|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పశ్చిమాసియా భగ్గు: రాజ్యసభలో కేంద్రం ప్రకటన! భారతీయుల భద్రతపై దృష్టి!

Published: 09-03-2026, 3:05 AM
పశ్చిమాసియా భగ్గు: రాజ్యసభలో కేంద్రం ప్రకటన! భారతీయుల భద్రతపై దృష్టి!
  • పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులను అంచనా వేస్తున్నట్లు కేంద్ర మంత్రి జైశంకర్ ప్రకటన
  • భారతీయుల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వెల్లడి
  • గల్ఫ్ దేశాల్లోని భారతీయుల కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు
  • ఇరాన్ వెళ్లొద్దని భారతీయులకు జనవరిలోనే సూచనలు జారీ

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రకటన చేసింది. యుద్ధ పరిస్థితులను అంచనా వేస్తూ, భారతీయుల రక్షణకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి జైశంకర్ తెలిపారు. ప్రధాని మోడీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

పశ్చిమాసియాలో ఆందోళనకర పరిస్థితులు

పశ్చిమాసియాలో పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని యుద్ధ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని కేంద్ర మంత్రి జైశంకర్ అన్నారు. తాజా పరిస్థితులను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. భారతీయుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని, సంబంధిత శాఖలన్నింటికీ తగిన చర్యలు తీసుకోవాలని సూచించామన్నారు. పశ్చిమాసియాలో పరిస్థిస్తులపై ఇవాళ కేంద్రం రాజ్యసభలో ప్రకటన చేసింది. ఈ సందర్భంగా పెద్దల సభలో మాట్లాడిన మంత్రి జైశంకర్ శాంతికి ఎలాంటి విఘాతం కలిగినా ప్రపంచం మొత్తం ఆ ప్రభావం ఉంటుందని చర్చలు, దౌత్యపరంగా సమస్య పరిష్కారం అవుతుందని భారత్ నమ్ముతోందని చెప్పారు. ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్చలు జరుపుతున్నట్టు వెల్లడించారు. మార్చి 1న సీసీఎస్ సమావేశం నిర్వహించామన్నారు. ఇరాన్ లోని భారతీయుల భద్రతకు ఎంబసీ అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పరిస్థితులు చక్కబడగానే టెహ్రాన్‍లోని భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని వెల్లడించారు.

గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల రక్షణకు చర్యలు చేపట్టామని కోటి మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నారని వెల్లడించారు. గల్ఫ్ లో చిక్కుకున్న వారిని భారత్ రప్పించేందుకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇరాన్ కు వెళ్లొద్దని జనవరిలోనే భారతీయులుక సూచించామన్నారు. భారత్ ఇంధన అవసరాల విషయంలో పశ్చిమాసియా కీలకం. క్రూడాయిల్ ధర పెరుగుదలపై అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు. గల్ఫ్ దేశాలు భారత్ కు ముఖ్యమైన వాణిజ్య భాగస్వాములు గల్ఫ్ దేశాల్లో ఉన్న భారత ఎంబసీలు ఎప్పటికప్పుడు అడ్వైజరీలు జారీ చేస్తున్నాయన్నారు. గల్ఫ్ దేశాలతో భారత ప్రభుత్వం చర్చలు జరుపుతోందన్నారు. భారతీయుల కోసం హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశామన్నారు. భారత్ రావాలనుకునేవారి కోసం విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయన్నారు. దోహా, జోర్డాన్ లో ఉన్న వారికి సహాయం అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడినట్లు చెప్పారు.

భారతీయుల రక్షణకు కేంద్రం చర్యలు

గల్ఫ్ దేశాలతో చర్చలు జరుపుతున్న భారత్

పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పడానికి భారత్ తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. గల్ఫ్ దేశాల్లోని భారతీయుల భద్రతకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.