|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పెళ్లిపై రామ్ సంచలన వ్యాఖ్యలు! ఏం చెప్పాడో తెలుసా?

Published: 13-04-2026, 7:45 AM
పెళ్లిపై రామ్ సంచలన వ్యాఖ్యలు! ఏం చెప్పాడో తెలుసా?
  • హీరో రామ్ పోతినేని పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
  • ఒంటరిగా ఉండటమే తనకిష్టమని, చిన్నప్పటినుంచే అలవాటైందని రామ్ అన్నారు.
  • భవిష్యత్తులో ఎవరైనా వస్తే వారితో సమయం పంచుకుంటానని, లేకపోతే ఒంటరిగానే సంతోషంగా ఉంటానన్నారు.
  • దేవదాసు సినిమాతో రామ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు.

యంగ్ హీరో రామ్ పోతినేని పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఒంటరిగా ఉండటమే ఇష్టమని, ఒకవేళ ఎవరైనా వస్తే వారితో కలిసి ఉంటానని లేకపోతే ఒంటరిగానే సంతోషంగా ఉంటానని తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

రామ్ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Pothineni: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అనగానే ముందుగా సల్మాన్ ఖాన్, ప్రభాస్, తరుణ్ లాంటి హీరోలు గుర్తుకొస్తారు.. అయితే ఈ జాబితాలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం సినిమాలు చేస్తూ కెరియర్ కొనసాగిస్తున్నారు కానీ అసలు వ్యక్తిగతంగా ఎప్పుడు పెళ్లి ప్రకటన చేస్తారు అని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన భాగ్యశ్రీ బోర్సేతో రిలేషన్ లో ఉన్నారని.. గత కొంతకాలంగా వార్తలు వినిపించాయి. పైగా ఈ సినిమా ప్రమోషన్ సమయంలో కూడా ఇండైరెక్ట్ గానే ఈ జంట హింట్ ఇచ్చింది. అయితే ఇప్పుడు సడన్గా పెళ్లి పై రామ్ అలాంటి వ్యాఖ్యలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు..

గత కొంతకాలంగా రామ్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో తాజాగా రామ్ తన పెళ్లి, సింగిల్ స్టేటస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ “నాకు ఏకాంతంగా ఉండడం ఎంతో ఇష్టం. ముఖ్యంగా చిన్నప్పటినుంచే ఇది బాగా అలవాటైన విషయం. ఖాళీ సమయం దొరికితే చాలు నా కోసం నేను సమయాన్ని కేటాయించుకోవడంలోనే ఎక్కువ ప్రశాంతతను వెతుక్కుంటాను. ఇది నేను తీసుకున్న నిర్ణయం కాదు.. నా సహజ సిద్ధమైన వ్యక్తిత్వం.. సినిమా షూటింగ్ సమయంలో వందలాది మధ్య ఉన్నప్పటికీ నాకంటూ ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని నేను నిర్మించుకున్నాను. ఇక కరోనా సమయంలో ఏడాదిన్నర పాటు ఒంటరిగా గడిపాను. భవిష్యత్తులో నా జీవితంలోకి ఎవరైనా వస్తే వారితో సమయం పంచుకోవడానికి కూడా నేను సిద్ధమే. ఒకవేళ ఎవరూ రాకపోయినా ఒంటరిగానే మరింత సంతోషంగా ఉంటాను” అంటూ తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. తన ఒంటరితనాన్ని బలహీనంగా కాకుండా ఒక ఆనందకరమైన అనుభూతిగా చూడడం విశేషం. ఏది ఏమైనా రామ్ తన పెళ్లిపై ఇలాంటి కామెంట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. మరి రామ్ జీవితంలోకి వచ్చే ఆ అమ్మాయి ఎవరో తెలియాలి అంటే కాలమే నిర్ణయించాలి

ఒంటరితనంపై రామ్ అభిప్రాయం

రామ్ సినీ కెరీర్ గురించి సంగ్రహంగా

రామ్ సినిమాల విషయానికి వస్తే..స్రవంతి రవి కిషోర్ వారసుడిగా దేవదాసు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రామ్.. మొదటి సినిమాతోనే ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్నారు. మొదటి సినిమాతోనే ఉత్తమ నటుడిగా దక్షిణాది విభాగంలో ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత రెడీ, మస్కా, కందిరీగ, పండగ చేస్కో, హలో గురు ప్రేమకోసమే, నేను శైలజ వంటి చిత్రాలతో పరవాలేదనిపించుకున్న ఈయన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మరో బ్లాక్బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు..ఆ తర్వాత పలు చిత్రాలు చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ చివరిగా ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో ఉపేంద్ర అభిమానిగా ప్రేక్షకులను పలకరించాడు. ఇక ఇప్పుడు లోకేష్ కనకరాజు అసిస్టెంట్ డైరెక్టర్ తో ఒక సినిమా చేయడానికి సిద్ధం అయిపోయారు..

రామ్ తన పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆయన జీవితంలోకి ఎవరు వస్తారో వేచి చూడాలి. ఆయన కెరీర్ పరంగా మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.