
📌 Key Points
- స్టార్ హీరోల సినిమాలను పైరసీ చేసిన ఐబొమ్మ రవిని పోలీసులు అరెస్ట్ చేశారు.
- విదేశాల్లో ఉంటూ హైదరాబాద్‌కు రాగానే పక్కా సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- నాంపల్లి కోర్టులో ఐదు సైబర్ క్రైమ్ కేసుల్లో బెయిల్ కోసం రవి పిటిషన్ దాఖలు చేశారు.
- నాంపల్లి హైకోర్టు రవి బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసి దిమ్మతిరిగే షాకిచ్చింది.
సినిమా పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ కోసం వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఐదు కేసుల్లో బెయిల్ ఇవ్వాలన్న రవి అభ్యర్థనను తోసిపుచ్చింది.
ఐబొమ్మ రవి అరెస్ట్: విచారణలో బయటపడ్డ నిజాలు
IBOMMA Ravi : స్టార్ హీరోల సినిమాలను ఫైరసి చేస్తున్న ఐబొమ్మ నిర్వాహకుడు రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.. విధేశాల్లో ఉండే అతను హైదరాబాద్ కు రావడంతో పక్కా సమాచారంతో పోలీసులు అతని అరెస్ట్ చేశారు.. అప్పటినుంచి రిమాండ్ లో ఉంచిన పోలీసులు అతని విచారిస్తున్నారు. ఈ విచారణలో భాగంగా కొన్ని నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి.. అయితే అతను కొన్ని నిజాలను బయటపెట్టలేదని అనుమానించిన పోలీసులు అతన్ని మరోసారి విచారిస్తున్నారు.. ఈ క్రమంలో ఐబొమ్మ రవి నాంపల్లి కోర్టులో బెయిల్ కోసం ఫిటిషన్ వేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన ఐదు కేసుల్లో బెయిల్ ఇవ్వాలని రవి కోర్టును ఆశ్రయించాడు. తాజాగా నాంపల్లి హైకోర్టు అతనికి దిమ్మతిరిగే షాకిచ్చింది.. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు కొట్టి వేసింది.. అయితే బెయిల్ రద్దు పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
బెయిల్ కోసం ఐబొమ్మ రవి పిటిషన్
కోర్టు షాక్: బెయిల్ రద్దు, తదుపరి ఏంటి?
ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ రద్దు కావడం అతని భవిష్యత్తుపై ప్రశ్నార్థకం సృష్టించింది. ఈ తీర్పు తర్వాత అతనిపై నమోదైన కేసుల భవితవ్యం, శిక్ష తదితర పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.


