|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

India Airstrikes Pakistan: ‘ఆపరేషన్‌ సింధూర్‌’ కోసం నిలబడుదాం అంటూ ప్రముఖల పోస్ట్‌లు

Published: 06-05-2025, 11:35 PM
India Airstrikes Pakistan: 'ఆపరేషన్‌ సింధూర్‌' కోసం నిలబడుదాం అంటూ ప్రముఖల పోస్ట్‌లు

పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం చేసిన ‘ఆపరేషన్‌ సింధూర్‌’ దాడులకు చిరంజీవి, ఆనంద్ మహీంద్రా, రితేష్ దేశ్ముఖ్‌ వంటి ప్రముఖులు మద్దతు తెలిపారు. ఈ దాడుల్లో 80 మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం.

Key Points

1

పాకిస్థాన్‌పై భారత వైమానిక దాడులు జరిగాయి.

2

'ఆపరేషన్‌ సింధూర్‌' పేరుతో ఉగ్రవాద స్థావరాలపై దాడి జరిగింది.

4

ప్రముఖులు సోషల్ మీడియాలో భారత సైన్యానికి మద్దతు తెలిపారు.

పాకిస్థాన్‌పై భారత దాడులు

పహల్గాం దాడికి ‘ఆపరేషన్‌ సింధూర్‌’ పేరుతో భారత్‌ దీటైన సమాధానం ఇచ్చింది. మంగళవారం అర్ధరాత్రి పాకిస్థాన్‌ 9 ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. దీంతో సుమారు 80మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది. ఆపై కశ్మీర్‌లో  ఉగ్రవాదానికి కారణమైన లష్కరే తొయిబా, జైషే మహమ్మద్‌, హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ సంస్థలకు చెందిన కీలకమైన క్యాంప్‌లను భారత్‌ నేలమట్టం చేసింది. ఇలాంటి సమయంలో భారత ఆర్మీ వెంట తామందరం ఉన్నామంటూ పలువురు ప్రముఖులు పోస్ట్‌లు పెడుతున్నారు. ‘ఆపరేషన్‌ సిందూర్’ అంటూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు.

జై హింద్‌.. ఆపరేషన్‌ సింధూర్‌ – చిరంజీవి

‘ఆపరేషన్‌ సింధూర్‌’ వివరాలు

మా ప్రార్థనలు మా ఆర్మీతోనే ఉంటాయి.. ఒకే దేశం…కలిసి నిలబడతాము -ఆనంద్‌ మహీంద్రా

ప్రముఖుల మద్దతు

జై హింద్‌.. భారత్‌ మాతాకీ జై.. – రితేశ్‌ దేశ్‌ముఖ్‌

భారత సైన్యం చేసిన ధైర్యసాహసాలకు ప్రజలు, ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు. దేశ రక్షణలో సైన్యం పాత్రను ఈ ఘటన మరోసారి చాటుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.