
📌 Key Points
- జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా ‘హ్యాపీ రాజ్’ చిత్రం రూపొందుతోంది.
- మరియా రాజా ఎలాంచెజియన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
- శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్‌గా నటిస్తుండగా, మార్చి 27న సినిమా విడుదల కానుంది.
- ట్రైలర్‌లో జీవీ ప్రకాష్ ప్రేమలో విభిన్న కోణాలను చూపించారు.
జీవీ ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘హ్యాపీ రాజ్’. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ఇందులో శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్‌గా నటిస్తోంది.
హ్యాపీ రాజ్ ట్రైలర్ విశేషాలు
Happy Raj: స్టార్ కంపోజర్ కమ్ హీరో జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) అప్ కమింగ్ మూవీ ‘హ్యాపీ రాజ్’ (Happy Raj). హీరో- డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియా రాజా ఎలాంచెజియన్ (Maria Raja Elanchezian) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. బియాండ్ పిక్చర్స్ బ్యానర్ పై జైవర్ద నిర్మించారు. తెలుగమ్మాయి, ‘మ్యాడ్’ ఫేం శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా మార్చి 27 తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబైంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై పాజిటివ్ బజ్‌ను ఏర్పడేలా చేసిన విషయం తెలిసిందే. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ ద్వారా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా శుక్రవారం ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ (Happy Raj) ఎలా ఉందంటే..
హీరోయిన్‌తో జీవీ ప్రకాష్ కెమిస్ట్రీ ఎలా ఉంది?
హీరో జీవీ ప్రకాష్ కుమార్ రీల్స్‌తో మొదలైన ఈ ట్రైలర్‌లో.. ఐ లవ్ యు 1, 2, 3 అంటూ అమ్మాయిల వెంట ప్రేమ అంటూ పడే యువకుడిలా వెరైటీ గెటప్‌లో హీరోని ప్రజంట్ చేశారు. అమ్మాయిలు హీరోని ఇష్టపడటానికి కారణాలు చెప్పించి, ఒక అమ్మాయి హీరోకి లవ్ లెటర్ ఇచ్చినట్లుగా చూపించారు. మరోవైపు హీరో తండ్రి పాత్రను హైలెట్ చేస్తూ.. ఆ పాత్రకు ఉన్న ఇంపార్టెన్స్‌ని పరిచయం చేశారు. హీరో తండ్రి పాత్ర ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ అనేది ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. అంతేకాదు, తండ్రి పాత్రని చూపించిన తీరు కూడా చాలా వైవిధ్యంగా ఉంది. ఊరిలో ఉన్న అమ్మాయిలు ఎవరూ పడటం లేదని, పొరుగూరు అమ్మాయిలను ట్రై చేయమనే సలహాలు హీరో వినడం మొదలు పెట్టగానే.. హీరో లైఫ్‌లోకి హీరోయిన్ ఎంటరైంది.
సినిమాలో తండ్రి పాత్ర ప్రాముఖ్యత
ఇంత వరకు లవ్ చేసిన అమ్మాయిలందరూ హ్యాండ్ ఇచ్చారని హీరో చెప్పే డైలాగ్, ఆ డైలాగ్ వస్తున్నప్పుడు హీరోయిన్‌ని చూపించే విధానం యూత్‌ని బాగా ఆకర్షించేలా ఉంది. హీరోతో హీరోయిన్ చాలా దూరం వెళ్లిపోయిన తర్వాత.. ‘మీ అమ్మనాన్నలని మా ఇంటికి వచ్చి సంబంధం మాట్లాడమను’ అని హీరోయిన్ అడుగుతుంది. అసలు కథ ఇక్కడే టర్న్ తీసుకుంటుందనేది ట్రైలర్ చూసే ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. హీరోయిన్ ఫాదర్‌గా అబ్బాస్ ఎంట్రీ అదిరింది. అక్కడి నుంచి ప్రతి షాట్.. సినిమాపై ఆసక్తిని కలిగించేలా మేకర్స్ ఈ ట్రైలర్‌ని కట్ చేశారు. ఫ్రాడ్ ఫ్యామిలీ అంటూ అబ్బాస్ ఫైర్ అవడం, హీరోని హీరోయిన్ తిట్టడం.. ఫ్యామిలీ ఫైటింగ్.. ఇలా హుషారు హుషారుగా ట్రైలర్ నడిచింది. లైఫ్‌లో అమ్మాయి శపిస్తే, అది కచ్చితంగా జరుగుతుందనేలా ఓ సన్నివేశాన్ని ట్రైలర్ మొత్తం చూపిస్తూనే ఉన్నారు. చివరిలో హిందీ డైలాగ్స్ మరో హైలెట్. తండ్రి పాత్రని హీరో తిట్టడం, అదే టైమ్‌లో భయపడినట్లుగా చూపించడం చూస్తుంటే.. ఈ సినిమాలో మస్త్ షేడ్స్ ఉన్నాయనేది అర్థమవుతోంది. ఓవరాల్‌గా ట్రైలర్ సినిమాపై ఇంప్రెస్ కలిగేలా చేయడంలో మాత్రం సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు.
మొత్తానికి ‘హ్యాపీ రాజ్’ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. జీవీ ప్రకాష్ కుమార్ మరోసారి తన నటనతో మెప్పించేందుకు సిద్ధంగా ఉన్నారు. సినిమా విడుదల కోసం ఎదురుచూద్దాం.


