|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జ్ఞాపకాలను మోయడం ఆపేశాను

Published: 30-09-2025, 5:16 PM
జ్ఞాపకాలను మోయడం ఆపేశాను

ప్రముఖ సినీ నటి సమంత తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన వ్యక్తిగత జీవితం, ఆలోచనలను పంచుకున్నారు. ముప్పై ఏళ్ల తర్వాత జీవితం పట్ల తన దృక్పథం ఎలా మారిందో వివరించారు. గతాన్ని వీడి, తనని తాను ప్రేమించుకోవడం ఎంత ముఖ్యమో తెలియజేశారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Key Points

1

సమంత 20 ఏళ్లలో గుర్తింపు కోసం ఆరాటపడి, తనని తాను కోల్పోయానని పేర్కొన్నారు.

2

నిజమైన ప్రేమ మనలోనే ఉంటుందని, మనల్ని మనం ప్రేమించుకోవడమే అని ఆమె తెలుసుకున్నారు.

4

గత తప్పుల జ్ఞాపకాలను మోయడం ఆపేసి, స్వేచ్ఛగా జీవిస్తున్నానని తెలిపారు.

సమంత 20 ఏళ్ల వయసులో: ఆరాటం, గందరగోళం

‘‘నా ఇరవయ్యేళ్ల వయసులో విశ్రాంతి లేకుండా గందరగోళంలో గడిపాను… గుర్తింపు కోసం ఆరాటపడ్డాను. నా ఫీలింగ్స్‌ ఏవీ పైకి కనిపించకుండా ఉండేందుకు కష్టపడ్డాను. ఈ క్రమంలో నన్ను నేను ఎంత కోల్పోయానో నాకు మాత్రమే తెలుసు. ఆ సమయంలో ప్రేమ గురించి నాకెవరూ చెప్పలేదు. కానీ నిజమైన ప్రేమ మనలోనే దాగి ఉంటుందని, మనల్ని మనం ప్రేమించుకోవడమే నిజమైన ప్రేమ అని ఆ తర్వాత అర్థం చేసుకున్నాను’’ అని పేర్కొన్నారు సమంత.

ముప్పై ఏళ్ల తర్వాత జీవితంపై కొత్త దృక్పథం

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఆలోచనలను, అబీప్రాయాలను ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంటుంటారు సమంత. తన మేకప్‌మేన్‌తో ఓ సుదీర్ఘమైన చర్చ జరగిందని, ఈ చర్చలో ఎన్నో అంశాలను మాట్లాడుకున్నామని పేర్కొని, వాటిలోని కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ, ఇన్‌స్టాలో ఓపోస్ట్‌ షేర్‌ చేశారు సమంత. ‘‘ముప్పైఏళ్ల తర్వాత మీరు ప్రపంచాన్ని చూసే తీరు మారిపోతుంది.

గతాన్ని వీడి, స్వీయ ప్రేమను గుర్తించడం

మీ అందంలో మార్పులొస్తాయి. ఇప్పుడు నేను ముప్పై ఏళ్లలో ఉన్నాను. ప్రతిదాని వెంట పరుగులు పెట్టడం ఆపేసి, జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను. గతంలో నేను చేసిన తప్పుల తాలూకు జ్ఞాపకాలను మోయడం ఆపేశా. పబ్లిక్‌లో ఒకలా… ఒంటరిగా ఉన్నప్పుడు మరోలా… ఇలా రెండు రకాలుగా ఉండటం మానేశాను. ఎందుకంటే మీరు మీలా ఉన్నప్పుడే హ్యాపీగా… స్వేచ్ఛగా జీవించగలరు’’ అని ఆపోస్ట్‌లో పేర్కొన్నారు సమంత.

సమంత తన గతాన్ని వీడి, వర్తమానాన్ని ఆస్వాదించమని సందేశం ఇచ్చారు. తనను తాను ప్రేమించుకుంటేనే స్వేచ్ఛగా, సంతోషంగా జీవించగలమని నొక్కి చెప్పారు. ఆమె స్ఫూర్తిదాయకమైన మాటలు ఎందరికో ఆదర్శంగా నిలుస్తాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.