|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇన్‌స్టాలో భూకంపం: కోట్లాది ఫాలోవర్లు గల్లంతు! సెలబ్రిటీల నకిలీ ఫాలోయింగ్‌కు మెటా చెక్!

Published: 07-05-2026, 1:30 PM
ఇన్‌స్టాలో భూకంపం: కోట్లాది ఫాలోవర్లు గల్లంతు! సెలబ్రిటీల నకిలీ ఫాలోయింగ్‌కు మెటా చెక్!
  • మెటా చేపట్టిన ‘మహా ప్రక్షాళన’లో కోట్లాది నకిలీ, ఇన్‌యాక్టివ్ ఫాలోవర్లు తొలగించబడ్డారు.
  • కైలీ జెన్నర్ 14 మిలియన్లు, క్రిస్టియానో రొనాల్డో 8 మిలియన్ల ఫాలోవర్లను కోల్పోయారు.
  • ప్రియాంక చోప్రా, విరాట్ కోహ్లీ వంటి భారతీయ సెలబ్రిటీల ఫాలోవర్లు కూడా గణనీయంగా తగ్గారు.
  • ఇన్‌స్టాగ్రామ్ విశ్వసనీయత పెంచడమే ఈ ప్రక్షాళన ప్రధాన లక్ష్యమని తెలుస్తోంది.

ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా చేపట్టిన ‘మహా ప్రక్షాళన’తో సోషల్ మీడియా ప్రపంచం ఉలిక్కిపడింది. ఒక్క రాత్రిలో కోట్లాది నకిలీ, ఇన్‌యాక్టివ్ ఫాలోవర్లు తొలగించబడటంతో సెలబ్రిటీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ నిర్ణయం ఇన్‌స్టా విశ్వసనీయతను పెంచే దిశగా ఒక కీలక అడుగు.

మెటా కటింగ్: ఎంతమందిని కోల్పోయారు?

Instagram Purge : ఇన్స్టాలో మా స్టార్ కి పది మిలియన్ల ఫాలోవర్స్ కి ఉన్నారంటే, మావాడికి అంతకు రెండితలు ఎక్కువే అంటూ నెట్టింట ఫ్యాన్స్ వార్ జరగడం మనం చూస్తూనే ఉంటాం.కానీ ఆ మిలియన్ల ఫాలోవర్స్ అంతా తూచ్ అంటూ అసలు రంగు బయటెట్టేసింది ఇన్‌స్టా మాతృసంస్థ ‘మెటా’.ఫేక్, నకిలీ,కొనుకోబడిన ఖాతాలన్నీ మొహమాటం లేకుండా ఏరేసే పనిలో పడింది.దీంతో ..నిన్నటి దాకా మిలియన్ల కొద్దీ ఫాలోవర్లతో ఆకాశంలో చక్కర్లు కొట్టిన తారలు ఇన్‌స్టాగ్రామ్ తీసుకున్న క్రేజీ డిసీషన్ తో ఒక్కసారిగా భూమ్మీదకి వచ్చి పడ్డారు.దీంతో వరల్డ్ వైడ్ గా ఇన్‌స్టాగ్రామ్ డిసీషన్ ని ‘గ్రేట్ పర్జ్ ఆఫ్ 2026’ (Great Purge of 2026) అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు నెటిజన్స్.

మెటా కటింగ్ ఏ స్థాయిలో ఉందంటే

మెటా ఏ స్థాయిలో ఎరేస్తుందంటే అమెరికన్ బిజినెస్ ఉమెన్ కైలీ జెన్నర్ ఏకంగా 14 మిలియన్ల ఫాలోవర్లను కోల్పోయియెంత. ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఖాతా నుంచి 8 మిలియన్ల మంది మాయమైపోయెంత.ఇక వీరే కాదండోయ్ మన ఇండియన్ సెలెబ్రెటీ ల ఖాతాల నుండి కూడా గట్టిగానే కోత పడింది. అవును గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మిలియన్ మందిని, కింగ్ విరాట్ కోహ్లీ 2 మిలియన్ల ఫాలోవర్లను కోల్పోయారు. వీరితో పాటు టేలర్ స్విఫ్ట్, జస్టిన్ బీబర్, కె-పాప్ సెన్సేషన్స్ బీటీఎస్, బ్లాక్‌పింక్ వంటి టాప్ అకౌంట్స్ అన్నీ కళ తప్పాయంటే మెటా కటింగ్ ఏ స్థాయిలో ఉందొ అర్థమవుతుంది.

