|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గుండె నిండా గుడి గంటలు: గుణ, శివ రౌడీయిజం! బాలు వార్నింగ్, మీనా సంచలన నిర్ణయం!

Published: 13-01-2026, 10:23 PM
గుండె నిండా గుడి గంటలు: గుణ, శివ రౌడీయిజం! బాలు వార్నింగ్, మీనా సంచలన నిర్ణయం!
  • బాబురావు ఇంట్లో గుణ, శివ దాదాగిరి.. అడ్డుకున్న బాలు!
  • గుణ, శివతో బాలు సంతకాలు చేయించి బుద్ధి చెప్పాడు.
  • సుమతికి శ్రుతి వాచ్ గిఫ్ట్.. సరోగసి గురించి చర్చలు!
  • శివ పుట్టినరోజు వేడుకలకు బాలు సెటైర్లు.. మీనా ప్లాన్!

గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో సరికొత్త ట్విస్ట్! గుణ, శివ ల దాదాగిరిని బాలు ఎలా అడ్డుకున్నాడు? మీనా ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకుంది? తెలుసుకోవాలంటే వెంటనే చూసేయండి!

బాబురావు ఇంట్లో గుణ, శివ హల్ చల్!

గుండె నిండా గుడి గంటలు జనవరి 14 ఎపిసోడ్‌లో బాబురావు ఇంట్లో గుణ, శివ దాదాగిరి చేస్తారు. అక్కడికి వచ్చిన బాలు ఇద్దరికి బుద్ధి చెప్పి నోట్ రాయిస్తాడు. దానికి సాక్షిగా బాలు ఉంటాడు. శివ పుట్టినరోజు కావడంతో గుడిలో ప్రసాదాలు పంచి పెట్టాలనుకుంటుంది పార్వతి. దానికి మీనాను పిలుస్తారు. బాలును శివ వద్దంటాడు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో బాబురావు అనే వ్యక్తి ఇంటికి వెళ్లి గుణ, శివ డబ్బు కోసం దాదాగిరి చేస్తారు. బాలు కారులోనే బాబురావు వస్తాడు. బాబురావు కారులో బ్యాగ్ మర్చిపోవడంతో బాలు తీసుకు వస్తాడు. మరోవైపు వడ్డీ సరిగ్గానే కడుతున్నా కదా ఇంటికి ఎందుకు వచ్చావని గుణ ను బాబురావు అడుగుతాడు.

ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని బాబురావు అంటాడు. నేనేమైనా మీ ఆవిడను తీసుకెళ్తానా అని అప్పటివరకు అని గుణ అంటుంటే నాలుగు ఇళ్లలో అడుక్కు తింటావా అని బాలు ఎంట్రీ ఇస్తాడు. ఏంట్రా ఇళ్లలకు దూరి బెదిరిస్తున్నావా అని బాలు అంటాడు. నేను నా బిజినెస్ చేస్తున్నా అడ్డు పడకు అని గుణ అంటాడు.

గుణను పక్కనున్న రౌడీని బాలు కొడతాడు. నీ బిజినెస్ చూశాను. ఇలాంటి వాళ్లు ఇంటికి వచ్చి బెదిరిస్తుంటే చూస్తారేంటీ పోలీసులకు ఫోన్ చేయండని అని బాలు అంటాడు.

బాలు స్టైల్లో గుణ, శివకు బుద్ధి

ఏది చేయు. నేను కేవలం మంచినీళ్లు తాగడానికి వచ్చానని చెబుతానని గుణ అంటాడు. నీ గురించి తెలిసే నువ్వు మాట్లాడింది వీడియో తీశాను అని చూపిస్తాడు బాలు . దాంతో గుణ భయపడిపోతాడు.

గుణ, శివతో సంతకం చేయించి తాను సాక్షి సంతకం చేస్తాడు బాలు. దాంతో గుణ, శివ వెళ్లిపోతారు. బాలుకు బాబురావు థ్యాంక్స్ చెబుతాడు. మరోవైపు సుమతి కోసం హాస్పిటల్‌కి వెళ్తుంది శ్రుతి. వచ్చి కంగ్రాట్స్ చెప్పి ట్రీట్ అడుగుతుంది. ఫస్ట్ సాలరీ రాగానే ఇస్తానంటుంది శ్రుతి. సుమతికి వాచ్ గిఫ్ట్‌గా ఇస్తుంది శ్రుతి. దాంతో సుమతి చాలా సంతోషిస్తుంది.

తనకు పిల్లలు కావాలి కానీ పెయిన్ వద్దని శ్రుతి అంటుంది. తల్లి అయ్యే ఫీలింగ్ గురించి గొప్పగా చెబుతుంది శ్రుతి. భయంతో సరోగసీ పద్ధతితో పిల్లలు కంటానని, దానికి కావాల్సిన సమాచారం తెలుసుకో అని శ్రుతి అంటుంది. దానికి చాలా ఖర్చు అవుతుంది, ఆ పద్ధతి గురించి తెలుసుకుంటా. ఎవరికి చెప్పను అని శ్రుతి అంటుంది.

శివ కోసం మీనా సంచలన నిర్ణయం!

తర్వాత రెండో కారుకు వచ్చిన డబ్బును రాజేష్ ఇచ్చాడని మీనాకు ఇస్తాడు బాలు. శివ పుట్టినరోజు గురించి చెబుతుంది మీనా. బాలు సెటైర్లు వేస్తాడు. గుడికి తీసుకెళ్లి ప్రసాదాలు పంచిపెడతానంటుంది, మిమ్మల్ని కూడా రమ్మంది అని మీనా అంటుంది. కానీ, మీ తమ్ముడు వద్దన్నాడా బాలు అంటాడు. గుణ గురించి తిరగడం, కొడుకును ఓ దెబ్బ వేయడం తప్పులేదని బాలు అంటాడు.

మీనా తమ్ముడుని వెనకేసుకొస్తే బాలుకు కోపం వస్తుంది. గుణ వెంట వీడే తిరుగుతున్నాడు. అంతా దొంగలముఠా. అసలు వీడు ఏం చేశాడో తెలుసా అని అనబోయి మీనా బాధపడుతుందని ఆగుతాడు బాలు. వాడు మారిపోయాడు అని మీనా అంటుంది. మారడం అంటే బట్టలు మార్చడం కాదు బుద్ధి మార్చడం. గుణతో తిరగడం ఆపితే తప్ప వాడు మారడు. నువ్వేం గుడికి వెళ్లక్కర్లేదు అని బాలు అంటాడు.

ఇంట్లో వాళ్లను బాధపెట్టకుండా ఉండాలంటే వెళ్లు అని శ్రుతి అంటుంది. దాంతో తమ్ముడి కోసం బాలు మాట కాదని మీనా గుడికి వెళ్తుంది. ఆ విషయం తెలుసుకున్న ప్రభావతి బాలు రాగానే చెబుతుంది. గుడికి వెళ్లిన బాలు మీనాను కోపంగా చూస్తాడు. భర్త కంటే పనిపాట లేకుండా తిరిగే తమ్ముడు ఎక్కువయ్యాడని బాలు అంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజుకో మలుపు తిరుగుతోంది. మీనా నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.