
📌 Key Points
- చేతులు లేకున్నా చిరునవ్వుతో ఆడుకుంటున్న పిల్లలను చూస్తూ ఆనందిస్తున్న చిన్నారి.
- దివా చౌదరీ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియో వైరల్.
- గతంలో చేతులు ఉన్నప్పటి వీడియోను సైతం షేర్ చేసిన దివా చౌదరీ.
- చిన్నారి స్ఫూర్తిదాయకమైన చిరునవ్వుకు నెటిజన్లు ప్రశంసలు.
రెండు చేతులు లేకున్నా ఓ చిన్నారి చిరునవ్వుతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన తోటి పిల్లలు ఆడుకుంటుంటే వారిని చూస్తూ ఆనందిస్తున్న ఈ చిన్నారి వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది.
చిరునవ్వుతో ఆకట్టుకుంటున్న చిన్నారి
రెండు చేతులు లేవనే బాధ ఆ పసిపాప ముఖంలో అస్సలు లేదు. తన తోటి స్నేహితులు ఉత్సాహంగా ఆడుకుంటుంటే.. తాను వారితో కలిసి ఆడలేకపోతున్నానన్న దిగులు లేకుండా, వారి ఆనందాన్ని చూసి ఆ చిన్నారి మురిసిపోయిన తీరు నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది. దివా చౌదరీ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఒక ఇంటి ముందు పిల్లలు ఆడుకుంటుండగా, చేతులు లేని ఓ చిన్నారి పక్కనే కూర్చొని వారిని చూస్తూ స్వచ్ఛమైన నవ్వులు చిందించడం ఈ వీడియోలో చూడొచ్చు. కాగా, దివా చౌదరీ అనే deeva_2024 ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్నారి వీడియోలు ఉన్నాయి. ఈ వీడియో వైరల్ కావడంతో ఆ ఖాతా నుంచి తాజాగా మరో వీడియో విడుదల చేశారు. అందులో చిన్నారికి చేతులు ఉన్నప్పుడు గతంలో తీసిన వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోను సైతం చూసిన నెటిజన్‌లు తీవ్ర భావోద్వేగానికి గురైయ్యారు.
శారీరక వైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదని, లేనిదాని గురించి బాధపడకుండా ఉన్నదానితో సంతోషంగా గడపాలని ఆ పాప తన చిరునవ్వు ద్వారా చాటిచెప్పిందని నెటిజన్‌లు స్పదిస్తున్నారు. స్నేహం అంటే కలిసి ఆడుకోవడమే కాదు, ఇతరుల సంతోషాన్ని చూసి ఆనందించడం అని నిరూపించింది. నెటిజన్లు ఆ చిన్నారి చిరునవ్వుకు ముగ్ధులవుతూ.. ‘నీ నవ్వులో ఎంత శక్తి ఉందో తల్లీ’ అంటూ కామెంట్ల రూపంలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
వైరల్ అవుతున్న దివా చౌదరీ వీడియో
గతంలో చిన్నారి వీడియోను షేర్ చేసిన యూజర్
శారీరక వైకల్యం మనసుకు కాదని ఆ చిన్నారి నిరూపించింది. లేని దాని గురించి బాధపడకుండా ఉన్నదానితో సంతోషంగా జీవించాలని ఆ పాప తన చిరునవ్వు ద్వారా చాటి చెప్పింది.


