|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇంద్రజ సంచలన కామెంట్స్: ఆడవాళ్లే ఇప్పుడు డేంజర్! నెట్టింట్లో మంటలు రేపుతున్న మాటలు!

Published: 23-05-2026, 4:45 PM
ఇంద్రజ సంచలన కామెంట్స్: ఆడవాళ్లే ఇప్పుడు డేంజర్! నెట్టింట్లో మంటలు రేపుతున్న మాటలు!
  • నటి ఇంద్రజ ప్రేమ, మోసాలపై షాకింగ్ వ్యాఖ్యలు.
  • “ఆడవాళ్లే ఇప్పుడు ఎక్కువగా మోసం చేస్తున్నారు” అంటూ సంచలనం.
  • మగాళ్లను మార్చడం ఎవరి వల్ల కాదని ఇంద్రజ స్పష్టీకరణ.
  • సిగ్నేచర్‌ స్టూడియోస్‌ ఇంటర్వ్యూలో వెల్లడించిన కీలక విషయాలు.

టాలీవుడ్ సీనియర్ నటి ఇంద్రజ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశాయి. ప్రేమ, సంబంధాలపై ఆమె వెల్లడించిన సంచలన అభిప్రాయాలు, ముఖ్యంగా ఆడవారిపై చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ షాకింగ్ వివరాలు మీకోసం!

ప్రేమపై ఇంద్రజ సంచలన అభిప్రాయాలు

ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది నటి ఇంద్రజ. ఇప్పుడు జడ్జ్ గా ఆకట్టుకుంటోంది. మరోవైపు సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తూ మెప్పిస్తుంది. ఇటు బిగ్‌ స్క్రీన్‌ని, అటు స్మాల్‌ స్క్రీన్‌ని బ్యాలెన్స్ చేస్తోంది. తనదైన అందంతోపాటు, మంచి మాటలతోనూ అందరిని ఆకట్టుకుంటోంది. ఇప్పటికీ తన హుందాతనాన్ని చాటి చెబుతోంది ఇంద్రజ. ఈ క్రమంలో ఆమె తాజాగా ప్రేమపై, మగాళ్లపై, అదే సమయంలో అమ్మాయిలపై హాట్‌ కామెంట్‌ చేసింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ప్రేమ గుడ్డిది అని పెద్దలు ఊరికే చెప్పలేదని, ప్రేమ విషయంలో మాత్రం ఎదుట ఉన్నవాడు తప్పుడు మనిషి, నన్ను బాగా వాడుకుంటున్నాడు, వీడు నన్ను నడిరోడ్డుపై నిలబెట్టి వెళ్లిపోతాడు, వాడి గురించి ఎన్ని రకాలుగా తెలిసినా కూడా, మళ్లీ మళ్లీ ఆ గుహలోనే పడేందుకు ప్రయత్నిస్తామని చెప్పింది ఇంద్రజ. అలాంటివాళ్లని ఎందుకు ప్రేమిస్తామో తెలియదు, మంచిగా చూసుకుని, రెస్పాన్సిబుల్‌గా ఉన్న వాళ్లపై మనకు ఎందుకు ప్రేమ రాదో తెలియదు, ఎంత ఇబ్బంది పెట్టినా, ఇబ్బంది పడినా, నేను మార్చుకుంటాం. నా ప్రేమ వల్ల మారిపోతాడమనే మూఢనమ్మకం మరోటి లేదని చెప్పింది ఇంద్రజ.

మగాళ్లు మారరు.. ఆడవాళ్లే మోసం చేస్తున్నారు!

ఈ సందర్బంగా మగాళ్లని మార్చడం ఎవరికి వల్ల కాదని చెప్పింది. ఆడవాళ్లు నాలుగు మంచి మాటలు, మాయ మాటలు చెబితే పడిపోతారు, ఏదైనా తనకు ప్రయారిటీ ఇస్తే కరిగిపోతారు. ప్రేమగా చూడటం, నాలుగు మాటలు మాట్లాడటం, వారికోసం టైమ్‌ కేటాయిస్తే సరిపోతుందని తెలిపింది. అయితే ప్రేమించే అమ్మాయిల గురించి తాను మాట్లాడుతున్నానని వెల్లడించింది. కానీ ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు వేరేలా ఉన్నారంటూ షాకింగ్‌ కామెంట్స్ చేసింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇంద్రజ కామెంట్స్

ఆడవాళ్లలో ఇప్పుడు మోసం చేసేవాళ్లే ఎక్కువగా తయారయ్యారు. వాళ్లు ఇప్పుడు మామూలుగా లేరు, ఎవరిని సపోర్ట్ చేసి మాట్లాడటానికి లేని పరిస్థితి ఇప్పుడు ఉంది. ఇప్పటి అమ్మాయిలు మామూలుగా లేరు, అది కూడా భయంగా ఉంది. ఒకప్పుడు అంటే విడదీసి మాట్లాడొచ్చు. కానీ ఇప్పుడు రెండు వైపులా ఉన్నారు. కానీ ఇంత బాగా ప్రేమించే అమ్మాయికి అలా ప్రేమించే అబ్బాయి దొరకడు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అబ్బాయిలకు ఇలాంటి అమ్మాయిలు దొరకతారు. ఒకే మనస్థత్వం ఉన్న వారిని ఆ దేవుడు ఎప్పుడూ కలపడు అని వెల్లడించింది ఇంద్రజ. సిగ్నేచర్‌ స్టూడియోస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంద్రజ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇంద్రజ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆమె అభిప్రాయాలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సినీ వార్తలు, సంచలన అప్‌డేట్స్ కోసం మాతోనే ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.