|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హిట్ కాంబో రిపీట్.. హంటింగ్ థ్రిల్లర్‌తో రాబోతున్న ఆది

Published: 12-05-2026, 5:01 PM
హిట్ కాంబో రిపీట్.. హంటింగ్ థ్రిల్లర్‌తో రాబోతున్న ఆది

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ ఇటీవల ‘శంభాల’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. ఇప్పుడు అదే ఊపుతో, అదే సక్సెస్ ఫుల్ టీమ్‌తో ఆది తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించారు. తన కొత్త సినిమా గురించి ఆది సాయికుమార్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. “శంభాల వంటి హిట్ చిత్రాన్ని అందించిన క్రేజీ టీమ్‌తో మళ్ళీ పని చేయడం చాలా సంతోషంగా ఉంది. కానీ ఈసారి మేము పూర్తిగా భిన్నమైన, సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నాము. కొన్ని కథలు తలుపు తట్టి రావు, అవి నిశ్శబ్దంగా వికసించి మనల్ని వెంటాడుతుంటాయి. అందం, రక్తం, చీకటితో నిండిన ఒక విభిన్నమైన అనుభూతిని ఈ సినిమా ప్రేక్షకులకు అందిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు. హిట్ కాంబినేషన్లను రిపీట్ చేయడం టాలీవుడ్‌లో ఒక సెంటిమెంట్. ఆది సాయికుమార్ కూడా ‘శంభాల’ దర్శకుడు బృందారవిందర్ దర్శకత్వంలోనే తన కొత్త సినిమాను చేస్తున్నారు.

షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఒకే బ్యానర్‌లో వరుసగా రెండో సినిమా చేస్తుండటం విశేషం. అయితే ఈ చిత్రం అనౌన్స్‌మెంట్‌తో పాటు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ పోస్టర్‌లో ఆది సాయికుమార్ లుక్ చాలా కొత్తగా, భయంకరంగా ఉంది. కాగితం పూల మధ్య కూర్చుని, ఒళ్లంతా రక్తం కారుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా ఎంతో ఆగ్రహంతో ఆయన కనిపిస్తున్న తీరు సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఇది ఒక హంటింగ్ థ్రిల్లర్ (వెంటాడే కథ) అని ఈ పోస్టర్ చూస్తేనే అర్థమవుతోంది. సాధారణంగా లవ్, యాక్షన్ సినిమాలతో మెప్పించే ఆది, ఈసారి రక్తం ఏరలై పారే ఒక డార్క్ థ్రిల్లర్‌ను ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి, ‘శంభాల’తో హిట్ కొట్టిన ఈ టీమ్, ఈసారి అంతకు మించిన థ్రిల్‌ను ప్రేక్షకులకు పంచేందుకు సిద్ధమవుతోంది.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.