|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘హృతిక్ రామారావు’ నామ సంవత్సరంగా ప్రకటిద్దాం, బంగారాన్ని బీరువాలో పెట్టుకోం కదా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ కామెంట్స్

Published: 11-08-2025, 2:43 AM
‘హృతిక్ రామారావు’ నామ సంవత్సరంగా ప్రకటిద్దాం, బంగారాన్ని బీరువాలో పెట్టుకోం కదా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ కామెంట్స్

‘వార్ 2’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హాజరై, సినిమాపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ల నటనను ఆయన ప్రశంసించారు.

Key Points

1

త్రివిక్రమ్ శ్రీనివాస్ 'వార్ 2' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

2

హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించిన 'వార్ 2' సినిమాను ఆయన ప్రశంసించారు.

4

ఆగస్ట్ 14న విడుదల కానున్న 'వార్ 2' సినిమాకు త్రివిక్రమ్ విజయం కోరుకున్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ వ్యాఖ్యలు

ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్స్ జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్ 2. బ్రహ్మాస్త్రం సినిమా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన వార్ 2 మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా చేసింది.

ఆగస్ట్ 14న వార్ 2 రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆదివారం (ఆగస్ట్ 10) ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ .. ” నందమూరి తారక రామారావు గారితో నాది 25 ఏళ్ల ప్రయాణం. హృతిక్ రోషన్ గారు నటించిన ‘కహోనా ప్యార్ హై’ మూవీని చూసి థియేటర్లలో చప్పట్లు కొట్టాను. అయాన్ తీసిన ‘యే దివానీ హై జవానీ’ మూవీని డజను సార్లు చూశాను. నాగవంశీ నా కుటుంబ సభ్యుడు. ఇలాంటి వారందరినీ ఇలా కలుసుకోవడం ఆనందంగా ఉంది” అని అన్నారు.

‘వార్ 2’ సినిమాపై అభిప్రాయాలు

“‘మ్యాడ్’ ఈవెంట్‌లో ఇది దేవర నామ సంవత్సరం అని చెప్పాను. ఇప్పుడు ‘హృతిక్ రామారావు’ నామ సంవత్సరంగా ప్రకటిద్దాం. ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తుంటే చూడటానికి రెండు కళ్లు చాల్లేదు. 72 గంటల తరువాత ఈ మూవీని చూసి అందరం ఎంజాయ్ చేద్దాం” అని త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలిపారు.

“‘వార్ 2’లో కేవలం ఫైట్స్ మాత్రమే ఉండవని అయాన్ స్పీచ్ తరువాత అర్థమైంది. కేవలం ఫైట్స్ కావాలని అనుకుంటే ఎన్టీఆర్ వరకు ఎందుకు వస్తారు?.. బంగారం ఉంటే నగ చేసుకుంటాం కానీ.. బీరువాలో పెట్టుకోం కదా?.. ఎన్టీఆర్ అంటేనే సిల్వర్ స్క్రీన్‌కు వన్నె తెచ్చేవాడు. అలాంటి ఎన్టీఆర్‌ను అయాన్ గట్టిగానే వాడుకుని ఉంటాడు” అని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చెప్పారు.

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటనపై ప్రశంసలు

“టైటిల్ చూస్తే ‘వార్ 2’ అని ఉంది.. కానీ, హృతిక్ , ఎన్టీఆర్ మాత్రం చాలా స్నేహంగా కనిపిస్తున్నారు. చూస్టుంటే ఎన్టీఆర్‌కు హృతిక్ చెడ్డవారు, హృతిక్‌కు ఎన్టీఆర్ చెడ్డవారు అన్నట్టుగా ఉంది. ఏది ఏమైనా సినిమా మాత్రం మంచిగా ఉంటుంది. ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరూ కూడా ఒకరు వింధ్య పర్వతం, హిమాలయ పర్వతంలా అనిపిస్తుంది. అలాంటి ఇద్దరిని పెట్టి సినిమా తీసిన అయాన్‌కు హ్యాట్సాఫ్” అని త్రివిక్రమ్ పేర్కొన్నారు.

“వార్ 2 ట్రైలర్ చూస్తేనే మూవీ ఎలా ఉండబోతోందో అర్థం అవుతోంది. వినాయక చవితి పండుగ కంటే వారం ముందే ‘వార్ 2’ రాబోతోంది. మా వంశీ, అయాన్, యశ్ రాజ్ ఫిల్మ్స్‌కి పెద్ద విజయం దక్కాలి. ఆగస్ట్ 14న ‘వార్ 2’ని అందరూ చూడండి” అని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన స్పీచ్ ముగించారు.

చివరగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘వార్ 2’ సినిమాకు శుభాకాంక్షలు తెలిపి, సినిమా విజయవంతం కావాలని కోరుకున్నారు. ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ల నటనను ఆయన ప్రశంసించారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.