|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఐ యామ్ ఫైన్.. : నటుడు గోవిందా

Published: 12-11-2025, 8:56 AM
ఐ యామ్ ఫైన్.. : నటుడు గోవిందా

బాలీవుడ్ నటుడు గోవిందా అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన వార్త అభిమానులను ఆందోళనకు గురిచేసింది. ప్రస్తుతం ఆయన కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తాను బాగానే ఉన్నానని, అధిక వర్కౌట్స్ వల్ల అలసిపోయి పడిపోయానని మీడియాకు తెలిపారు.

Key Points

1

నటుడు గోవిందా అస్వస్థతకు గురై ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

2

అధిక వర్కౌట్స్, గత నెల తీరిక లేకపోవడం అలసటకు, పడిపోవడానికి కారణం.

4

వైద్యులు కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని గోవిందాకు సూచించారు.

గోవిందా అస్వస్థత: ఆసుపత్రికి తరలింపు

తాను బాగానే ఉన్నానని బాలీవుడ్ నటుడు గోవిందా మీడియాకు ప్రకటన విడుదల చేసాడు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన గోవిందా మీడియాతో మాట్లాడుతూ.. నిన్న వర్క్ ఔట్స్ ఎక్కువగా చేయడం వల్ల అలసి పోయానని, అందుకే కళ్లు తిరిగి పడిపోయినట్టు తెలియజేసారు. గత నెల నుంచి తీరిక లేకుండా ఉండటం వలన బాడీకి రెస్ట్ లేకుండా ఉందని అన్నారు.

వర్కౌట్స్ కంటే యోగాకు ప్రాధాన్యత ఇచ్చి ఉంటే ఇలా జరిగేది కాదని తెలిపారు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని పేర్కొన్నారు. కాగా 61 ఏళ్ల గోవిందా మంగళవారం రాత్రి తన నివాసంలో కుప్పకూలిపోయారు. జుహులోని ఓ ఆసుపత్రిలో అడ్మిట్ చేయగా.. కొద్ది గంటల చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేసారు వైద్యులు.

డిశ్చార్జ్ అనంతరం గోవిందా ప్రకటన

అలసటకు కారణం, వైద్యుల సలహా

గోవిందా ఆరోగ్యం పట్ల ఆందోళన చెందిన అభిమానులందరికీ ఇది శుభవార్త. ఆయన త్వరగా కోలుకుని తిరిగి షూటింగ్స్‌లో పాల్గొనాలని ఆశిస్తున్నాము. డాక్టర్ల సలహా మేరకు ఆయన విశ్రాంతి తీసుకోవడం మంచిది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.