|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్: వల్లికి షాకిచ్చిన విశ్వక్! నర్మద ప్రేమ కథలో భాగ్యం ట్విస్ట్!

Published: 11-02-2026, 1:05 AM
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్: వల్లికి షాకిచ్చిన విశ్వక్! నర్మద ప్రేమ కథలో భాగ్యం ట్విస్ట్!
  • వల్లికి నిజం చెప్పేసిన విశ్వక్: అమూల్యను పెళ్లి చేసుకోలేదని సంచలన ప్రకటన!
  • నర్మద ప్రేమ వ్యవహారంలో భాగ్యం ఎంట్రీ: ప్రేమ కథకు ఊహించని ట్విస్ట్!
  • ప్రేమకు గాయం: ధీరజ్ ప్రేమతో కట్టు, వారి మధ్య చిగురించిన అనుబంధం!
  • రామరాజుకు శ్రీవల్లి పొర్లు దండాలు: కారణం తెలుసుకునేందుకు వేదవతి ప్రయత్నం!

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నేటి ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది. విశ్వక్ నిజం చెప్పడం, నర్మద ప్రేమకు అడ్డంకులు, ప్రేమ-ధీరజ్ లవ్ స్టోరీలో కొత్త మలుపులు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేశాయి.

విశ్వక్ నిజం చెప్పడంతో వల్లికి షాక్!

ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో ప్రేమ, ధీరజ్‌లు గుడిమెట్ల మీద కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రేమ తాను పరీక్ష రాయనని చెబుతుంది. కానీ ధీరజ్ ఆమెను ఒప్పించి పరీక్ష రాయాలని చెబుతాడు. ఈలోపు కొబ్బరి చిప్ప ప్రేమ పగలగొట్టడంతో ఆమె చేతికి గాయం అవుతుంది. చాలా కంగారుగా ఆమెను ప్రేమగా చూసుకుంటాడు ధీరజ్. ఆప్యాయతను చూసిన ప్రేమ చాలా ఆనందపడుతుంది.

ధీరజ్ కూడా నీకు అన్నీ నేనే కదా, నీ మీద కేరింగ్ లేకుండా ఎలా ఉంటుంది, నీకు ఏమైనా అయితే బాధ లేకుండా ఎలా ఉంటుంది అని అంటాడు. అప్పుడు ప్రేమ అమూల్య విషయం చెప్పేద్దామని అనుకుంటుంది. ధీరజ్ తో ‘లైఫ్ లాంగ్ ఇలాగే నా మీద చేరింది చూపిస్తావా? ఇలాగే చూసుకుంటావా? నా చేయి ఎప్పటికీ వదలవు కదా’ అని అంటుంది. ధీరజ్ చనిపోయే వరకు చేయి వదలను అని అంటాడు. కోపం వచ్చినా కూడా ఆ కోపాన్ని ప్రేమ డామినేట్ చేసేస్తుందని చెబుతాడు. దాంతో మనసు ప్రశాంతంగా ఉన్నట్టు ప్రేమ చెబుతుంది. ఇక ధీరజ్ ప్రేమను ప్రేమించిన సంగతి చెప్పాలి అనుకుంటాడు. కానీ అదే సమయానికి మోకాలి ప్రదక్షిణలు చేస్తూ అక్కడికి వస్తాడు విశ్వక్.

నర్మద ప్రేమకు భాగ్యం అడ్డుకట్ట వేస్తుందా?

విశ్వను చూసిన ధీరజ్ వీళ్లు కూడా వచ్చారా? అని అనుకుంటాడు. అమూల్యను నాన్న చూస్తే ఇబ్బంది పడతారు, వెంటనే నాన్నని తీసుకువెళ్లిపోవాలి పదా అని చెప్పి ప్రేమని తీసుకుని రామరాజు దగ్గరికి వస్తాడు. రామరాజుతో వెళ్లిపోదాం పదండి అని చెప్పి తీసుకు వెళ్తాడు. ఈ లోపు శ్రీవల్లి పొర్లు దండాలు పెట్టుకుంటూ రామరాజు దగ్గరికి వచ్చి ఆగుతుంది. దాంతో పొర్లు దండాలు ఎందుకు మొక్కుకున్నావు అని వేదవతి అడుగుతుంది. అప్పుడు నర్మద ‘చేసిన పాపాలకు భయపడినట్టుంది’ అని అంటుంది. రామరాజు అదేంటమ్మా అనగానే… ‘ ఏం లేదు అన్నయ్యగారు మీరు ప్రాణాలతో బయట పెడితే పొర్లుదండాలు పెడతానని మొక్కుకుంది’ అని భాగ్యం కవర్ చేస్తుంది’ ఈ లోపు నర్మద తండ్రి ప్రసాద రావు అక్కడ స్వీట్స్ పంచుతూ వస్తాడు.

