|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చంద్రహాస్ పాట దుమారం! దేవుళ్ళను కించపరిచేలా ఉందంటూ కేసు నమోదు!

Published: 04-02-2026, 9:05 PM
చంద్రహాస్ పాట దుమారం! దేవుళ్ళను కించపరిచేలా ఉందంటూ కేసు నమోదు!
  • హీరో చంద్రహాస్ చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’లోని పాట వివాదంలో చిక్కుకుంది.
  • శివుడిని కించపరిచేలా పాట ఉందని పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.
  • పాటను సోషల్ మీడియా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
  • పోలీసులు స్పందించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

హీరో చంద్రహాస్ నటిస్తున్న ‘బరాబర్ ప్రేమిస్తా’ చిత్రం విడుదల కానుంది. అయితే, ఈ సినిమాలోని ఓ పాట వివాదాస్పదంగా మారింది. పాటలో హిందూ దేవుళ్ళను కించపరిచేలా పదాలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి.

వివాదానికి కారణమైన చంద్రహాస్ పాట

Hero Chandrahas: తెలుగు సినీ నటుడు ఈటీవీ ప్రభాకర్ తనయుడు, హీరో చంద్రహాస్ నటిస్తున్న తాజా చిత్రం “బరాబర్ ప్రేమిస్తా”.. ఈ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది.. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బూతు పాటలో ఒక్కసారిగా టాలీవుడ్‌లో చర్చకు తెరతీశాడు. ఆ పాట ఇప్పుడు వివాదానికి దారితీసింది. పాటలో హిందూ దేవుళ్లను, ముఖ్యంగా శివుడిని కించపరిచేలా పదజాలం ఉందంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ పాట చిత్రీకరణ మరియు సాహిత్యం ఉన్నాయని ఆరోపిస్తూ కొంతమంది వ్యక్తులు పోలీసులను ఆశ్రయించారు. పాట పాడిన నటుడు, అలాగే చిత్రయూనిట్ పై చర్యలు తీసుకోవాలని, వివాదాస్పదంగా ఉన్న ఆ పాటను వెంటనే సోషల్ మీడియా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.. ఈ కేసు పై స్పందించిన పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకుంటామని వెల్లడించారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ పాటపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

దేవుళ్ళను కించపరిచేలా సాహిత్యం?

పోలీసులకు ఫిర్యాదు, చర్యలకు డిమాండ్

ఈ వివాదంపై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి. పాటలోని అభ్యంతరకర పదాలను తొలగిస్తారా లేదా అనే దానిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.