|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇన్‌స్టాగ్రామ్ ‘ఇన్‌స్టంట్స్’ ఫీచర్: ప్రైవసీకి ముప్పు? టెన్షన్ వద్దు, ఈ సెట్టింగ్ మార్చండి!

Published: 19-05-2026, 5:45 AM
ఇన్‌స్టాగ్రామ్ 'ఇన్‌స్టంట్స్' ఫీచర్: ప్రైవసీకి ముప్పు? టెన్షన్ వద్దు, ఈ సెట్టింగ్ మార్చండి!
  • ఇన్‌స్టాగ్రామ్ కొత్త ‘ఇన్‌స్టంట్స్’ ఫీచర్ ద్వారా ఇన్‌స్టంట్ ఒరిజినల్ ఫొటోలు షేర్ చేయవచ్చు.
  • షేర్ చేసిన ఫొటోలు కొంత సమయం తర్వాత వాటంతట అవే అదృశ్యమవుతాయి.
  • యూజర్లు ప్రైవసీ, పొరపాటున ఫొటోలు పంపడం వంటి సమస్యలతో విసుగు చెందుతున్నారు.
  • ఈ ఫీచర్‌ను ఆఫ్ చేయడానికి లేదా సెట్టింగ్‌లు మార్చడానికి మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

ఇన్‌స్టాగ్రామ్ కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఇన్‌స్టంట్స్’ ఫీచర్ యూజర్లలో ఆందోళన కలిగిస్తోంది. నిజానికి, ఇది తక్షణ ఫోటోలను షేర్ చేయడానికి ఉద్దేశించినప్పటికీ, ప్రైవసీ సమస్యల కారణంగా చాలామంది దీనిని నిలిపివేయాలని కోరుకుంటున్నారు. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది, దానిని ఎలా నియంత్రించాలో తెలుసుకుందాం.

ఇన్‌స్టంట్స్ ఫీచర్: అసలు ఏంటిది?

Instagram Instants Feature ( Image Credit : AI )

Instagram Instants Feature : ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల కోసం అద్భుతమైన ఫీచర్ వచ్చేసింది. కానీ, కొద్ది రోజులకే ఈ ఫీచర్ యూజర్లకు విసుగు పుట్టించింది. ప్రపంచవ్యాప్తంగా ‘ఇన్‌స్టంట్స్’ అనే కొత్త ఫీచర్‌ ఇటీవలే కంపెనీ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఇన్‌స్టంట్ ఒరిజినల్ ఫొటోలను షేర్ చేయొచ్చు అనమాట. మీరు పంపిన ఫొటోలు కొంత సమయం తర్వాత వాటంతట అవే అదృశ్యమవుతాయి.

ఈ ఫీచర్ రియల్ టైమ్ మూవెంట్స్ వెంటనే షేర్ చేసేందుకు (Instagram Instants) అద్భుతంగా ఉంటుందని ఇన్‌స్టాగ్రామ్ చెబుతోంది. కానీ, చాలా మంది ఇన్‌స్టా యూజర్లు ఈ ఫీచర్‌తో విసుగు చెంది మాకొద్దు బాబోయ్ అంటున్నారు.. ఈ ఫీచర్ ఎలా ఆఫ్ చేయాలా? అని తెగ సెర్చ్ చేస్తున్నారు. అసలు ఈ ఫీచర్ ఎలా వర్క్ అవుతుందో తెలియక కొందరు యూజర్లు పొరపాటున ఫొటోలను పంపించారు.

ఫస్ట్ టైమ్ కొత్త ‘ఇన్‌స్టాంట్స్’ ఫీచర్ వాడుతున్నారా? : మీరు కూడా ఫస్ట్ టైమ్ ఇన్‌స్టాగ్రామ్ కొత్త ‘ఇన్‌స్టాంట్స్’ సెక్షన్ ఓపెన్ చేస్తే.. ఇన్‌బాక్స్ రైట్ బాటమ్ కార్నర్ వద్ద స్మాల్ ఫొటోల గ్రూపుపై ట్యాప్ చేయాలి. యాప్ మొదట ఈ ఫీచర్ గురించి ఒక స్మాల్ ఇంట్రడక్షన్ చూపిస్తుంది. ఇన్‌స్టంట్స్‌లో పంపిన ఫొటోలు కొంత కాలం తర్వాత వాటంతట అవే అదృశ్యమవుతాయని వ్యూ లిస్టు ఉండదని, రియాక్షన్‌లు, రిప్లైలు పూర్తిగా ప్రైవేట్‌గా ఉంటాయని అందులో పేర్కొంది.

యూజర్లకు ఎందుకు నచ్చడం లేదు?

ఆ తర్వాత ఇన్‌స్టంట్‌లను ఎలా చూడాలి? వాటికి ఎలా రెస్పాండ్ అవ్వాలో యాప్ మీకు చూపిస్తుంది. మీరు కెమెరా సెక్షన్ వద్ద దిగువన ఒక షట్టర్ బటన్ ఉంటుంది. అక్కడ ‘Friends’ ‘Closest Friends’ మధ్య ఎంచుకునే టోగుల్ ఆప్షన్ ఉంటుంది.

