|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఐపీఎల్‌లో నేడు బిగ్ ఫైట్: గెలుపు ఎవరిదో?

Published: 11-04-2026, 10:05 PM
ఐపీఎల్‌లో నేడు బిగ్ ఫైట్: గెలుపు ఎవరిదో?
  • లక్నోలో LSG vs GT మధ్య మొదటి మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం.
  • రెండవ మ్యాచ్ ముంబై ఇండియన్స్(MI) vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) సాయంత్రం 7:30 గంటలకు.
  • లక్నో పిచ్ బౌలర్లు, బ్యాటర్లకు సమానంగా సహకరిస్తుంది, స్పిన్నర్లకు అనుకూలం.
  • వాంఖడే స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలం, భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది.

ఐపీఎల్ సందడిలో భాగంగా ఈరోజు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. లక్నోలో లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనుండగా, ముంబైలో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీ పడనున్నాయి.

లక్నోలో LSG vs GT పోరు

ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం క్రికెట్ అభిమానులకు మరో డబుల్ ధమాకా సిద్ధంగా ఉంది. నేటి మ్యాచ్‌లు పాయింట్ల పట్టికలో సమీకరణాలను మార్చే అవకాశం ఉండటంతో నేటి మ్యాచులపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు క్రికెట్ లవర్స్. లక్నోలో జరిగే మొదటి మ్యాచ్, ముంబై వాంఖడే వేదికగా జరిగే రెండో మ్యాచ్ ప్రేక్షకులకు అసలైన వినోదాన్ని పంచనున్నాయి.

మధ్యాహ్నం 3:30 గంటలకు – LSG vs GT

ముంబైలో MI vs RCB హోరాహోరీ మ్యాచ్

మొదటి మ్యాచ్ లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో LSG vs GT జట్ల మధ్య జరగనుంది. లక్నో సూపర్ జెయింట్స్ తమ సొంత మైదానంలో గుజరాత్ టైటాన్స్‌ను ఎదుర్కోనుంది. ఈ పిచ్ సాధారణంగా బౌలర్లకు, బ్యాటర్లకు సమానంగా కలిసి వస్తుంది. కానీ స్పిన్నర్లకు కొంత ఎక్కువ సహకరించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గుజరాత్ టైటాన్స్ తన బౌలింగ్ విభాగంతో లక్నో బ్యాటర్లను కట్టడి చేయాలని చూడగా, లక్నో సొంత గడ్డపై విజయం సాధించి పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకాలని పట్టుదలగా ఉంది.

సాయంత్రం 7:30 గంటలకు – MI vs RCB

గెలుపు ఎవరిదో, పాయింట్ల పట్టికలో మార్పులు ఎలా ఉండబోతున్నాయో చూడాల్సిందే!

రెండో మ్యాచ్ ఐపీఎల్ లో అత్యంత ఆసక్తికరమైన పోరుగా భావించే ముంబై ఇండియన్స్(MI), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) మధ్య జరగనుంది. వాంఖడే స్టేడియం అంటేనే పరుగుల వరద పారే వేదిక. ఇక్కడ పిచ్ బ్యాటింగ్‌కు ఎంతో అనుకూలిస్తుంది, కాబట్టి బౌండరీల మోత గ్యారెంటీ. ముంబై తన సొంత మైదానంలో ఫ్యాన్స్ మద్దతుతో విజృంభించాలని చూస్తుంటే, కోహ్లీ సేన (RCB) బ్యాటింగ్ లైనప్ వాంఖడేలో భారీ స్కోర్లను నమోదు చేసే అవకాశం ఉంది. రెండు జట్లలోనూ విధ్వంసకర బ్యాటర్లు ఉండటంతో ఈ మ్యాచ్ భారీ స్కోరింగ్ గేమ్‌గా మారుతుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఏ జట్లు గెలిచి పాయింట్ల టేబుల్ లో దూసుకు వెళతాయో వేచి చూడాల్సిందే.

మొత్తానికి, ఈరోజు రెండు మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులకు కన్నుల పండుగగా ఉండనున్నాయి. ఏ జట్లు గెలుస్తాయో, పాయింట్ల పట్టికలో ఎలా దూసుకుపోతాయో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.