
‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా నుంచి విడుదలైన ‘నువ్వుంటే చాలే’ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హీరో పోతినేని రామ్ స్వయంగా రాసిన ఈ పాటకు అనిరుధ్ రవిచందర్ స్వరాలు అందించారు.
Key Points
హీరో రామ్ రాసిన ‘నువ్వుంటే చాలే’ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.
అనిరుధ్ రవిచందర్ ఆలపించిన ఈ మెలోడీ పాట అందరినీ ఆకట్టుకుంటోంది.
‘ఆంధ్ర కింగ్ తాలూకా’ మూవీ నుండి విడుదలైన ఈ పాట లిరిక్స్ ఇక్కడ చూడండి.
పోతినేని రామ్ తన మొదటి సారిగా లిరిక్స్ రచయితగా మెప్పించాడు.
‘నువ్వుంటే చాలే’ సాంగ్ లిరిక్స్
నువ్వుంటే చాలే.. ఇప్పుడు యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పాట ఇది. ఈ లవ్ మెలోడీ సాంగ్ ఇంటర్నెట్ ను ఊపేస్తోంది. పోతినేని రామ్ హీరోగా యాక్ట్ చేస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ మూవీ నుంచి రిలీజైన ఈ సాంగ్ ఒక్క రోజులోనే తెగ హల్ చల్ చేస్తోంది. యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతోంది. ఈ సాంగ్ లిరిక్స్ ఇక్కడ చూసేయండి.
ఆంధ్ర కింగ్ తాలూకా నుంచి శుక్రవారం (జులై 18) రిలీజైన ‘నువ్వుంటే చాలే’ సాంగ్ అదరగొడుతోంది. ఈ పాటను స్వయంగా హీరో పోతినేని రామ్ రాయడం విశేషం. లిరిసిస్ట్ గా రామ్ డెబ్యూ చేశాడు. అతను రాసిన పదాలు మనసులను హత్తుకుంటున్నాయి. ఈ సాహిత్యానికి అనిరుధ్ రవిచందర్ మ్యాజిక్ వాయిస్ తోడవడంతో పాట్ మరో లెవెల్ కు వెళ్లిపోయింది.
మహేష్ బాబు.పి డైరెక్షన్ లో వస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో పోతినేని రామ్, భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవి శంకర్ నిర్మిస్తున్నారు. వివేక్, మెర్విన్ డ్యుయో మ్యూజిక్ అందిస్తున్నారు.
నువ్వుంటే చాలే సాంగ్ లిరిక్స్
ఒక చూపుతో నాలోనే పుట్టిందే…
ఏదో వింతగా గుండెలో చేరిందే…
నువ్వెవ్వరు నాలో అని అడిగానే…
తానేగా ప్రేమని తెలిపిందే…
పరిచయం లేదని అడిగా ప్రేమంటే..
కలిసామ్ గా ఇకపై మనమేగా అందే
రామ్ రాసిన లవ్ మెలోడీ
వెతికిన దొరకని అర్థం ప్రేమదే
అది నీకేంటో ఒక మాటలో చెప్పాలే..
మాటలతో చెప్పమంటే చెప్పలేనే
అదేమిటో కుదురుగా ఉండలేనే నువ్వు ఉంటే..
అడిగితే అదేమిటో అర్ధంకాదే
నిన్న మొన్న నాలో ఉన్నా నేనే కాదే
పుట్టిందంటే నీతో పోనే పోదే ప్రేమంతే..
నువ్వేగా దారని నాకు చూపుతుంది
కమ్ముకున్న మబ్బులో వెతికానుగా
అరె గాలి వానై నన్ను తాకుతుంది
అనిరుధ్ రవిచందర్ మ్యాజిక్
నాకే తెలియని నాలో యుద్ధమా.. లోలోన సంద్రమా..
లేదే పొంగుతున్నదే ఇంకేదో…
పేరు లేదుగా ఇంతే మాట రాదుగా
మాటలతో చెప్పమంటే చెప్పలేనే
అదేమిటో కుదురుగా ఉండలేనే నువ్వు ఉంటే
అడిగితే అదేమిటో అర్ధంకాదే
నిన్న మొన్న నాలో ఉన్నా నేనే కాదే
పుట్టిందంటే నీతో పోనే పోదే ప్రేమంతే..
ఓ.. ఓ.. ఓ.. ఓ.. (నువ్వుంటే చాలే)…
ఓ.. ఓ.. ఓ.. ఓ.. (నువ్వుంటే చాలే)…
పోతినేని రామ్ రచన, అనిరుధ్ స్వరాలు, ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చిత్రం నుండి విడుదలైన ‘నువ్వుంటే చాలే’ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉండటం విశేషం.


