|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హైదరాబాద్‌ టు ముస్సోరీ: మెగా 157 షూటింగ్

Published: 11-06-2025, 4:44 PM
హైదరాబాద్‌ టు ముస్సోరీ: మెగా 157 షూటింగ్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మెగా 157’ చిత్రం షూటింగ్ హైదరాబాద్ తర్వాత ముస్సోరీలో ప్రారంభమైంది. చిరంజీవి, నయనతార, వీటీవీ గణేశ్‌ ప్రధాన పాత్రధారులు.

Key Points

1

చిరంజీవి, నయనతార నటించిన ‘మెగా 157’ చిత్రం ముస్సోరీలో షూటింగ్ ప్రారంభం.

2

పది రోజుల పాటు ముస్సోరీలో కీలక సన్నివేశాల చిత్రీకరణ.

4

వచ్చే సంక్రాంతికి సినిమా విడుదల.

‘మెగా 157’ ముస్సోరీలో షూటింగ్

ముస్సోరీలో ల్యాండ్‌ అయ్యారు చిరంజీవి. ఆయన హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘మెగా 157’ (వర్కింగ్‌ టైటిల్‌) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీటీవీ గణేశ్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇతర కీలక పాత్రల్లో వెంకటేశ్, కేథరిన్‌ నటిస్తారనే ప్రచారం సాగుతోంది. అర్చన సమర్పణలో షైన్‌ స్క్రీన్స్, గోల్డ్‌ బాక్స్‌ ఎంటరై్టన్మెంట్స్‌ పతాకాలపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమా తొలి షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరిగింది. మలి షెడ్యూల్‌ ముస్సోరీలో ప్రారంభమైందని, పది రోజుల పాటు ఈ షూటింగ్‌ షెడ్యూల్‌ జరుగుతుందని బుధవారం మేకర్స్‌ అధికారికంగా తెలిపి, ఓ వీడియోను విడుదల చేశారు. ఈ షెడ్యూల్‌లో చిరంజీవి, నయనతార, వీటీవీ గణేశ్‌ పాల్గొనగా కొన్ని కీలక,  వినోదాత్మక సన్నివేశాలను చిత్రీకరించడానికి ΄్లాన్‌ చేశారు. ‘‘1990, 2000లలో చిరంజీవి గోల్డెన్‌ ఎరాలో కనిపించిన వింటేజ్‌ కామెడీ టైమింగ్‌ను ఈ సినిమాలో   మళ్లీ ప్రేక్షకులు చూడబోతున్నారు. ఇది అభిమానులకు ఒక విజువల్‌ ట్రీట్‌. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్‌ చేస్తాం’’ అని చిత్రబృందం  పేర్కొంది.

పది రోజుల షెడ్యూల్‌

వింటేజ్ కామెడీతో అభిమానులకు విందు

చిరంజీవి, నయనతార జంట నటనతో తెరకెక్కుతున్న మెగా 157 చిత్రం వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ముస్సోరీ షెడ్యూల్ పూర్తి అయ్యాక మరింత సమాచారం వెలువడే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.