
📌 Key Points
- ఇళయరాజాకు కాపీరైట్ కేసులో ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
- సరిగమ సంస్థ దాఖలు చేసిన కేసులో ఇళయరాజాకు వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి.
- 130 చిత్రాల పాటలను వాణిజ్యపరంగా ఉపయోగించకుండా ఇళయరాజాను కోర్టు నిషేధించింది.
- నిర్మాతలకే పాటలపై మొదటి హక్కు ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది.
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు కాపీరైట్ వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సరిగమ సంస్థ దాఖలు చేసిన కేసులో కోర్టు ఆయనకు వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఇళయరాజాకు ఎదురుదెబ్బ ఎందుకు?
Ilaiyaraaja Copyright: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు కాపీరైట్ వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టు నుండి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తన అనుమతి లేకుండా తన సంగీతాన్ని వాడుతున్నారని గతంలో ఆయన పలువురిపై చట్టపరమైన చర్యలు తీసుకోగా, ఈసారి ప్రముఖ మ్యూజిక్ లేబుల్ ‘సరిగమ’ దాఖలు చేసిన కేసులో కోర్టు ఆయనకు వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు 130 చిత్రాలకు సంబంధించిన పాటలను ఇళయరాజా వాణిజ్యపరంగా ఉపయోగించుకోకుండా, ఇతర ప్లాట్‌ఫారమ్‌లకు లైసెన్స్‌లు ఇవ్వకుండా కోర్టు నిషేధం విధించింది.
Read also- Illu illaalu pillalu Prema : ‘ఇల్లు పిల్లలు పిల్లలు ‘ ప్రేమ ఆస్తులు విలువ ఎంతంటే..?.. బాగా సౌండే మావా..
సరిగమ వాదన ఏమిటి?
సరిగమ సంస్థ వాదన ప్రకారం, గతంలో సినిమా నిర్మాతలు తమ చిత్రాలలోని పాటల హక్కులను (కాపీరైట్) ఒప్పందం ప్రకారం తమ సంస్థకు శాశ్వతంగా కట్టబెట్టారు. అయితే ఇళయరాజా ఆ పాటలపై తనకు హక్కులు ఉన్నాయని చెప్పుకుంటూ అమెజాన్ మ్యూజిక్, ఐట్యూన్స్, జియోసావన్ వంటి ప్లాట్‌ఫారమ్‌లకు లైసెన్స్‌లు ఇస్తున్నారని, దీనివల్ల తమకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతోందని సరిగమ కోర్టును ఆశ్రయించింది. 1957 కాపీరైట్ చట్టం ప్రకారం ఒప్పందంలో వేరేలా పేర్కొంటే తప్ప, సాధారణంగా నిర్మాతకే మొదటి హక్కులు ఉంటాయని కోర్టు అభిప్రాయపడింది.
Read also- Horror Comedy OTT : పెళ్ళాం పోయాక సంతోషపడే మొగుడు… చచ్చినా వదలని ఆత్మ… క్లైమాక్స్ వరకు నవ్వులే
కోర్టు తీర్పు సారాంశం
గతంలో కూడా ‘ఎన్ ఇనియ పొన్ నిలవే’ వంటి పాటల విషయంలో ఇళయరాజాకు, సరిగమకు మధ్య వివాదం నడిచింది. అప్పుడు కూడా కోర్టు సరిగమకే అనుకూలంగా తీర్పునిచ్చింది. తాజాగా వెలువడిన ఈ తీర్పుతో తన సంగీతంపై తనకే పూర్తి హక్కులు ఉండాలని పోరాడుతున్న మాస్ట్రోకు పెద్ద చిక్కు వచ్చి పడింది. ప్రస్తుతానికి వందకు పైగా సినిమాల పాటలపై ఆయనకు నియంత్రణ లేకుండా పోయింది, ఇది ఆయన న్యాయపోరాటంలో ఒక కీలక మలుపుగా మారింది. ఇంతకు ముందు ఇళయరాజా పలువురు తమ పాటలను వాడుకున్నారని వారికి నోటీసులు పంపిన విషయం తెలిసిందే.
ఈ తీర్పు ఇళయరాజా న్యాయపోరాటంలో ఒక కీలక మలుపు. వందకు పైగా సినిమాల పాటలపై ఆయనకు నియంత్రణ లేకుండా పోయింది. దీనిపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.


