|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హరీష్ శంకర్ కథ ముగిసిందా? టాలీవుడ్‌లో అవకాశాలు ప్రశ్నార్థకమేనా?

Published: 01-04-2026, 11:05 AM
హరీష్ శంకర్ కథ ముగిసిందా? టాలీవుడ్‌లో అవకాశాలు ప్రశ్నార్థకమేనా?
  • హరీష్ శంకర్ దర్శకత్వంలో పస లేదని ‘మిస్టర్ బచ్చన్’ సినిమా నిరూపించింది.
  • పవన్ కళ్యాణ్ ఇచ్చిన అవకాశాన్ని హరీష్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
  • ట్రెండ్‌కు తగ్గ కథతో పవన్ ఇమేజ్‌ను ఎలివేట్ చేయడంలో హరీష్ విఫలమయ్యారు.
  • హరీష్‌కు టాప్ స్టార్ హీరోలు ఛాన్స్ ఇస్తారా అనే ప్రశ్న ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

దర్శకుడు హరీష్ శంకర్ వరుస పరాజయాల తర్వాత ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు. ఆయన దర్శకత్వం వహించిన గత సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో ఆయన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

హరీష్ శంకర్ ఫ్లాప్స్ వెనుక కారణాలేంటి?

Harish Shankar: ”నాక్కొంచెం తిక్కుంది..కాని దానికో లెక్కుంది”అంటాడు ‘గబ్బర్ సింగ్’లో పవన్ కళ్యాణ్. సరిగ్గా ఇది హరీష్ శంకర్ క్యారెక్టర్ నుండే ఈ పుట్టిందన్నది ఆయన స్పీచులు చూసేవాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. కానీ ఇప్పటి హరీష్ శంకర్ ని చూస్తుంటే తిక్కుంది కాని దానికి ఏ లెక్కే లేదనిపిస్తుంది. అవును..ఉస్తాద్ అంటూ ఏళ్ల క్రితమే అవుట్ డేటెడ్ అయిన కథతో ఇప్పుడు కూడా గబ్బర్ సింగ్ లాంటి మ్యాజిక్ రిపీట్ చేస్తున్నానన్న కాన్ఫిడెన్స్ ఉండాలంటే ఎంత తిక్కుండాలి.

హరీష్ మేకింగ్‌లో పస లేదని నిరూపించిన  సినిమా

‘వాస్తవానికి హరీష్ శంకర్ లెక్క తప్పింది మిస్టర్ బచ్చన్ తోనే.ధబాంగ్ ని గబ్బర్ సింగ్ అంటూ సాలిడ్ రీమేక్ గా తీసి కలెక్షన్ల వర్షం కురిపించడంతో రీమేక్ మాస్టర్ అన్న స్టాంప్ వేసుకున్న ఈయన గారు జిగర్తాండా ని గద్దల కొండ గణేష్ గా సూపర్ హిట్ కొట్టడంతో రీమేక్ లో కింగ్ అన్న ముద్రేసుకున్నాడు. ఇంకేం అదే ఊపులో హిందీ రైడ్ ని మిస్టర్ బచ్చన్ అంటూ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడటంతో రీమేక్ రాజాగా మిగిలిపోయాడు.హరీష్ మేకింగ్‌లో పస లేదని నిరూపించింది ఈ సినిమా.

సక్సెస్ ట్రాక్ ఎక్కేస్తానని ఆశపడ్డ హరీష్

అయితే పవన్ ఉస్తాద్ అప్పటికే లైనప్ అవడంతో ఇక ఈ సినిమా తోనైనా మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కేస్తానని ఆశపడ్డాడు హరీష్.కానీ పవన్ కళ్యాణ్ ఇచ్చిన గోల్డెన్ ఛాన్స్ ని చేజేతులా నాశనం చేసుకుని మరో సాలిడ్ డిజాస్టర్ ని డెలివర్ చేశాడని రిలీజ్ అయితే కాని తెలీలేదు.ముఖ్యంగా ట్రెండ్ కి తగ్గ స్టోరీతో పవన్ ఇమేజ్‌ను ఎలివేట్ చేయడంలో హరీష్ పూర్తిగా ప్లాప్ అయ్యాడనే చెప్పాలి.ఓజీ లాంటి సాలిడ్ హిట్ తర్వాత వస్తుండటం ,’గబ్బర్ సింగ్’ కాంబో కావడంతో మళ్ళీ మ్యాజిక్ జరగాలని గట్టిగా కోరుకున్న ఫ్యాన్స్ కి పెద్ద హ్యాండే ఇచ్చాడు .పవన్ వంటి పవర్ హౌస్ దొరికినా, సరైన కంటెంట్ డెలివర్ చేయలేదన్న బాధ ఇప్పటికీ హరీష్ ని హంట్ చేస్తుందనడంలో డౌటే లేదు.

పవన్ కళ్యాణ్ ఛాన్స్ మిస్ చేసుకున్నారా?

కనీసం దరిదాపుల్లోకి కూడా రానివ్వడం లేదా ?

