|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హైదరాబాద్‌లో సంచలనం: ఐటీ కారిడార్‌లో రూ.1200 కోట్ల భూ కుంభకోణం బట్టబయలు!

Published: 07-04-2026, 10:05 PM
హైదరాబాద్‌లో సంచలనం: ఐటీ కారిడార్‌లో రూ.1200 కోట్ల భూ కుంభకోణం బట్టబయలు!
  • హైడ్రా ఐటీ కారిడార్‌లో రూ.1200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది.
  • శేరిలింగంపల్లిలో 8 ఎకరాల భూమిని ఆక్రమణదారుల నుండి విడిపించారు.
  • వాసవి సంస్థ ఆర్‌సీసీ ప్లాంట్‌ను స్వయంగా తొలగించుకుంది, ఇతర షెడ్లు హైడ్రా తొలగించింది.
  • భూమి రంగారెడ్డి కలెక్టర్ ద్వారా ప్రోహిబిటెడ్ లిస్టులో ఉంది, ఇది ప్రభుత్వ భూమి అని నిర్ధారించబడింది.

హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. సుమారు రూ.1200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుండి కాపాడింది. ఈ భూమి శేరిలింగంపల్లిలో ఉంది, దీనిని రియల్ ఎస్టేట్ సంస్థలు ఆక్రమించాయి.

ఐటీ కారిడార్‌లో హైడ్రా ఆపరేషన్

నగరంలోని ఐటీ కారిడార్ లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్ నిర్వ‌హించింది. బ‌డా నిర్మాణ సంస్థ‌ల స్వాధీనంలో ఉన్న ప్ర‌భుత్వ భూమిని కాపాడింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం ఖానామెట్ విలేజ్‌లోని స‌ర్వే నంబ‌ర్ 55లోని 8 ఎక‌రాల‌కు పైగా ఉన్న ప్ర‌భుత్వ భూమిని మంగ‌ళ‌వారం హైడ్రా స్వాధీనం చేసుకుంది.

ఐటీ హబ్ కి చేరువలో బడా రియల్ ఎస్టేట్ సంస్థల స్వాధీనంలో ఉన్న 4.20 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు.. కొల‌ను మాధ‌వ‌రెడ్డి కూతురు స‌బితకు చెందిన 4 ఎక‌రాల భూమిని కూడా హైడ్రా స్వాధీనం చేసుకుంది. ఇందులో తాత్కాలికంగా వేసిన షెడ్డులను తొలగించింది. ప్ర‌భుత్వ భూమిలో నెల‌కొల్పిన ఆర్‌సీసీ ప్లాంట్‌ను వాస‌వి నిర్మాణ సంస్థ స్వయంగా తొల‌గించుకుంది.

కార్మికుల‌ కోసం వేసిన తాత్కాలిక షెడ్డుల‌ను హైడ్రా తొల‌గించింది. మొత్తం 8 ఎకరాల‌కు పైగా ఉన్న ప్ర‌భుత్వ భూమిలో ఆక్ర‌మ‌ణ‌లను హైడ్రా తొల‌గించి బోర్డులు ఏర్పాటు చేసింది. మంగళవారం హైడ్రా కాపాడిన భూమి విలువ మార్కెట్ ధర ప్రకారం రూ. 1200ల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. గ‌తంలోనూ ఇక్క‌డ ఆక్ర‌మ‌ణ‌ల‌ను హైడ్రా తొల‌గించింది. స‌ర్వే నంబ‌రు 53లోని మొండికుంట ఆక్ర‌మ‌ణ‌ల‌తో పాటు.. స‌ర్వే నంబ‌రు 55లోని ప్ర‌భుత్వ భూమిని 11 ఎక‌రాల వ‌ర‌కూ స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా ఓ ప్రకటన విడుదల చేసింది.

ప్రభుత్వ భూమి స్వాధీనం, ఆక్రమణల తొలగింపు

శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ విలేజ్లోని సర్వే నంబర్ 55 లో ఉన్న భూమి అసైన్డ్ ల్యాండ్‌. రంగారెడ్డి కలెక్టర్ ఈ భూమిని ప్రోహిబిటెడ్ లిస్టులో ఇప్పటికే పెట్టారు. దీని ప్ర‌కారం ప్ర‌భుత్వానికి చెందిన‌దిగా పేర్కొన్నారు. అదే భూమిని తమ‌దిగా మీనాక్షి రియల్ ఎస్టేట్ సంస్థ చెబుతూ వస్తోంది. వాసవి నిర్మాణ సంస్థ అందులో ఆర్‌సీసీ ప్లాంటులతో పాటు.. భ‌వ‌న నిర్మాణ కార్మికులకు షెడ్డులు వేసింది. అలాగే నిర్మాణ సామ‌గ్రిని కూడా అందులో ఉంచింది.

ఇలా వినియోగించుకుంటూ మొత్తం 4.20 ఎక‌రాల భూమిని త‌న స్వాధీనంలో ఉంచుకుంది. ఈ రెండు సంస్థ‌ల‌కు తోడు ఇదే స‌ర్వే నంబ‌రులో ఉన్న మ‌రో 4 ఎక‌రాల భూమిని కొల‌ను మాధ‌వ‌రెడ్డి కుమార్తె కొల‌ను స‌బిత త‌న‌దిగా చెబుతూ వ‌స్తున్నారు. బౌన్స‌ర్ల‌ను కాప‌లాగా ఉంచారు.

రూ.1200 కోట్ల విలువైన భూమి రక్షణ

ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందడంతో క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఆదేశాల‌ మేర‌కు క్షేత్ర‌స్థాయిలో స‌బంధిత శాఖ‌ల అదికారుల‌తో క‌లిసి హైడ్రా విచారించింది. ప్ర‌భుత్వ భూమిగా నిర్ధారించుకుంది. మంగ‌ళ‌వారం ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించారు. మొత్తం 8 ఎక‌రాల‌కు పైగా ఉన్న భూమి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. అలాగే ప్ర‌భుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేశారు.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More

ఈ భూమి ప్రభుత్వ собственности అని అధికారులు స్పష్టం చేశారు. ఆక్రమణదారుల ప్రయత్నాలను హైడ్రా అడ్డుకుంది. భవిష్యత్తులో ఇలాంటి చర్యలను నిరోధించడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.