నర్మద తన తండ్రిని చూసి నాన్న మీరేంటి స్వీట్స్ పంచుతున్నారు అని అడుగుతుంది. ప్రసాద్ రావు సాగర్ అని ఏదో చెప్పబోయి రామరాజుని చూసి ఆగిపోతాడు. ఇక వల్లి, భాగ్యం మాత్రం ఆ విషయం ఏంటో చెప్పమని పట్టుబడతారు. దాంతో ప్రసాద్ రావు ఎలాగోలా తప్పించుకోవాలని ‘మా అమ్మాయి, అల్లుడు అన్యోన్యంగా ఉంటున్నారు కదా. అలాగే ఉండాలని కోరుకుంటూ ఇలా స్వీట్లు పంచుతున్నాను’ అంటాడు. ఈ లోపు భాగ్యం ‘అదేంటి సాగర్ ను మీ అల్లుడుగా మీరు ఒప్పుకోలేదుగా… ఇంతవరకు కూతురుని, అల్లుడిని ఇంటికే తీసుకెళ్లలేదు’ అని అంటుంది. దాంతో నర్మద కోపంగా ‘అల్లుడిగా అంగీకరించనంత మాత్రాన, కూతురిని ఇంటికి తీసుకెళ్లనంత మాత్రాన ప్రేమ ఎక్కడికి పోతుంది’ అని అంటుంది

ప్రేమ, ధీరజ్ లవ్ స్టోరీలో కొత్త టర్న్!

రామరాజు అక్కడ నుంచి వెళుతూ ఉంటారు. ఈ లోపు అమూల్యను చూస్తాడు. అమూల్య కూడా తండ్రిని చూసి ప్రేమగా దగ్గరికి వస్తుంది. కానీ వేదవతి మాత్రం కోపంగా మాట్లాడుతుంది. రామరాజుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో విశ్వక్ అమూల్యను చూసి ఇదేంటిది ఇలా టార్చర్ పెట్టి చంపుతుంది అని మనసులో అనుకుంటాడు. శ్రీవల్లి కూడా విశ్వను చూసి ఇదంతా వీడి వల్లే అనుకుంటూ పెద్ద రాయి పట్టుకొని కొట్టడానికి వెళుతుంది. విశ్వక్ తో ‘నువ్వు మాట్లాడతా అని పిలిచి ఆ పిల్లని పెళ్లి చేసుకుని వచ్చావు. నీ వెనక ఉన్నది నేనే అని నర్మద, ప్రేమలకు తెలిసిపోయింది. నర్మద అయితే నన్ను కొట్టింది. నా కాపురంలో నిప్పులు పోసావు. అసలు పెళ్లెందుకు చేసుకున్నావు’ అని తిడుతుంది. అప్పుడు విశ్ నేను అసలు అమూల్యని పెళ్లి చేసుకోలేదని, అమూల్యే మెడలో తాళికట్టుకుని వచ్చిందని చెబుతాడు. దీంతో శ్రీవల్లి, భాగ్యం, ఇడ్లీ బాబాయ్ షాక్ అవుతారు.

అమూల్య తనంతట తానే తాళి కట్టుకొని వచ్చింది, తెలివిగా తాళి వేసుకొని వచ్చి నాకు టార్చర్ పెడుతుంది, అమూల్య వెనక ఎవరో ఉన్నారు, వాళ్ళని కనిపెట్టి వాళ్ళ పని చెబుతాను అని అంటాడు విశ్వక్. భాగ్యం వాళ్ళు కూడా ఆ విషయాన్ని తాము కనిపెట్టాలని అనుకుంటారు. ఈ లోపు ప్రసాద్ స్వీట్స్ ఎందుకు పంచాడో, సాగర్ సంగతి, అమూల్య విషయం అన్నీ తెలుసుకోవాలని అనుకుంటుంది భాగ్యం బ్యాచ్. ఈ లోపు నర్మద, ప్రేమ అక్కడికి వస్తారు. ప్రేమ మాట్లాడుతూ ‘నువ్వు ఎన్ని పొర్లు దండాలు పెట్టినా నీ సంగతి తెలిసే వరకే.. ఆ తర్వాత నువ్వు ఎలాగూ తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే’ అని అంటుంది. ఈ లోపు భాగ్యం మాట్లాడుతూ ‘మేమెందుకు సర్దుకుంటాం. అసలు అమూల్యకు పెళ్లి అవ్వలేదుగా’ అని అంటుంది. దాంతో నర్మద, ప్రేమ షాక్ అయిపోతారు. దాంతో ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది.

మరింత ఉత్కంఠభరితమైన మలుపులతో సీరియల్ ముందుకు సాగుతోంది. రాబోయే ఎపిసోడ్‌లలో ఏం జరుగుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.