Read Also : Gold Price Today May 19 : బంగారం ధరలు మళ్లీ పెరిగాయి..! ఇప్పట్లో తగ్గే ఛాన్స్ లేదా? ఏపీ, తెలంగాణలో తులం రేటు ఇదే

డిఫాల్ట్‌గా, ఇది ‘Friends’కు సెట్ అయి ఉంటుంది. కొన్నిసార్లు పొరపాటున రాంగ్ ఫొటోలను పంపుతుంటారు. కానీ, ఇప్పుడు మెటా ఫోటో పంపిన తర్వాత ‘Cancel’ చేసే ఆప్షన్ కూడా అందిస్తోంది. చాలా మంది ఇది గమనించరు. కొంతమందికి ఫోటో పంపిన విషయం కూడా తెలియకపోవచ్చు.

ఇన్‌స్టాగ్రామ్ వంటి యాప్‌లలో సాధారణంగా తమ పోస్ట్‌లను షేర్ చేసే ముందు వాటిని రివ్యూ చేసి ఎడిట్ చేస్తారు. ప్రస్తుతం ఈ ఫీచర్ యూజర్ల ప్రైవసీకి ఇబ్బందిగా మారింది. అందుకే చాలామంది ఈ ఫీచర్‌ను వాడేందుకు ఇష్టపడటం లేదు. అయితే, మీరు ఈ ఫీచర్ ఎలా స్టాప్ చేయాలి? పొరపాటున పంపిన ఫొటోను ఎలా అన్ సెండ్ చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఇన్‌స్టంట్స్ ఫీచర్ ఎలా ఆఫ్ చేయాలి?

ఇన్‌స్టంట్స్‌ను ఎలా ఆఫ్ చేయాలి? : కొత్త ఇన్‌స్టంట్స్ ఫీచర్‌ ఆఫ్ చేసేందుకు మీ ప్రొఫైల్‌కు వెళ్లండి. సెట్టింగ్స్‌ కోసం రైట్ సైడ్ టాప్ కార్నర్‌లో ఉన్న త్రి లైన్ మెనూపై క్లిక్ చేయండి. ఆ తర్వాత కిందికి స్క్రోల్ చేసి ‘కంటెంట్ ప్రిఫరెన్సెస్’ ఆప్షన్‌కు వెళ్లండి. ఇక్కడ, మీకు ‘Hide Instants inbox’ అనే టోగుల్ కనిపిస్తుంది. అది ఆన్ చేయండి. మీరు ఈ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత ఇన్‌స్టంట్స్ ఫీచర్ మీ ఇన్‌బాక్స్‌లో ఇకపై కనిపించదు.

అలాగే, ఇతరులు పంపిన ఇన్‌స్టంట్స్ కూడా మీకు కనిపించవు. ఈ ఫీచర్‌ను పూర్తిగా ఆఫ్ చేయొద్దని అనిపిస్తే.. మీ ఇన్‌బాక్స్‌లోని ఇన్‌స్టంట్‌ల గ్రూపుపై ట్యాప్ చేసి పట్టుకుని, ఆపై రైట్ సైడ్ స్వైప్ చేయండి. ఇలా చేస్తే ఇన్‌స్టంట్‌లను పొందడం టెంపరరీగా ఆగిపోతుంది.

ఇన్‌స్టంట్‌లను ఎలా అన్‌సెండ్ చేయాలి : మీరు ఇన్‌స్టంట్ పంపిన వెంటనే షట్టర్ బటన్ కింద ‘Undo’ ఆప్షన్ కనిపిస్తుంది. అవతలి వ్యక్తి ఇంకా ఫొటోను చూడకపోతే మీరు వెంటనే వెనక్కి తీసుకోవచ్చు. లేదా మీ ఆర్కైవ్‌ను యాక్సెస్ చేసి అక్కడి నుంచి ఇన్‌స్టంట్‌ను డిలీట్ చేయొచ్చు. మీరు కెమెరా స్క్రీన్ రైట్ టాప్ కార్నర్ లో ఉన్న ఫోర్ బాక్స్ ఐకాన్‌ను ట్యాప్ చేయవచ్చు. తద్వారా ఇంకా ఫొటోను ఓపెన్ చేయని స్నేహితులకు కనిపించదు.

ఇన్‌స్టాగ్రామ్ ‘ఇన్‌స్టంట్స్’ ఫీచర్ యూజర్ల ప్రైవసీకి ఇబ్బందిగా మారిన నేపథ్యంలో, దాని సెట్టింగ్‌లను మార్చుకోవడం అత్యవసరం. మీ వ్యక్తిగత సమాచారం, ఫోటోలు సురక్షితంగా ఉండాలంటే, ఈ ఫీచర్‌ను నియంత్రించే మార్గాలను తెలుసుకోవడం తెలివైన పని.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.