
బిగ్ బాస్ తెలుగు 9లో తనూజకు భారీగా ఓట్లు పడుతూ టాప్ లో నిలవడానికి కారణం ఏమిటి? పీఆర్ టీమ్, షో సపోర్ట్ వంటి ఊహాగానాలను పక్కన పెడితే, ఆమె పాత సీరియల్ ‘ముద్దమందారం’ తనూజ విజయానికి అసలు కారణమని ఈ కథనం వివరిస్తుంది.
Key Points
బిగ్ బాస్ తెలుగు 9 విన్నర్‌గా తనూజ నిలుస్తుందని చాలామంది అంచనా వేస్తున్నారు.
తనూజకు పీఆర్ టీమ్ లేదా బిగ్ బాస్ సపోర్ట్ ఉందనే ప్రచారంపై స్పష్టత లేదు.
జీతెలుగు 'ముద్దమందారం' సీరియల్ (2014-2019) 1580 ఎపిసోడ్‌లతో ఆమెను పాపులర్ చేసింది.
ముద్దమందారం సీరియల్ అభిమానులైన గృహిణుల మద్దతే తనూజకు భారీ ఓట్లకు ప్రధాన కారణం.
బిగ్ బాస్ లో తనూజ ఓట్ల వెనుక నిజం
బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ లో తనూజ విన్నర్ అవుతుందని చాలామంది చెబుతున్న మాట .. అయితే , అదంతా పీఆర్ టీమ్ మాయా అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు . బిగ్ బాస్ కోసం దాదాపుగా ప్రతి కంటెస్టెంట్ పీఆర్ ను పెట్టుకుంటారు . అలా అని కేవలం వారి మీదనే ఆదారపడితే కుదరదు . హౌస్ లో కంటెస్టెంట్ సరైన కంటెంట్ ఇవ్వకుంటే ఎంతమంది పీఆర్ టీమ్ లో ఉన్న సరే ఎలిమినేట్ అయి బయటకు రావాల్సిందే .
తనూజ కోసం రూ. 100 కోట్లు బిగ్ బాస్ లో పది వారాలుగా తనూజ టాప్ లో ఉంది . సోషల్ మీడియా సర్వేలలో చాలామటుకు ఆమె విన్నర్ అంటూ ఓట్లు పడుతున్నాయి . కల్యాణ్ రెండో స్థానంలో ఉన్నాడు . అయితే , కొందరు తనూజను టార్గెట్ చేస్తూ పీఆర్ టీమ్ సాయంతో నెట్టుకొస్తుందని అంటుంటే … మరికొందరు మాత్రం తనకు బిగ్ బాస్ టీమ్ సపోర్ట్ ఉందని అంటున్నారు . దాదాపు ఇందులో నిజం ఉండదనే వాదన షో గురించి తెలిసిన వారు చెబుతున్నమాట . ఆమెకు కప్ ఇచ్చేందుకు బిగ్ బాస్ టీమ్ ఏకంగా రూ . 100 కోట్లకు పైగా ఖర్చు చేస్తుందా ..? ఒకరి కోసం తమ ప్రతిష్టను దెబ్బతీసుకుంటుందా ..? ఒకవేళ తనూజకు సాయం చేయాలనుకుంటే మరో పది సీరియల్స్‌లలో అవకాశాలు కల్పిస్తారు . అంతే గానీ ఇలా కోట్లలో ఖర్చు పెట్టి ఆమెకు కప్ ఎందుకు ఇస్తారని వాదించేవారు కూడా ఉన్నారు .
పీఆర్ టీమ్, షో సపోర్ట్ ఊహాగానాలు
తనూజ ఓట్ల సీక్రెట్ ఇదే అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సీరియల్ ‘ ముద్దమందారం ..’ 2014 నుంచి 2019 వరకు జీతెలుగులో ఈ సీరియల్ ప్రసారమైంది . ఒకటి రెండు కాదు ఏకంగా 1580 ఎపిసోడ్‌లతో బుల్లితెర హిస్టరీలోనే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది . ఇందులో పల్లెటూరి పేదింటి అమ్మాయి పాత్రలో తనూజ అదరగొట్టింది . ఈ సీరియల్ చూసిన ప్రతిఒక్కరు ఆమెకు ఫ్యాన్స్ అయిపోయారు . తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా చాలా హిట్ అయింది . సీరియల్స్ ఎక్కువగా గృహిణిలే ఫాలో అవుతుంటారు . దీంతో బిగ్ బాస్ లో ఆమెకు వారి నుంచే మద్ధతు లభించింది . ఆపై చాలా గ్యాప్ తర్వాత బిగ్ బాస్ వల్ల తనూజ మళ్లీ కనిపించడంతో మొదటి ఎపిసోడ్ నుంచే ఆమెకు భారీగా ఓట్లు పడటం జరుగుతుంది .
ఈ కారణం వల్లనే ఆమెకు ఎక్కువగా ఓట్లు పోల్ అవుతున్నాయి . కేవలం పీఆర్ వల్ల మాత్రమే ఇంత బజ్ క్రియేట్ అవుతుంది అనుకుంటే పొరపాటే .. ముఖ్యంగా ఈ సీజన్ లో బలమైన కంటెస్ట్ ట్స్ లేకపోవడం ఆపై చాలా పవర్ ఫుల్ అనుకున్న భరణి ఆట పేలవంగా ఉండటంతో తనూజకు బాగా కలిసొచ్చింది . ఇమ్మాన్యుయేల్ సత్తా చాటుతున్నప్పటికీ అతను ఒక్కసారి కూడా నామినేషన్ లోకి రాలేదు . దీంతో తనకూ ఫ్యాన్ బేస్ లేకుండా పోయింది . ఆపై ప్రేక్షకులను మెప్పిస్తుంది కల్యాణ్ మాత్రమే .. కానీ , అతను కూడా తనూజతో బాగా క్లోజ్ గా ఉండటం వల్ల విన్నర్ అయ్యేంత రేంజ్ లో ఓట్లు పెద్దగా అతనివైపు మొగ్గుచూపడం లేదు .
తనూజకు భారీ ఓట్ల సీక్రెట్: ముద్దమందారం!
ఇలా పలు కారణాల వల్ల ప్రస్తుతానికి తనూజ టాప్ లో దూసుకుపోతుంది . పీఆర్ టీమ్ కారణంగానే బిగ్ బాస్ విన్నర్ గా ఎవరూ కాలేరనేది చాలామంది చెబుతున్నమాట .. అందుకోసం ధైర్యం చేసి అంత ఖర్చు ఎవరూ చేయరని కూడా తెలుపుతున్నారు . కానీ , వారి ఆటకు కాస్త బలాన్ని పీఆర్ టీమ్ ఇస్తుందనేది మాత్రం వాస్తవం అంటారు .
మొత్తానికి, తనూజ బిగ్ బాస్ లో సాధిస్తున్న అద్భుతమైన ఓట్ల వెనుక ఆమె పీఆర్ టీమ్ కాదు, కేవలం ‘ముద్దమందారం’ సీరియల్ ద్వారా సంపాదించుకున్న బుల్లితెర అభిమానులే ఉన్నారని స్పష్టమవుతోంది.


