|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సలార్ 2 ఉంటుందా? ప్రభాస్ తో హోంబలే ఫిల్మ్స్ సంచలన నిర్ణయం! ఫ్యాన్స్ షాక్!

Published: 16-03-2026, 1:35 AM
సలార్ 2 ఉంటుందా? ప్రభాస్ తో హోంబలే ఫిల్మ్స్ సంచలన నిర్ణయం! ఫ్యాన్స్ షాక్!
  • ప్రభాస్ తో సలార్ 2 కాకుండా కొత్త సినిమా చేసే ఆలోచనలో హోంబలే ఫిల్మ్స్.
  • ప్రస్తుతం ప్రభాస్ కమిట్మెంట్స్ పూర్తయ్యాక కొత్త ప్రాజెక్టు ప్రారంభించే అవకాశం.
  • హోంబలే ఫిల్మ్స్ నిర్ణయం సలార్ అభిమానులకు నిరాశ కలిగించే అవకాశం ఉంది.
  • ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ప్రభాస్ తో సలార్ 2 తీయకుండా మరో కొత్త సినిమాను హోంబలే ఫిల్మ్స్ ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించిన కథలు, దర్శకుల ఎంపిక జరుగుతున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం సలార్ అభిమానులకు నిరాశ కలిగించే అవకాశం ఉంది.

సలార్ 2 పై హోంబలే ఫిల్మ్స్ తాజా ప్రకటన

Hombale films:కేజీఎఫ్ 1&2 చిత్రాలతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీళ్(Prashanth neel) ప్రభాస్ తో ‘సలార్ పార్ట్ 1 – సీజ్ ఫైర్ ‘ సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రభాస్ – శృతిహాసన్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాని హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రభాస్ కెరియర్ లో మంచి విజయాన్ని అందించింది. ఇక ఈ సినిమా తర్వాత ‘సలార్ పార్ట్ 2 : శౌర్యంగ పర్వం’ ఉంటుంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే అటు ప్రభాస్ తన వరుస సినిమాలతో బిజీగా ఉండడం ఇటు డైరెక్టర్ ప్రశాంత్ నీళ్ కూడా ఇతర స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఇప్పట్లో సలార్ పార్ట్ 2 ఉండదు అనే కామెంట్లు వ్యక్తం అయ్యాయి.

అయితే అభిమానులు మాత్రం సలార్ పార్ట్ 2 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో సడన్గా హోం బలే ఫిలిమ్స్ తీసుకున్న నిర్ణయం అభిమానులకు మింగుడు పడడం లేదు. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం ఆడియన్స్ ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని హోంబలే ఫిలిమ్స్ సరికొత్త ఆలోచనలు చేస్తోందట. అందులో భాగంగానే ప్రభాస్ తో సలార్ 2 చిత్రం కాకుండా మరో కొత్త సినిమా చేయడానికి కొత్త కథలు, దర్శకులను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ కి ఉన్న కమిట్మెంట్స్ అటు హోంబలే నిర్మిస్తున్న చిత్రాలు అన్ని పూర్తయిన వెంటనే ఈ కొత్త ప్రాజెక్టును ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ప్రభాస్ కొత్త సినిమాకు సన్నాహాలు

ఒకవేళ ఇదే జరిగితే మాత్రం సలార్ 2 లేనట్టే అని చెప్పవచ్చు.. ఏదిఏమైనా హోం బలే ఫిలిమ్స్ తీసుకున్న నిర్ణయం సలార్ అభిమానులకు తీరని నిరాశ మిగిలిస్తోందని చెప్పాలి . ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. మరి దీనిపై నిర్మాణ సంస్థ ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి.

సలార్ అభిమానులకు నిరాశ తప్పదా?

ప్రభాస్ విషయానికి వస్తే.. ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయారు. ఈ ఏడాది ‘ది రాజా సాబ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తన కెరీర్ లోనే తొలిసారి హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో చేసిన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ముఖ్యంగా మారుతి ప్రభాస్ ను సరిగా వాడుకోలేదు అనే కామెంట్లు కూడా వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం ప్రభాస్ సీతారామం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా చేస్తున్నారు.. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే అర్జున్ రెడ్డి , యానిమల్ వంటి చిత్రాలతో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డివంగా డైరెక్షన్లో స్పిరిట్ సినిమా చేస్తున్నారు ప్రభాస్. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అధికారిక డేట్ కూడా ప్రకటించారు. ఇక ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాత ప్రభాస్ హోం బలే కొత్త ప్రాజెక్టులో అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై పూర్తి వివరాలు అధికారికం కానున్నట్లు సమాచారం.

హోంబలే ఫిల్మ్స్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రభాస్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. సలార్ 2 వస్తుందా లేదా వేచి చూడాలి. ఒకవేళ కొత్త సినిమా వస్తే, అది ప్రభాస్ కెరీర్ కు ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.