
📌 Key Points
- రూపాయి విలువ అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 96.07కి పడిపోయింది.
- ఇది చరిత్రలో ఎన్నడూ లేని కనిష్ట స్థాయిని నమోదు చేసింది.
- చమురు దిగుమతులు పెరగడం, అంతర్జాతీయ ఒత్తిళ్లే పతనానికి ప్రధాన కారణం.
- ఈ పరిణామం భారత బాహ్య రంగానికి, ఆర్థిక వ్యవస్థకు సవాళ్లను పెంచుతోంది.
భారత ఆర్థిక వ్యవస్థకు షాక్ తగిలింది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేని కనిష్ట స్థాయికి పడిపోయింది. 96.07 వద్దకు చేరిన రూపాయి, అంతర్జాతీయ ఒత్తిళ్లు, చమురు దిగుమతుల భారం కారణంగా తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది.
రూపాయి విలువ ఎందుకు పడిపోయింది?
అమెరికన్ డాలర్ తో పోలిస్తే.. రూపాయి విలువ మరింత పతనమైంది. శుక్రవారం మధ్యాహ్నం ఇన్ ట్రా డే లో గతంలో ఎన్నడూ లేని రీతిలో.. రూపాయి విలువ జీవితకాల కనిష్ఠానికి చేరుకోవడం గమనార్హం. ఈ పరిణామం భారత్ బాహ్య రంగానికి సవాళ్లను మరింత పెంచుతోంది. యూఎస్ డాలర్ తో పోలిస్తే.. రూపాయి విలువ 0.3 శాతం క్షీణించి 96.07 వద్దకు పడిపోయింది. గత సెషన్లో రూపాయి విలువ 95.9575 కనిష్టానికి చేరుగా.. తాజాగా మరింత పతనమై కొత్త రికార్డును నమోదు చేసింది. గ్లోబల్ మార్కెట్లో నెలకొన్న ఒత్తిడుల కారణంగా రూపాయి మారకం విలువ వరుసగా పతనమవ్వడం.. ఆర్థిక వర్గాల్లో ఆందోళనను పెంచుతోంది.
రూపాయి విలువ పతనమవ్వడానికి కారణం.. చమురు దిగుమతులు పెరగడమేనని నిపుణులు చెబుతున్నారు. భారత్ తన అవసరాలకు కావలసిన చమురులో 80 శాతంకంటే ఎక్కువ దిగుమతి చేసుకుంటోందని, దీంతో చమురు ధరలు బ్యారెల్ కు 110 డాలర్లకు చేరగా.. దిగుమతుల భారం పెరిగి డాలర్లకు డిమాండ్ ఏర్పడటం వల్ల రూపాయి విలువ పతనమైనట్లు వివరించారు. ఇంధన దిగుమతుల ఖర్చులు పెరిగితే.. దాని ప్రభావం ట్రేడ్ డెఫిసిట్ పై తీవ్రంగా ఉంటుందని తెలిపారు.
ఆర్థిక వ్యవస్థపై పతనం ప్రభావం
చమురు దిగుమతులే ప్రధాన కారణమా?
రూపాయి పతనం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకోకపోతే, భవిష్యత్తులో మరిన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది.


