించమని వేడుకుంటుంది.
మౌనిక ఉన్న గుడికే మీనా వస్తుంది. మౌనిక కన్నీళ్లతో ఒంటరిగా కూర్చోవడం చూసి కంగారు పడుతుంది. ఏమైందని అడుగుతుంది. సంజు తనపై వేసిన నిందలను దాచిపెడుతుంది మౌనిక. పుట్టింటికి వెళతానంటే సంజు వద్దన్నాడని, అందుకే కన్నీళ్లు పెట్టుకుంటున్నానని అబద్ధం ఆడుతుంది. తనకు అత్తింట్లో ఏ కష్టం లేదని అంటుంది. బాలు, సంజు మధ్య గొడవలు సమిసిపోతే బాగుండున్నదే తన బాధ అని మౌనిక అంటుంది. ఆమె మాటలు నిజమని మీనా నమ్ముతుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.
చివరిగా, బాలుకు వచ్చిన అనుకోని రాజకీయ అవకాశం మరియు మీనా పూల షాప్‌కు వచ్చిన భారీ ఆర్డర్ ఈ ఎపిసోడ్‌కు ఉత్కంఠను జోడిస్తుంది. బాలు, మీనా మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో చూడాలి.


