
టాలీవుడ్ నటి హెబ్బా పటేల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో నటుడు నవీన్ నేనికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఒక ఫోటోను షేర్ చేయడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ‘కుమారి 21F’ సినిమా గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు.
Key Points
హెబ్బా పటేల్ నవీన్ నేనికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
హెబ్బా పటేల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో షేర్ చేసింది.
నవీన్ నేనితో హెబ్బా పటేల్ యొక్క 'కుమారి 21F' సినిమాను గుర్తుచేసుకుంటున్నారు.
హెబ్బా పటేల్ యొక్క సోషల్ మీడియా పోస్ట్
‘కుమారి 21 ఎఫ్’ (Kumari 21F)సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ హెబ్బా పటేల్(Hebah Patel) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే ఈ భామకు ఫుల్ పాపులారిటీ వచ్చేసింది. అలాగే తన అందం, అభినయంతో కుర్రాళ్ల క్రష్ అయిపోయింది. దీంతో ఈ భామ గ్రాఫ్ ఒక్కసారిగా చేంజ్ అయి అమాంతం స్టార్ హీరోయిన్ రేంజ్‌లోకి వెళ్లిపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ అనుకున్నంత స్టార్ డమ్ అయితే రాలేదు. ఆఫర్లు వచ్చినా స్టార్ హీరోయిన్‌గా మాత్రం రాణించలేకపోయింది.
నవీన్ నేనికి జన్మదిన శుభాకాంక్షలు
ఇక రీసెంట్‌గా ఓదెల-2 మూవీతో మనముందుకు వచ్చిన ఈ అమ్మడు.. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా అడపాదడపా సినిమాల్లో నటిస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది. కానీ నిత్యం సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోలతో పాటు వ్యక్తిగత విషయాలు, సినిమా విశేషాలను పంచుకుంటూ ఫ్యాన్స్‌కు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
నెటిజన్ల ప్రతిస్పందన
తాజాగా హెబ్బా తన ఇన్‌స్టాలో ఓ స్టోరీ పెట్టింది. అందులో యాక్టర్ నవీన్ నేని ఫొటో షేర్ చేస్తూ బిలేటెడ్ హ్యాపీ బర్త్‌డే హీరో అని రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు ఫస్ట్ సినిమాలో నటించిన అతన్ని గుర్తు పెట్టుకుని విష్ చేసిందా అని షాక్ అవుతున్నారు. ఇంకొంత మంది మాత్రం అతనికి విష్ చేస్తున్నారు.
హెబ్బా పటేల్ యొక్క ఈ అనూహ్యమైన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. నవీన్ నేనితో ఆమె పాత సినిమాను గుర్తు చేసుకున్నట్లు కనిపిస్తోంది.


