|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కన్నప్పను అభినందిస్తుంటే ఆనందంగా ఉంది

Published: 28-06-2025, 8:44 PM
కన్నప్పను అభినందిస్తుంటే ఆనందంగా ఉంది

‘కన్నప్ప’ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతుండటంపై మంచు మోహన్ బాబు, విష్ణు మంచు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అభిమానుల ప్రేమకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

Key Points

1

మంచు మోహన్ బాబు 'కన్నప్ప' సక్సెస్‌కు ఆనందం వ్యక్తం చేశారు.

2

విష్ణు మంచు, దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ కూడా సినిమా విజయంపై ఆనందం వ్యక్తం చేశారు.

4

ప్రేక్షకుల ప్రేమకు నిర్మాతలు, నటులు కృతజ్ఞతలు తెలిపారు.

‘కన్నప్ప’ విజయోత్సవం

‘‘నటుడిగా 50 ఏళ్ల ప్రయాణం నాది. అప్పట్నుంచి ఇప్పటివరకు నా అభిమానులు నా వెన్నంటే ఉండి ముందుకు నడిపిస్తున్నారు. ‘కన్నప్ప’ సక్సెస్‌ తర్వాత వాళ్లంతా ఫోన్లు చేసి అభినందనలు తెలియజేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. వారి ప్రేమకు నేను తిరిగి ఏమి ఇవ్వగలను… వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అని నటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబు తెలిపారు.

విష్ణు మంచు హీరోగా ముఖేష్‌కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘కన్నప్ప’. అవా ఎంటర్‌టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌బాబు నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది.

నటుల, నిర్మాతల అభిప్రాయాలు

ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన థ్యాంక్స్‌ మీట్‌లో మోహన్‌బాబు మాట్లాడుతూ– ‘‘కన్నప్ప’ కోసం యూనిట్‌ అంతాప్రాణం పెట్టి పని చేశాం. భగవంతుడి ఆశీస్సులతోనే ‘కన్నప్ప’ చిత్రానికి ఇంత గొప్ప విజయం దక్కింది. మాకు ఇంత హిట్‌ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు. విష్ణు మంచు మాట్లాడుతూ– ‘‘మాలాంటి నటీనటులకు ప్రేక్షకులే దేవుళ్లు. వారి ఆదరణ, ప్రేమతోనే మేం ఈ స్థాయికి వస్తాం.

ప్రేక్షకులకు కృతజ్ఞతలు

‘కన్నప్ప’కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఇదంతా శివలీల. ‘కన్నప్ప’ను ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అని చెప్పారు. ముఖేష్‌కుమార్‌ సింగ్‌ మాట్లాడుతూ– ‘‘మోహన్‌బాబు, విష్ణుగార్లు పదేళ్లుగా ‘కన్నప్ప’ కోసం కష్టపడుతూ వచ్చారు. మా సినిమా మీద అందరూ ప్రేమను కురిపిస్తుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘కన్నప్ప’ చిత్రం ఎగ్జిక్యూటివ్‌ ్ర΄÷డ్యూసర్‌ వినయ్‌ మహేశ్వరి, మైత్రి డిస్ట్రిబ్యూటర్‌ శశి, నటులు శివ బాలాజీ, కౌశల్, అర్పిత్‌ రంకా మాట్లాడారు.

చివరగా, ‘కన్నప్ప’ చిత్ర యూనిట్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసింది. సినిమా విజయం వెనుక వారి కృషి, ప్రేక్షకుల ఆదరణ స్పష్టంగా కనిపిస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.