
నటి శ్రీలీల, శివకార్తికేయన్‌తో కలిసి ‘పరాశక్తి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమా విడుదల కాకముందే ఈ హిట్ కాంబో మరోసారి రిపీట్ కానుంది. దర్శకుడు సిబి చక్రవర్తి ప్రాజెక్ట్‌లో శ్రీలీల హీరోయిన్‌గా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి.
Key Points
శివకార్తికేయన్, శ్రీలీల జంటగా 'పరాశక్తి' చిత్రం సంక్రాంతికి రిలీజ్‌కు సిద్ధం.
సుధా కొంగర దర్శకత్వంలో వస్తున్న 'పరాశక్తి' తర్వాత మరో సినిమాకు వీరిద్దరు జతకట్టారు.
సిబి చక్రవర్తి దర్శకత్వంలోని కొత్త సినిమా షూటింగ్ డిసెంబర్ 10న చెన్నైలో ప్రారంభం.
రష్మిక మందన్న డేట్స్ కారణంగా తప్పుకోవడంతో శ్రీలీల హీరోయిన్‌గా ఫైనల్ అయ్యింది.
‘పరాశక్తి’ తర్వాత మరోసారి
శివకార్తికేయన్, శ్రీలీల జంటగా నటిస్తున్న పీరియాడికల్ డ్రామా ‘పరాశక్తి’. సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 14న రిలీజ్ కావాల్సి ఉంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అప్డేట్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోగా.. ప్రమోషనల్ కంటెంట్‌తో మరింతగా సినిమాపై పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే పనిలో ఉన్నారు చిత్ర బృందం. ఇందులో భాగంగానే వరుస అప్డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇంకా ఈ సినిమా రిలీజ్ కాకముందే.. శివకార్తికేయన్, శ్రీలీల మరోసారి జత కట్టేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు శివకార్తికేయన్ దర్శకుడు సిబి చక్రవర్తితో తన ప్రాజెక్ట్ కోసం చేతులు కలపబోతున్నట్లు తెలుస్తుంది.
అంతే కాకుండా ఈ ప్రాజెక్ట్ షూటింగ్ డిసెంబర్ 10న చెన్నై శివారు ప్రాంతాల్లో ప్రారంభమవుతుంది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా జోరుగా జరుగుతున్నాయని తెలుస్తుండగా.. ఈ సినిమాలో మొదటగా రష్మిక మందన్నను హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు. అయితే.. డేట్స్ కారణంగా రష్మిక తప్పుకోవడంతో.. ఇప్పుడు శ్రీలీల ఫైనల్ చేశారట మేకర్స్. ఇప్పటికే శ్రీలీల టీమ్‌లో జాయిన్ కాగా.. డిసెంబర్ చివరలో షెడ్యూల్ తర్వాత.. తదుపరి షెడ్యూల్ 2026 పొంగల్ తర్వాత ప్రారంభం కానుందట. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతుండగా.. ఒకేసారి రెండు సినిమాలు చేయడం విశేషంగా మారింది.
కొత్త ప్రాజెక్ట్ వివరాలు
రష్మిక స్థానంలో శ్రీలీల
శివకార్తికేయన్, శ్రీలీల జంటగా రెండు చిత్రాలలో నటించడం సినీ అభిమానులలో ఆసక్తిని రేపుతోంది. ఈ హిట్ కాంబో మరోసారి అలరించడానికి సిద్ధమవుతుండగా, వారి కెమిస్ట్రీని తెరపై చూడాలని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.