ఇన్‌స్టాగ్రామ్‌పై మరింత విశ్వసనీయత

ఇన్‌స్టాగ్రామ్‌పై మరింత విశ్వసనీయత

అయితే ఇన్‌స్టా మాతృసంస్థ ‘మెటా’చేస్తున్న ఈ ‘సర్జికల్ స్ట్రైక్’ వెనుకాల సాలిడ్ రీజన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌పై మరింత విశ్వసనీయత పెంచే క్రమంలో బాట్ అకౌంట్స్ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్స్ ద్వారా సృష్టించిన నకిలీ అకౌంట్స్ ని,ఏళ్ల తరబడి లాగిన్ అవ్వకుండా ఉన్న ఇన్-యాక్టివ్ అకౌంట్స్ ని, అనవసరమైన లింకులు, ప్రకటనలు పంపే ఫేక్ ఐడీలని ,డబ్బులు ఇచ్చి కొనుకున్న ఫేక్ ఫాలోవర్లని ఏరివేసే పనిలో పడింది.అయితే అఫీషియల్ గా మెటా ఈ విషయంపై అనౌన్స్ చేయనప్పటికీ ఈ ‘క్లీనింగ్ ప్రోగ్రాం వల్ల సెలబ్రిటీల అసలు రంగు బయటపడుతోందని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు .

సెలబ్రిటీల ఫాలోయింగ్ అంతా ఉత్తదేనా?

సెలబ్రిటీల ఫాలోయింగ్ అంతా ఉత్తదేనా?

ఇక ఈ ఏరివేతతో ఇంతకాలం సెలబ్రిటీల ఫాలోయింగ్ అంతా ఉత్తదేనా? అనే ప్రశ్న నెట్టింట హాట్ టాపిక్ అయిపొయింది. థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఫాలోవర్లను పెంచుకుని, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా కోట్లు గడిస్తున్న వారికి ఒకరకంగా ఇది గట్టి దెబ్బే అని చెప్పాలి.

ఏది ఏమైనా ఇన్‌స్టాగ్రామ్‌పై మరింత విశ్వసనీయత పెంచేలా, ఎక్కువ మందికి చేరవేసేలా,స్పామ్ యాక్టివిటీ, ఫేక్ ఎంగేజ్‌మెంట్‌ను కంట్రోల్ చేయడానికి మెటా తీసుకున్న ఈ నిర్ణయం మేచుకోతగ్గదే.ఇక ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ రంగంలో ఈ ఏరివేత ఊహించని మార్పులు తీసుకురావడం పక్కగా కనిపిస్తుంది. బ్రాండ్లు ఇకపై కేవలం ఫాలోవర్ల నంబర్లను చూసి కాకుండా, అసలైన ఎంగేజ్‌మెంట్‌ను బట్టి ఒప్పందాలు చేసుకునే అవకాశాలే ఎక్కువ.చూడాలి ముందు ముందు ఈ మెటా అడుగులు ఇంకెటు వైపు పడతాయో !

ఈ ప్రక్షాళన సెలబ్రిటీల అసలు ఫాలోయింగ్‌ను బయటపెట్టింది. నకిలీ ఫాలోవర్ల యుగానికి ముగింపు పలికి, ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫారమ్‌పై నిజమైన కంటెంట్ సృష్టికర్తలకు, వారి నిజమైన అభిమానులకు మరింత విలువను తెస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.