
📌 Key Points
- హైపర్ ఆది కుల భావన, వ్యవస్థ పట్ల విరక్తిని వ్యక్తం చేశారు.
- పెళ్లిళ్లకు కులం అవసరమైనప్పుడు, అక్రమ సంబంధాలకు ఎందుకు కాదని ఆయన ప్రశ్నించారు.
- పరువు హత్యలు సమాజంలో దూరాన్ని పెంచుతాయని, పరిష్కారం హింస కాదని ఆది అభిప్రాయపడ్డారు.
- ఆది వ్యాఖ్యలపై నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తూ, ఆయన చెప్పింది నిజమని అంగీకరించారు.
జబర్దస్త్ హైపర్ ఆది ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో కుల వ్యవస్థ, పరువు హత్యలు, అక్రమ సంబంధాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్లిళ్లలో కులం ప్రాధాన్యతను, సమాజంలోని ద్వంద్వ వైఖరిని ప్రశ్నిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.
కులంపై హైపర్ ఆది నిర్మొహమాటమైన వ్యాఖ్యలు
జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది(Hyper Adi) పలు చిత్రాల్లోనూ నటించి ఎంతో పాపులారిటీ దక్కించుకున్నాడు. అంతేకాకుండా ఢీ షోలోనూ మెంటర్‌గా చేసిన ఆది తన కామెడీతో జడ్జెస్‌ను ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నారు. ఇటీవల ‘మాస్ జాతర’(mass jathara) మూవీతో అలరించారు. ప్రస్తుతం స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయారు. ఈక్రమంలో..తాజాగా, ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆది కీలక వ్యాఖ్యలు చేశాడు. కుల వ్యవస్థ , పరువు హత్యలపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. నా కాలేజీ రోజుల నుంచే కుల భావన మీద విరక్తి ఉందని, మనుషులను కులం పేరుతో విభజించడం వల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదని ఆయన అన్నారు. అవసరం వచ్చినప్పుడు కులం పనిచేయదు, కేవలం మనిషి మాత్రమే తోడుంటాడు అని ఆది స్పష్టం చేశారు.
అక్రమ సంబంధాలు, పెళ్లిపై ఆది ప్రశ్నలు
ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు డాక్టర్ కులం ఏంటో అడగని మనం, పెళ్లి విషయానికి వచ్చేసరికి మాత్రం కులాన్ని వెతకడం ఏంటని? ప్రశ్నించారు. అంతేకాకుండా.. సమాజంలోని ద్వంద్వ వైఖరిని ప్రశ్నిస్తూ.. అక్రమ సంబంధాల విషయంలో అడ్డురాని కులం, కేవలం పెళ్లిళ్ల దగ్గరే ఎందుకు గుర్తొస్తుంది?’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట సంచలనంగా మారాయి. పెళ్లికి పాత ఆలోచనా? అక్రమ సంబంధాలు మాత్రం ఎవరితో అయినా? పెట్టుకోవచ్చా అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. సమాజంలో పెరుగుతున్న పరువు హత్యలపై ఆది మాట్లాడుతూ..‘‘ వేరే కులాన్ని ప్రేమించారనే కారణంతో కన్నబిడ్డల ప్రాణాలు తీయడం అత్యంత దారుణం. ఇది పరువును పెంచకపోగా మనుషుల మధ్య దూరాన్ని పెంచుతుంది.
పరువు హత్యలపై ఆది ఆవేదన
నిజమైన ప్రేమతో ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండగలరని అనిపిస్తే, వారికి అండగా నిలవాల్సిన బాధ్యత కుటుంబాలపై ఉంది. అబ్బాయి ఆర్థికంగా స్థిరంగా లేకపోతే, అతనికి తగిన సమయం ఇచ్చి, ఉద్యోగం వచ్చిన తర్వాత వివాహం చేయడం సరైన మార్గం. కానీ చిన్న విషయాలకే హింసకు దారి తీయకుండా, ఆవేశాన్ని తగ్గించుకుని ఆలోచిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది కానీ హింస వల్ల కేవలం విషాదమే మిగులుతుంది’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆది చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు సైతం పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. మీరు చెప్పింది ముమ్మాటికీ నిజమని అంటున్నారు.
హైపర్ ఆది వ్యాఖ్యలు సమాజంలో లోతైన చర్చకు దారితీస్తున్నాయి. కులం, పరువు హత్యలు వంటి సున్నితమైన అంశాలపై ఆయన నిర్మొహమాటంగా మాట్లాడటంపై నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఆది చెప్పింది నిజమని అంగీకరిస్తున్నారు.


