|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వార్: హరీష్ శంకరా? సుజీత్ దేవుడా? మెగా అభిమానుల మధ్య డైలమా!

Published: 16-03-2026, 3:05 PM
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వార్: హరీష్ శంకరా? సుజీత్ దేవుడా? మెగా అభిమానుల మధ్య డైలమా!
  • హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’తో పవన్ కళ్యాణ్ కెరీర్‌కు ఊపునిచ్చారు.
  • సుజీత్ ‘ఓజీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్‌ను సరికొత్తగా చూపించారు.
  • పవన్ కళ్యాణ్ నార్మల్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు సాధారణంగానే వస్తారు.
  • సుజీత్.. పవన్ కళ్యాణ్ చేత ‘జానీ’ గన్ పట్టించి సక్సెస్ మీట్‌కు తీసుకువచ్చారు.

దర్శకుడు హరీష్ శంకర్, సుజీత్ ఇద్దరూ పవన్ కళ్యాణ్ అభిమానులే. అయితే, ఎవరు గొప్ప అనే చర్చ మెగా ఫ్యాన్స్ మధ్య మొదలైంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్ సాధారణంగా రావడంతో ఈ చర్చ ఊపందుకుంది.

హరీష్ శంకర్ సక్సెస్ వెనుక కథ

Harish and Sujeeth: దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) గొప్పా, లేదంటే సుజీత్ (Sujeeth) గొప్పా? అంటే దర్శకులిగా ఇద్దరూ గొప్పే. కానీ, ఇప్పుడు మెగా ఫ్యాన్స్ మాత్రం దర్శకుడు సుజీత్ గొప్పని అంటున్నారు. ఎందుకలా అంటున్నారని అనుకుంటున్నారు కదా? ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేసి, సుజీత్ అనే పేరు కొడితే మీకే అర్థమవుతుంది. సుజీత్ దర్శకుడు కాకముందే, దర్శకుడు హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. అప్పటి వరకు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వరుస ప్లాప్స్‌లో ఉన్నారు. ‘గబ్బర్ సింగ్‌’ (Gabbar Singh)తో ఒక్కసారిగా రికార్డులు బద్దలు కొట్టి, పవర్ స్టార్‌కు ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు హరీష్ శంకర్. సేమ్ టు సేమ్ సుజీత్ కూడా. వీరిద్దరూ (Harish and Sujeeth) పవన్ కళ్యాణ్ భక్తులే. ఎంత భక్తులంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టాప్ 5లో ఉండే అభిమానుల్లో వీరిద్దరూ ఉంటారు. అంత ఇష్టం వాళ్లకి. ఆ విషయం అందరికీ తెలుసు కూడా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు కూడా ఈ విషయం తెలుసు.

సుజీత్ చేసిన మ్యాజిక్ ఏమిటి?

మరి ఎవరు గొప్ప? అనే డౌట్ ఇప్పుడెందుకు వచ్చిందని అనుకుంటున్నారా? ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) ప్రీ రిలీజ్ వేడుకకు పవన్ కళ్యాణ్ నార్మల్‌గా వైట్ డ్రస్‌లో వచ్చారు. ఇదే, అసలు విషయం. ఆయన అంత నార్మల్‌గా రావడమే.. ఫ్యాన్స్‌కు ఈ డౌట్ రావడానికి కారణం. ‘ఓజీ’ ప్రీ రిలీజ్ వేడుకకు పవన్ కళ్యాణ్ ఎలా వచ్చారో తెలుసు కదా. ఆరోజు జోరున వర్షం, అసలు ప్రీ రిలీజ్ వేడుక అనుకున్న విధంగా కూడా జరగలేదు. కానీ, ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ సినిమా ప్రీ రిలీజ్‌ల కంటే గొప్పగా ఆరోజు ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు. అదెలా అంటే, నార్మల్‌గా పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ వేడుకలకు సినిమా గెటప్‌లలో రారు. ఆయన చాలా నార్మల్‌గా వస్తారు. అలాంటిది, పవన్ కళ్యాణ్‌తో ‘ఓజీ’ (OG Movie) గెటప్ వేయించి, కటానా పట్టించి మరీ ప్రీ రిలీజ్ వేడుకకు తీసుకొచ్చారు సుజీత్.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు?

అంతేనా, సినిమా సక్సెస్ తర్వాత జరిగిన సక్సెస్ మీట్‌కు ‘జానీ’ గన్ పట్టుకుని మరీ వచ్చారు. పవన్ కళ్యాణ్ నేచర్‌కి ఇవన్నీ చేయడమంటే అది చాలా గొప్ప విషయమనే చెప్పుకోవాలి. అలాంటిది సుజీత్ చేయించాడు. కానీ, ‘ఉస్తాద్’ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్ చాలా సింపుల్‌గా వచ్చారు. అందుకే ఈ విషయంలో సుజీత్ గొప్పంటూ ఫ్యాన్స్ ‘ఓజీ’ అప్పటి వీడియోలను వైరల్ చేస్తున్నారు. అయితే ఇక్కడ వారంతా ఒకటి గమనించాలి. స్టేజ్‌పైన హరీష్ అలా చేయించలేకపోయాడేమో కానీ, సినిమాలో మాత్రం పవర్ స్టార్‌తో డ్యాన్సులు వేయించాడు. అది మరిచిపోతే ఎలా? అసలు ‘గబ్బర్ సింగ్’ సినిమా టైమ్‌లో సుజీత్ ఒక సామాన్య ప్రేక్షకుడిలా రెడ్ టవల్ కట్టుకుని వచ్చిన సంగతి మరిచిపోయారా? అని ఫ్యాన్స్‌లో వాళ్లకి వాళ్లే సమాధానమిచ్చుకుంటున్నారు. ‘గబ్బర్ సింగ్’ సినిమాను సుజీత్ ఎంజాయ్ చేస్తే.. ‘ఓజీ’ సినిమాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరి కంటే నేను బాగా ఎంజాయ్ చేశానని డైరెక్ట్‌గా హరీష్ శంకరే చెప్పారు. కాబట్టి.. ఇద్దరూ గొప్పే. ఇద్దరూ పవన్ కళ్యాణ్ భక్తులే.. అది మ్యాటర్.

‘ఓజీ’ ప్రీ రిలీజ్ వేడుకలో సుజీత్ పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా చూపించడంతో, అభిమానులు సుజీత్ గొప్ప అని భావిస్తున్నారు. మొత్తానికి ఇద్దరు దర్శకులు పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.