
📌 Key Points
- రామానాయుడుని హీరోగా చూడాలని హీరోయిన్ల కోరిక, స్వయంగా చెప్పిన శాంతకుమారి!
- రామానాయుడు గారి అందంపై హీరోయిన్ల కామెంట్స్ వైరల్, అప్పట్లో హీరోలకు పోటీ ఇచ్చేవారు!
- శాంతకుమారి మాటలతో రామానాయుడు చిన్న పాత్రల్లో నటించడం జరిగింది.
- సురేష్ బాబు నిర్మాతగా, వెంకటేష్ హీరోగా రాణిస్తుండటం విశేషం!
టాలీవుడ్ లో ఒక సంచలన వార్త! రామానాయుడు గారి గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. హీరోయిన్లు ఆయనకు లైన్ వేసారట! అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే చదవండి!
రామానాయుడుని హీరోగా చూడాలన్న హీరోయిన్లు
సినీ రంగంలో హీరోలు, హీరోయిన్లు, ఇతర నటీనటులకు మాత్రమే పాపులారిటీ ఎక్కువగా ఉంటుంది. దర్శకులు నిర్మాతలు తెరవెనుకే ఉంటారు. వారికి అంతగా గుర్తింపు ఉండదు. ఇప్పుడంటే సోషల్ మీడియా, మీడియా ద్వారా అందరి గురించి తెలుస్తోంది కానీ ఒకప్పుడు సినిమా అంటే ఆడియన్స్ చర్చించుకునేది ఎక్కువగా హీరో, హీరోయిన్ల గురించి మాత్రమే. అలాంటి టైంలో కూడా నిర్మాతగా తన ప్రత్యేకత చాటుకుని టాలీవుడ్ లో జయకేతనం ఎగురవేసిన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆయన ఎవరో కాదు మూవీ మొఘల్ రామానాయుడు.
ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోల వరకు ఎన్నో చిత్రాలు నిర్మించారు. బాలీవుడ్ లో సైతం రామానాయుడు సినిమాలు నిర్మించారు. రామానాయుడు నటుడిగా కూడా అనేక చిత్రాల్లో చిన్న చిన్న వేషాలు వేశారు. ఆ విధంగా నటనపై తనకున్న కోరిక నెరవేర్చుకున్నారు. తాను నిర్మాతగా రాణిస్తున్న బిగినింగ్ డేస్ లో ఆసక్తికర సంఘటన జరిగింది అని రామానాయుడు ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.
శాంతకుమారి మాటల్లో అసలు నిజం
రామానాయుడు నిర్మించిన అనేక చిత్రాల్లో అలనాటి నటి శాంతకుమారి నటించారు. శశిరేఖ పరిణయం, శ్రీ వెంకటేశ్వర మహత్యం లాంటి పౌరాణిక చిత్రాల్లో నటించారు. రాముడు భీముడు మూవీలో కూడా ఆమె నటించారు. ఆమె చాలా జోవియల్ గా మాట్లాడే వ్యక్తి అని రామానాయుడు అన్నారు. నాతో బాగా క్లోజ్ గా ఉంటుంది.
షూటింగ్ గ్యాప్ లో నాతో తమాషాగా మాట్లాడేవారు. ఆమె మాటలు కొన్ని సార్లు హద్దులు దాటినప్పటికీ ఆమెని ఎవరూ ఏమీ అనేవారు కాదు. ఎందుకంటే మనసులో ఎలాంటి కల్మషం ఉండదు. హీరోయిన్లు కూడా అభ్యంతరం చెప్పేవారు కాదు. నాతో ఆమె మాట్లాడుతూ.. ఒరేజ్ నువ్వు హీరోగా నటించరా.. హీరోయిన్లు అంతా నీ వంకే చూస్తున్నారు రా. వాళ్ళు నీకు సైట్ కొడుతున్నారు రా.
టాలీవుడ్ లో రామానాయుడు ప్రస్థానం
హైట్ బాగా ఉన్నావు, ఎర్రగా బుర్రగా ఉన్నావు. రామారావు తర్వాత అందంగా ఉండేది నువ్వే. నా మాట విని హీరోగా నటించు అని తరచుగా చెప్పేవారు. నేను కూడా చేస్తాను లేవే అని చెప్పేవాడిని. ఆమె బలవంతం చేయడంతో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పత్రాలు వేసేవాడిని అని రామానాయుడు తెలిపారు. మీకు నిజంగానే హీరోయిన్లు లైన్ వేశారా అని ప్రశ్నించగా.. శాంతకుమారి గారు గమనించారు అంటే నిజమే అయి ఉంటుంది అని ఫన్నీగా రామానాయుడు తెలిపారు. రామానాయుడు వారసులు సురేష్ బాబు నిర్మాతగా రాణిస్తున్నారు. మరో తనయుడు వెంకటేష్ టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్నారు.
రామానాయుడు గారి గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు విన్నారు కదా! మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. మీ అభిమాన హీరోల గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తాం.


