|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మరోసారి వివాదంలో హీరోయిన్ డింపుల్ హయాతి

Published: 30-09-2025, 7:46 AM
మరోసారి వివాదంలో హీరోయిన్ డింపుల్ హయాతి

హీరోయిన్ డింపుల్ హయాతి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తన ఇంట్లో పని చేయడానికి ఒరిస్సా నుంచి వచ్చిన యువతులను వేధించి, జీతం ఇవ్వకుండా అవమానించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలో పార్కింగ్ వివాదంతో వార్తల్లో నిలిచిన డింపుల్, ఇప్పుడు ఈ ఘటనతో నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు.

Key Points

1

హీరోయిన్ డింపుల్ హయాతి, ఆమె భర్తపై పని మనుషుల వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి.

2

ఒరిస్సా నుంచి వచ్చిన యువతులను జీతం ఇవ్వకుండా అవమానించారని, బెదిరించారని ఆరోపణ.

4

రామబాణం తర్వాత డింపుల్ హయాతి తదుపరి చిత్రం 'భోగీ'తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

పని మనుషుల ఆరోపణలు: డింపుల్ హయాతిపై మరో వివాదం

హీరోయిన్ ‌ డింపుల్ ‌ హయాతి(Dimple Hayathi ) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు . గతంలో తన అపార్ట్ మెంట్ లో పార్కింగ్ విషయమై డీసీపీ రాహుల్ హెగ్డేతో గొడపడి కేసుల పాలైన ఈ బ్యూటీ .. మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది . ఇంట్లో పెంపుడు కుక్కలు చూసుకోడానికి పని మనుషులు కావాలని ఒరిస్సా నుంచి పిలుపించుకున్న యువతులను డింపుల్ హయతి, ఆమె భర్త వేధింపులకు గురి చేశారట. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ ‌ గా మారింది . పని చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా తన భర్తతో తిట్టించారంటూ ఆ అమ్మాయిలకు పని కుదిర్చిన ఓ మహిళ ఆరోపించింది .

నెటిజన్ల ప్రశ్నలు: ఆమెకు పెళ్లెప్పుడైంది?

‘ మీరు నా చెప్పులంత వాల్యూ చేయరు.. మీరు ఎంత? మీ బ్రతుకెంత? ’ అంటూ సదరు అమ్మాయిలతో డింపుల్ ‌ భర్త దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు . జీతం కూడా ఇవ్వకుండా ఇంట్లో నంచి వెళ్లగొట్టడమే కాకుండా .. ‘ మా ఆయన లాయర్ ‌ మీరు నన్ను ఏమీ పీకలేరు ’ అంటూ డింపుల్ ‌ హయాతి కూడా అమ్మాయిలపై ఫైర్ ‌ అయిందని ఆ మహీళ పేర్కొంది . డింపుల్ ‌ భర్త లాయర్ ‌ చేప్పడంతో .. అసలు ఆమెకు పెళ్లి ఎప్పుడు అయిందని నెటిజన్స్ ‌ ఆరా తీస్తున్నారు . అంతేకాదు అమ్మాయిల పట్ల అలా దురుసుగా ప్రవర్తించిన డింపుల్ ‌ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .

సినిమా అప్డేట్స్: ‘భోగీ’తో రాబోతున్న డింపుల్

డింపుల్ ‌ సినిమా విషయాలకొస్తే .. ‘ రామబాణం ’ లాంటి డిజాస్టర్ ‌ తర్వాత కాస్త గ్యాంప్ ‌ తీసుకున్న ఈ బ్యూటీ .. ఇప్పుడు ‘ భోగీ ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది . శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సంపత్ ‌ నంది దర్శకత్వం వహిస్తున్నాడు .

డింపుల్ హయాతిపై పని మనుషులు చేసిన ఆరోపణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆమెపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వివాదం ఒకవైపు ఉండగా, డింపుల్ తన తదుపరి చిత్రం ‘భోగీ’ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.