|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: హార్మోన్ ఇంజెక్షన్స్‌పై హన్సిక సంచలన నిజాలు! దేశముదురు వివాదానికి ఎండ్ కార్డ్!!

Published: 18-04-2026, 8:05 AM
షాకింగ్: హార్మోన్ ఇంజెక్షన్స్‌పై హన్సిక సంచలన నిజాలు! దేశముదురు వివాదానికి ఎండ్ కార్డ్!!
  • హార్మోన్ ఇంజెక్షన్స్‌పై హన్సిక క్లారిటీ: చిన్నప్పటి నుండి ఇంజెక్షన్ అంటే భయమని వెల్లడి.
  • దేశముదురు సినిమాతో 16 ఏళ్లకే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన హన్సిక మోత్వాని.
  • హన్సిక ఎదుగుదలపై వచ్చిన రూమర్స్‌ను ఖండించిన నటి, ఇది పూర్తిగా అవాస్తవం అని తెలిపింది.
  • 50 సినిమాలకు పైగా చేసిన హన్సిక, విడాకుల తర్వాత మళ్లీ వార్తల్లో నిలిచింది.

హన్సిక మోత్వాని గురించి ఒక సంచలన వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది! దేశముదురు సినిమాతో తన కెరీర్ ప్రారంభించిన హన్సిక, తన ఎదుగుదల గురించి వస్తున్న రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాలేంటో చూద్దాం!

చిన్న వయసులోనే హీరోయిన్.. రూమర్స్ షురూ!

Hansika Motwanni : దేశముదురు సినిమాతో 16 ఏళ్లకే హీరోయిన్ అయింది హన్సిక. అంత చిన్న వయసులోనే హీరోయిన్ అవ్వడం, తన స్క్రీన్ ప్రజెన్స్ అందర్నీ ఆశ్చర్యపోయింది. ఆ సినిమాలో తనని చూసిన తర్వాత ఆమె ఎదుగుదలపై కొన్ని రూమర్స్ వచ్చాయి. హన్సిక త్వరగా ఎదగడానికి హార్మోన్స్ ఇంజెక్షన్స్ వాడిందని, తన తల్లే ఆ ఇంజెక్షన్స్ ఇప్పించింది రూమర్లు కూడా వచ్చాయి.

అందుకే హన్సిక 16 ఏళ్లకే అలా కనిపిస్తుందని, హీరోయిన్ అవ్వడం కోసమే ఇంజెక్షన్స్ వాడి ఇలా తయారయిందని అప్పట్లో పెద్ద వివాదమే నడిచింది. ఇన్నేళ్ల తర్వాత హన్సిక దీనిపై స్పందించింది.

ఇంజెక్షన్స్ అంటే భయం.. హన్సిక క్లారిటీ!

దేశముదురు నుంచి ఆల్మోస్ట్ 50 సినిమాలకు పైగా చేసిన హన్సిక ఇప్పుడు కూడా అడపాదడపా సినిమాలు చేస్తుంది. ఇటీవలే విడాకులు తీసుకొని వార్తల్లో నిలిచింది. తాజాగా బాలీవుడ్ లో పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వగా హన్సిక ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ పై స్పందించింది.

అమ్మ పేరు వాడారు.. అసలు నిజం చెప్పిన హన్సిక!

హన్సిక మాట్లాడుతూ.. మీడియా అటెన్షన్ కోసం లేని విషయాలను చాలా సార్లు సృష్టిస్తారు. అసలు నాకు ఇంజెక్షన్స్ అంటే చిన్నప్పటి నుంచి భయం. ఇప్పటికి కూడా హెల్త్ బాగోకపోతే ఇంజెక్షన్స్ వేయించుకుంటే ఏడుస్తాను. అలాంటిది నేను గ్రోతింగ్ హార్మోన్స్ తీసుకున్నానని చెప్పడం పూర్తిగా అబద్ధం. ఫేస్ కి కూడా బొటాక్స్ ఇంజెక్షన్స్ చేయించుకున్నాను అన్నారు అది కూడా అవాస్తవం. మా అమ్మపేరుని కూడా వాడారు. అసలు మా అమ్మని నా స్కిన్ టచ్ చేయనివ్వను. నేను సహజంగానే పెరిగాను. నా కష్టం, నటనతోనే అవకాశాలు తెచ్చుకున్నాను అని తెలిపింది. ఇన్నేళ్ళుగా వస్తున్న ఇలాంటి రూమర్స్ కి హన్సిక తాజాగా సమాధానమిచ్చింది.

హన్సిక తనపై వచ్చిన రూమర్స్‌కు గట్టిగా సమాధానం ఇచ్చింది. మరిన్ని టాలీవుడ్ అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి. మీ కోసం ఎప్పటికప్పుడు సరికొత్త సమాచారం అందిస్తూనే ఉంటాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.