అయితే ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ రెండు వరుస డిజాస్టర్స్ ఇచ్చిన హరీష్ నెక్స్ట్ ఎవరితో సినిమా ఉండబోతుందని ,అసలు ఈయన్ని నమ్మి ఛాన్స్ ఇచ్చే ఆ హీరోలేవరన్న క్యూరియాసిటీ ఇండస్ట్రీలో కాస్త ఎక్కువే కనిపిస్తుంది.అయితే ప్రస్తుతం టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన రామ్ చరణ్,మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ వంటి వాళ్ళ థాట్ ప్రాసెస్ అంతా పాన్ ఇండియా రేంజ్‌లో ఉంది.వాళ్ళకి కావాల్సింది గ్లోబల్ స్టాండర్డ్స్ స్టోరీస్.ఎందుకంటే వరల్డ్ సినిమా అరచేతిలోకి వచ్చేసిన ఈ రోజులివి.కానీ హరీష్ దగ్గర ఉన్నవి అవే మూస ఫార్ములాలు. ఇంకా పాత చింతకాయ పచ్చడి లాంటి కథలు, ప్రాస కోసం ప్రాణాలు తీసే డైలాగులు, హీరో ఎలివేషన్లే అదిరిపోయిన సీన్లు అంటూ అవుట్ డేటెడ్ అయిపోయిన సినిమాలు తీస్తానంటే ఏ హీరో మాత్రం ఛాన్స్ ఇస్తాడు?అందుకే మహేష్, చరణ్, ఎన్టీఆర్: వీరంతా హరీష్‌ను కనీసం దరిదాపుల్లోకి కూడా రానివ్వడం లేదట . ఇక టైర్-2 హీరోలైన నాని, సిద్ధు జొన్నలగడ్డ వంటి వారు కూడా హరీష్ పేరు వింటేనే ఆమడ దూరం పారిపోతున్నారని ఇన్ సైడ్ టాక్.

కెరీర్లో  రెండే సాలిడ్ హిట్స్

ఒకసారి హరీష్ కెరీర్ గమనిస్తే కనిపించే సాలిడ్ హిట్స్ రెండే. మిగతావన్నీ మేనేజ్ చేసినవే!అవును ..’మిరపకాయ్’, ‘గబ్బర్ సింగ్’ తప్ప మరే సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ అనిపించుకోని పరిస్థితి.దువ్వాడ జగన్నాథం అల్లు అర్జున్ క్రేజ్ వల్ల టాక్ తెచ్చుకుంటే గద్దలకొండ గణేష్ వరుణ్ తేజ్ మేకోవర్ వల్ల గట్టెక్కింది,ఇక సుబ్రమణ్యం ఫర్ సేల్ మెగా ట్యాగ్ వల్ల సేల్ అయింది తప్ప దర్శకుడిగా హరీష్ సొంతంగా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏం లేదనే చెప్పాలి..ఒకరకంగా ట్రెండ్ మారుతున్నా తన మేకింగ్ స్టైల్ మార్చుకోకపోవడమే హరీష్‌కు పెద్ద మైనస్ అయ్యింది.

హరీష్‌కు భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయా?

టాలీవుడ్‌లో అతిపెద్ద మిస్టరీ

చూస్తుంటే ప్రస్తుతం ఇండస్ట్రీలోకి వస్తున్న కొత్త డైరెక్టర్స్ ఫుల్ టెక్నికల్‌ సౌండ్ అండ్ చాలా అడ్వాన్స్‌డ్‌గా దూసుకొచ్చేస్తున్నారు.వారితో పోటీ పడాలంటే హరీష్ కూడా కొత్త కథలపై కాన్ సన్ ట్రేట్ చేయకతప్పదు.కానీ హరీష్ శంకర్ మాటల మీద ఉన్న శ్రద్ధ కథల మీద పెట్టడం లేదని ఏకిపారేస్తున్నారు నెటిజన్లు.మొత్తానికి హరీష్ నెక్స్ట్ చేయబోయేది ఎవరనేది టాలీవుడ్‌లో అతిపెద్ద మిస్టరీ.

కాలం చెల్లిన ఫార్ములా కథలతో అక్కడే ఆగిపోతాడా

ఇక నెట్టింట కూడా హరీష్ శంకర్ మీద వస్తున్న కామెంట్స్ మాములుగా పేలట్లేదు.’డైలాగులతో కడుపు నిండదు హరీష్ గారూ.. కథలో దమ్ముండాలి!అని ఒకరంటే “పవన్ కళ్యాణ్ క్రేజ్‌ను వేస్ట్ చేయడంలో హరీష్‌కు ఆస్కార్ ఇవ్వొచ్చు అంటూ మరొకరు.ఏది ఏమైనా గబ్బర్ సింగ్ తో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన హరీష్ శంకర్.. ఇప్పుడు తన ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి, మరి ఇప్పటికైనా అప్ డేట్ అయ్యి బౌన్స్ బ్యాక్ అవుతాడా ..లేక అదే కాలం చెల్లిన ఫార్ములా కథలతో అక్కడే ఆగిపోతాడా ..కాలమే డిసైడ్ చేయాలి !

మొత్తానికి హరీష్ శంకర్ కెరీర్ ప్రస్తుతం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆయన తిరిగి ఫామ్ లోకి వచ్చి విజయాలు సాధిస్తాడా లేదా వేచి చూడాలి. స్టార్ హీరోలు ఆయనకు అవకాశం ఇస్తారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.