|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సుచిగా గుర్తుందా? ఇడియట్ హీరోయిన్ రక్షిత బర్త్ డే లుక్ చూస్తే షాక్ అవుతారు!

Published: 04-04-2026, 4:35 AM
సుచిగా గుర్తుందా? ఇడియట్ హీరోయిన్ రక్షిత బర్త్ డే లుక్ చూస్తే షాక్ అవుతారు!
  • 2002లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇడియట్ మూవీతో రక్షిత పాపులర్ అయ్యారు.
  • రక్షిత మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించారు.
  • 2005లో చివరిగా అదిరిందయ్యా చంద్రం సినిమాలో కనిపించారు.
  • మార్చి 31న రక్షిత తన 42వ పుట్టినరోజు జరుపుకున్నారు.

ఒకప్పుడు గ్లామర్ క్వీన్ గా వెలుగొందిన రక్షిత.. ఇడియట్ సినిమాతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే, పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన రక్షిత.. తాజాగా తన బర్త్ డే వేడుక ఫోటోలతో అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఇడియట్ మూవీతో రక్షిత పాపులారిటీ

Rakshitha:ఒకప్పుడు అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకొని.. ఆ తర్వాత అనూహ్యంగా ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు హీరోయిన్లు. అయితే అందులో కొంతమంది పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమైతే.. మరికొంతమంది అవకాశాలు లేక దూరం అవుతుంటారు. ఇంకొంతమంది ఇతర కారణాల పైన దృష్టి పెట్టి ఇండస్ట్రీకి దూరమైన వాళ్లు కూడా ఉన్నారు. అయితే అలా అభిమానులకు దూరం అయి.. మళ్ళీ కొన్నేళ్ల తర్వాత సడన్ గా కనిపించి ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. కొంతమంది ఒకప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే కనిపించి సర్ప్రైజ్ చేస్తే.. మరి కొంతమంది ఊహించని విధంగా బరువు పెరిగిపోవడం లేదా బక్కచిక్కిపోయినట్లు కనిపిస్తూ ఉంటారు.. అలాంటి వారిలో రక్షిత (Rakshitha) కూడా ఒకరు.

2002 లో ప్రముఖ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ .. ఒకప్పుడు సక్సెస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెలుగు ప్రేమ కథ మూవీగా వచ్చిన చిత్రం ఇడియట్: ఓ చంటిగాడి ప్రేమ కథ.. అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది . ఇందులో సుచిత్ర పాత్రలో రక్షిత నటన అమోఘం అని చెప్పాలి. తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో, లుక్ తో ఆకట్టుకొని.. కుర్ర కారు గుండెల్లో సుచిగా ముద్ర వేసుకుంది. అలా మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకున్న రక్షిత.. ఆ తర్వాత పెళ్ళాం ఊరెళితే, నిజం, శివమణి ,లక్ష్మీనరసింహ, ఆంధ్రావాలా, అందరివాడు వంటి చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇకపోతే చివరిగా 2005లో అదిరిందయ్యా చంద్రం సినిమా తర్వాత మళ్లీ కనిపించలేదు.

పెళ్లి తర్వాత సినిమాలకు దూరం

దీంతో ఈమె ఎక్కడ ఉంది? ఏం చేస్తోంది ? అని అభిమానులు ఎప్పటికప్పుడు ఆమె గురించి ఆరా తీస్తూ వచ్చారు. అయితే పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమైన ఈమె.. ఒకానొక సమయంలో సడన్గా బరువు పెరిగిపోయి కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒకప్పుడు గ్లామర్ క్వీన్ గా నిలిచిన రక్షిత ఈమేనా అంటూ ఆశ్చర్యపోయారు. అయితే ఇప్పుడు మరోసారి కనిపించి మళ్లీ అభిమానులను సడన్ సర్ప్రైజ్ చేసింది రక్షిత. ఇకపోతే మార్చి 31వ తేదీన రక్షిత తన 42వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంది. అయితే ఆ ఫోటోలను తాజాగా సోషల్ మీడియాలో పంచుకోవడంతో నెటిజన్లు ఆమెకు బర్తడే విషెస్ చెబుతూనే.. ఆమె లుక్ చూసి ఆశ్చర్యపోయారు.. అప్పటి గ్లామరస్ రూపానికి భిన్నంగా బొద్దుగా కనిపిస్తుండడంతో నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన రక్షిత ఇప్పుడు ఇలా పుట్టినరోజు వేడుకల వీడియోలతో మళ్ళీ దర్శనం ఇవ్వడంతో ఆమె మార్పును అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.

బర్త్ డే లుక్ తో షాక్ ఇచ్చిన రక్షిత

ఇకపోతే కొంతమంది నెటిజన్లు మాత్రం ఆమె వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని, ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం కుటుంబ జీవితాన్ని ఎంతో సంతోషంగా కొనసాగిస్తున్న రక్షిత మాత్రం ఇలా బరువు పెరిగిపోయి అభిమానులను తీరని నిరాశకు గురి చేస్తోందనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రక్షిత లుక్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది అనడంలో సందేహం లేదు.

Tags Idiot Movie Tollywood heroine Share

మొత్తానికి పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన రక్షిత.. తన తాజా లుక్ తో అభిమానులకు షాక్ ఇచ్చారు. ఆమె మళ్లీ సినిమాల్లోకి వస్తారా లేదా వేచి చూడాలి. ఆమెకు అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.