|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విడాకుల రూమర్స్‌.. హన్సిక ఆసక్తికర పోస్ట్‌

Published: 11-08-2025, 5:18 AM
విడాకుల రూమర్స్‌.. హన్సిక ఆసక్తికర పోస్ట్‌

హీరోయిన్ హన్సిక మోతెళ్ళి వ్యక్తిగత జీవితంపై విడాకుల పుకార్లు వస్తున్నాయి. తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా పెట్టిన పోస్ట్‌ ఈ చర్చను మరింత రేకెత్తిస్తోంది. ఈ పోస్ట్ లో ఆమె ఏమి రాసి ఉందో చూద్దాం.

Key Points

1

హన్సిక మోతెళ్ళి విడాకుల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

2

తాజాగా తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న హన్సిక, ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది.

4

హన్సిక భర్త సోహైల్ తో మనస్పర్థలు ఉన్నాయని, ఆమె తన తల్లితో ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

హన్సిక పుట్టినరోజు పోస్ట్‌

హీరోయిన్ ‌ హన్సిక వ్యక్తిగత జీవితంపై గత కొద్దిరోజులుగా సోషల్ ‌ మీడియాలో రకరకాల పుకార్లు వస్తున్నాయి . ఆమె భర్తకు దూరంగా ఉందని , త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి . ఈ నేపథ్యంలో తాజాగా హన్సిక తన ఇన్ ‌ స్టా స్టోరీలో పెట్టిన ఒక పోస్ట్ ‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది . తాజాగా పుట్టిన రోజు ( ఆగస్ట్ ‌ 9) వేడుకలు జరుపుకున్న ఆమె .. ఈ ఏడాది తనకు చాలా స్పెషల్ ‌ అని .. ఎన్నో పాఠాలు నేర్పిందని అన్నారు .

విడాకుల పుకార్లు

‘ఈ ఏడాది (2025) నేను అడగకుండానే నాకు ఎన్నో పాఠాలు నేర్పింది . నాలో నాకు తెలియనంత బలం ఉందని తెలిసేలా చేసింది. ఈ పుట్టినరోజున మీ అందరి శుభాకాంక్షలతో నా హృదయం ఉప్పొంగిపోతోంది. చాలా ప్రశాంతంగా ఉంది. ఒక్కోసారి చిన్న విషయాలు కూడా ఎంతో ఆనందాన్నిస్తాయి. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు ’ అని హన్సిక ఇన్ ‌ స్టా పోస్ట్ ‌ లో రాసుకొచ్చింది . దీంతో మరోసారి హన్సిక విడాకుల విషయంపై సోషల్ ‌ మీడియాలో చర్చ జరుగుతోంది .

హన్సిక-సోహైల్ వివాహం

2022 డిసెంబర్ ‌ లో హన్సిక తన ప్రియుడు సోహైల్ ‌ ని వివాహం చేసుకుంది . సోహల్‌కు ఇది రెండో పెళ్లి. హన్సిక స్నేహితురాలితో ఆయనకు ఇంతకుముందే పెళ్లై విడాకులు తీసుకున్నాడు. వీరి వివాహాన్ని ‘లవ్‌ షాదీ డ్రామా’ అనే పేరుతో డాక్యుమెంటరీ సిరీస్‌గా కూడా విడుదల చేశారు . పెళ్లయిన రెండేళ్లకే హన్సికకు, భర్తకు మధ్య మనస్పర్థలు తలెత్తాయని, దీంతో ఇద్దరు విడిపోయినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రసారం వైరల్‌ అవుతోంది. సోహల్‌ది పెద్ద కుటుంబం అని, వారితో హన్సిక కలవలేకపోవడం వల్లే మనస్పర్థలు వచ్చాయని, దీంతో ఆమె తన తల్లి వద్దనే ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

హన్సిక తన ఇన్‌స్టా పోస్ట్ ద్వారా తన జీవితంలోని కష్టాల గురించి, బలాన్ని పొందడం గురించి చెప్పింది. విడాకుల పుకార్లపై ఆమె స్పష్టత ఇవ్వలేదు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.